
AIBE 16 Result 2021-22: ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్ ఫలితాల కోసం ఎంతోకాలంగా ఎదురుస్తున్న అభ్యర్థుల నిరీక్షణ ఇప్పుడు ముగిసింది. ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 16 (AIBE 16 ) ఫలితాలను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు allindiabarexamination.com లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఏఐబిఈ రాత పరీక్ష 31అక్టోబర్, 2021న నిర్వహించగా.. ఆన్సర్ కీ 5 నవంబర్, 2021న విడుదల చేశారు. ఆన్సర్ కీ పై అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలిపేందుకు 18 నవంబర్, 2021 వరకు అవకాశం ఇచ్చారు. తాజాగా ఇప్పుడు ఫలితాలను విడుదల చేసింది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.
AIBE 16 ఫలితాలను ఎలా చెక్ చేయాలంటే..
1- ఫలితాలను చూడటానికి ముందుగా allindiabarexamination.com అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
2. ఆ తర్వాత “AIBE 16 Results 2021” లింక్‌పై క్లిక్ చేయండి.
3. తరువాత ఓపెన్ అయ్యే పేజీలో అడిగిన సమాచారాన్ని ఫిల్ చేయాలి.
4. లాగిన్ అయిన వెంటనే, రిజల్ట్ మీకు కనిపిస్తుంది.
5. రిజల్ట్స్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి. భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్‌అవుట్ తీసుకోవాలి.
అర్హత సాధించిన అభ్యర్థులందరికీ న్యాయస్థానంలో లా ప్రాక్టీస్ చేయడానికి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ (COP) ఇవ్వబడుతుంది. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారిక సైట్ allindiabarexamination.com సందర్శించవచ్చు.
Also read:
Fire Accident: మంచిర్యాల జిల్లాలో ఘోర ప్రమాదం.. గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం..
Chanakya Niti: చాణక్య చెప్పిన ఈ 5 సూత్రాలు.. మీ వ్యక్తిత్వాన్నే మార్చేస్తాయి..