Salary Hike 2022: కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. మునుపెన్నడూ లేని విధంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. దీంతో సహాజంగానే ఈ ప్రభావం ఉద్యోగాల నియామకాలపై పడింది. చాలా వరకు సంస్థలు ఉద్యోగులను తగ్గించుకోవడం లేదా జీతాలను తగ్గిస్తూ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేశాయి. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతుండడంతో ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఉద్యోగాల కల్పనలోనూ వేగం పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉద్యోగ నియామకాలు కూడా పెరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే వచ్చే ఏడాది ఉద్యోగుల జీతాలు ఏమేర పెరగనున్నాయన్న విషయంపై ‘అయాన్’ కన్సల్టింగ్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 2020లో వివిధ రంగాల్లో ఉద్యోగుల జీతాలు సగటను 9.4 శాతం పెరగవచ్చని సంస్థ అంచనా వేసింది. స్థిరాస్తి రంగానికి చెందిన సంస్థలు కూడా 8.8 శాతం జీతాలు పెంచాలని భావిస్తోందని తేలింది. 2018లో సగటు పెరుగుదల 9.5 శాతం ఉందని అంచనా వేసిన అయాన్ సర్వే.. గతంలో 2 అంకెల స్థాయిలో వేతనాలు పెరిగినా, 2017 ఆ తర్వాత భారత్‌లో సగటు ఇంక్రిమెంట్ గణాంకాలు 9.3% కన్నా తక్కువకి చేరాయని తెలిపింది. గతేడాది జీతాల పెంపు 6.1 శాతం ఉండగా.. ఈ ఏడాది 8.8 శాతంగా ఉంటుందని సర్వే చెబుతోంది.
రానున్న రోజుల్లో టెక్నాలజీ, ఈ-కామర్స్, ఐటీ ఆధారిత సేవా రంగాల్లో జీతాల పెంపు అధికంగా ఉంటుందని సర్వేలో తేలింది. ఇదిలా ఉంటే హాస్పిటాలిటీ, ఇంజినీరింగ్ సేవలు, ఎనర్జీ రంగాల్లోని ఉద్యోగులకు మాత్రం జీతాల పెంపు తక్కువగా ఉండొచ్చని సర్వేలో తేలింది. సర్వేలో భాగంగా 39 రంగాలకు చెందిన 1300 కంపెనీల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఇలా ఏ రకంగా చూసుకున్నా 2022లో ఉద్యోగులకు మేలు జరగనుందని తెలుస్తోంది.
Also Read: Viral Video: తాబేళ్లు పరిగెత్తడం మీరెప్పుడైనా చూశారా.? అయితే ఈ వీడియో మీకోసమే.!
Arvind Swami : అందుకే ‘తలైవి’ సినిమా ఒప్పుకున్నా.. ఆసక్తికర విషయాలు తెలిపిన అరవింద స్వామి..
షాకింగ్.! జాతీయ రహదారిపై కుప్పలు తెప్పలుగా కండోమ్స్.. అసలు ఏమైందంటే.?