Degree Students: డిగ్రీ విద్యార్ధులకు ఇక మూడినట్లే.. 75 శాతం హాజరు లేకుంటే ఇకపై ఆ బెనిఫిట్స్‌ కట్‌!

ఉన్నత విద్యా సంస్థల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే విద్యా సంవత్సరంలో కనీసం 75 శాతం హాజరు లేకుంటే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొందేందుకు అర్హత ఉండదని తాజాగా ఆయా యూనివర్సిటీల వీసీలతో నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో..

Degree Students: డిగ్రీ విద్యార్ధులకు ఇక మూడినట్లే.. 75 శాతం హాజరు లేకుంటే ఇకపై ఆ బెనిఫిట్స్‌ కట్‌!
Student Attendance

Updated on: May 30, 2025 | 2:05 PM

హైదరాబాద్‌, మే 30: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యా సంస్థల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే విద్యా సంవత్సరంలో కనీసం 75 శాతం హాజరు లేకుంటే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొందేందుకు అర్హత ఉండదని తాజాగా ఆయా యూనివర్సిటీల వీసీలతో నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ బాలకిష్టారెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఏడు యూనివర్సిటీల వీసీలతో మే 29న సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిగ్రీలో విద్యార్ధులకు కనీసం 75 శాతం హాజరు ఉండాలని నిర్ణయించారు. లేకుంటే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత ఉండదని స్పష్టం చేశారు.

నిజానికి, గతంలోనే ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ అది అమలు కావడం లేదని ఈ సమావేశంలో వీసీలు ప్రస్తావించారు. దీంతో ఈసారి మాత్రం హాజరును ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు తప్పనిసరి చేయాలని, ఈ ఆదేశాలను అమలు చేయాలని నిర్ణయించారు. ఇలా చేయడం వల్ల కొంత వరకు విద్యానాణ్యత పెరుగుపడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే ఇప్పటివరకు మూడేళ్ల డిగ్రీకి 150 క్రెడిట్లు ఉన్నాయి. వాటిని 142కు కుదించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

ఏపీ లాసెట్‌ 2025 హాల్‌టికెట్స్‌ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్‌ లా కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌- 2025 (ఏపీ లాసెట్‌) హాల్‌టికెట్లు తాజాగా విడుదలయ్యాయి. ఈ మేరకు ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (APSCHE) వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌, హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక రాత పరీక్ష జూన్‌ 5న రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

ఏపీ లాసెట్‌ 2025 హాల్‌టికెట్స్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.