Salary: కరోనా కారణంగా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి, ఎంతో మంది ఉద్యోగులు రోడ్డు మీద పడ్డారు. అయితే ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గింది. మళ్లీ ఆర్థిక వ్యవస్థ గాడినపడుతోంది. ఉద్యోగ నియామకాలు సైతం ఊపందుకుంటున్నాయి. తాజాగా మళ్లీ ఆర్థిక మంద్యం తప్పదనన్న వాదనలు వినిపిస్తోన్న సమయంలో విల్లిస్ టవర్స్ వాట్సన్ అనే సంస్థ విడుదల చేసిన నివేదిక కాస్త ఊరట కలిగించింది. భారత్‌లోని పలు కంపెనీలు వచ్చే ఏడాది తమ ఉద్యోగులకు 10 శాతం వేతనం పెంచే అవకాశం ఉందని అడ్వైజరీ, బ్రోకింగ్, సొల్యూషన్స్ కంపెనీ విల్లిస్ టవర్స్ వాట్సన్ నివేదికలో వెల్లడించింది.
ప్రస్తుత ఏడాదిలో ఉద్యోగుల జీతాలు 9.5 శాతం అధికం అయ్యాయని పేర్కొంది. వచ్చే ఏడాది జీతాలు 10 – 10.4 శాతం పెరగనున్నాయని తెలిపింది. ముఖ్యంగా ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్, టెక్నాలజీ, మీడియా, గేమింగ్ రంగాల్లో వేతనాలు అత్యధికంగా 10 – 10.4 శాతం పెరగనున్నాయి. 2022లోనూ ఈ రంగాల్లో జీతాలు పెరిగాయి. 2023 ఆర్థిక ఏడాదిలోనూ ఇదే ట్రెండ్ కొనసాగనుంది. పలు సంస్థల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను వెల్లడించారు. దీని ప్రకారం గతేడాదితో పోలిస్తే వచ్చే ఏడాది 58 శాతం కంపెనీలు జీతాల పెంపుదల కోసం బడ్జెట్‌ను కేటాయించారు.
ఇక వచ్చే ఏడాది డిజిటల్ నైపుణ్యాలున్న వారికి డిమాండ్ ఉంటుందని నివేదిక తెలిపింది. వచ్చే 12 నెలల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, అమ్మకాలు, సాంకేతికంగా నైపుణ్యం కలిగిన వ్యాపారాలు, ఫైనాన్స్ రంగాల్లో నియామకాలు భారీగా ఉండనున్నాయి. డిజిటల్ స్కిల్స్ ఉన్న వారికి డిమాండ్ ఉండడం వేతనాల పెంపునకు కారణమవుతుంది నివేదిక వెల్లడించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..