Navodaya Admissions 2025: తెలంగాణ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు.. జులై 14 నుంచి తరగతులు ప్రారంభం

రాష్ట్రంలో గతేడాది నవంబరులో కొత్తగా 7 నవోదయ విద్యాలయాలు మంజూరైన సంగతి తెలిసిందే. కొత్తగూడెం, జగిత్యాల, మహబూబ్‌నగర్, మేడ్చల్‌-మల్కాజిగిరి, నిజామాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలకు జవహర్‌ నవోదయ విద్యాలయా (జేఎన్‌వీ)లు మంజూరయ్యాయి. ఈ 7 నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పించనున్నట్లు..

Navodaya Admissions 2025: తెలంగాణ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు.. జులై 14 నుంచి తరగతులు ప్రారంభం
Navodaya Admissions

Updated on: Jun 18, 2025 | 7:43 AM

హైదరాబాద్‌, జూన్‌ 18: తెలంగాణ రాష్ట్రంలో గతేడాది నవంబరులో కొత్తగా 7 నవోదయ విద్యాలయాలు మంజూరైన సంగతి తెలిసిందే. కొత్తగూడెం, జగిత్యాల, మహబూబ్‌నగర్, మేడ్చల్‌-మల్కాజిగిరి, నిజామాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలకు జవహర్‌ నవోదయ విద్యాలయా (జేఎన్‌వీ)లు మంజూరయ్యాయి. ఈ 7 నవోదయ విద్యాలయాల్లో ఈ విద్యా సంవత్సరం (2025-26) నుంచే ఆరో తరగతి ప్రవేశాలు జరగనున్నట్లు తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటికే 9 పాత విద్యాలయాలుండగా వాటిలో ప్రవేశాలు ముగిశాయి. కొత్త వాటిల్లో ఆరో తరగతి ప్రవేశాలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. వీటిల్లో జులై 14 నుంచి తరగతులు మొదలవుతాయని తెలిపారు.

నిమ్స్‌ ఎంహెచ్‌ఎం కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్‌.. దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌)లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మాస్టర్‌ ఇన్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ (ఎంహెచ్‌ఎం) కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ నిమ్మ సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. రెండేళ్ల కోర్సు పూర్తైన తర్వాత 6 నెలల పాటు ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ కోర్సుల్లో 20 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. డిగ్రీ అర్హత కలిగిన విద్యార్థులు ఎవరైనా జూన్‌ 28, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తు ఫాంను డౌన్‌లోడ్ చేసి జులై 2 లోపు ఆసుపత్రిలో అందించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.