Telugu News Education Career Jobs 9.8 lakh students will appear for Inter annual exams for 2025 26 academic Year in Telangana, here full tim e table
Intermediate Exams 2026: ఈసారి ఇంటర్ పరీక్షలు రాయనున్న 9.8 లక్షల విద్యార్థులు.. పూర్తి టైం టేబుల్ ఇదే
రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఇప్పటికే పరీక్షల షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9.8లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు..
హైదరాబాద్, డిసెంబర్ 3: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఇప్పటికే పరీక్షల షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9.8లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మంగళవారం వరకు 9,79,506 మంది విద్యార్థులు ఫీజు చెల్లించినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. వార్షిక పరీక్షలు 2026 ఫిబ్రవరి 25 నుంచి మార్చి 17 వరకు జరుగనున్నాయి.
ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షకు రూ.100 ఫీజును బోర్డు వసూలు చేస్తుంది. ఫస్ట్ ఇయర్ జనరల్ కోర్సుల విద్యార్థులు రూ.630, ఒకేషనల్ విద్యార్థులు రూ.870 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఇక సెకండ్ ఇయర్ ఆర్ట్స్‌కు రూ.630, సైన్స్, ఒకేషనల్ విద్యార్ధులు రూ.870 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. రూ.2 వేల ఆలస్య రుసుంతో డిసెంబరు 15 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది.