ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపస్‌లో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా సీనియర్ రెసిడెంట్/సీనియర్ డెమోన్‌స్ట్రేటర్లను భర్తీ చేయనున్నారు. మూడేళ్ల కాలవ్యవధికి ఈ పోస్టులను తీసుకోన్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా వీటిన భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఇంటర్వ్యూను ఏ తేదీల్లో నిర్వహించనున్నారు లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఎంఎస్, డీఎన్‌బీ, ఎండీ, ఎండీఎస్, ఎంసీహెచ్ ఉత్తీర్ణులై ఉండాలి.
* అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించకూడదు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ముందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ. 500, ఇతరులు రూ. 1000 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ వేతంగా రూ. 67,700 చెల్లిస్తారు.
* ఇంటర్వ్యూలను ఏప్రిల్ 14, 2023 తేదీన అడ్మిన్ అండ్ లైబ్రరీ బిల్డింగ్, ఎయిమ్స్ మంగళగిరి, గుంటూరు జిల్లాలో నిర్వహించనున్నారు.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..