Jobs: ఆ రంగంలో పది లక్షల మంది ఉద్యోగులు అవసరం: టీసీఎస్‌ ప్రెసిడెంట్

|

Feb 15, 2024 | 7:02 AM

బుధవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో హైసియా (హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌), ఎస్‌టీపీఐ (సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా) ఉమ్మడిగా 31వ నేషనల్‌ సమిట్‌ అవార్డ్స్‌ సదస్సును ‘ఏఐ: సెలబ్రేటింగ్‌ ద ఫ్యూచర్‌’ పేరిట నిర్వహించాయి. ఇందులో రాజన్న మాట్లాడుతూ..

Jobs: ఆ రంగంలో పది లక్షల మంది ఉద్యోగులు అవసరం: టీసీఎస్‌ ప్రెసిడెంట్
Jobs
Follow us on

ప్రస్తుతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తోంది. దాదాపు అన్ని రంగాల్లో ఈ కొత్త టెక్నాలజీ వినియోగం అనివార్యంగా మారింది. అందుకే ఈకామర్స్‌ సంస్థలు మొదలు సోషల్‌ మీడియా సైట్స్‌ వరకు ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తాయి. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో ఈ రంగంలో భారీగా ఉద్యోగవకాశాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు ఇప్పటికే చెబుతున్నారు.ఈ క్రమంలోనే తాజాగా టీసీఎస్‌ ప్రెసిడెంట్ వి. రాజన్న ఏఐ రంగంలో ఉపాధి అవకాశాల గురించి పలు ఇంట్రెస్టింగ్‌ విషయాలు తెలిపారు.

బుధవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో హైసియా (హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌), ఎస్‌టీపీఐ (సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా) ఉమ్మడిగా 31వ నేషనల్‌ సమిట్‌ అవార్డ్స్‌ సదస్సును ‘ఏఐ: సెలబ్రేటింగ్‌ ద ఫ్యూచర్‌’ పేరిట నిర్వహించాయి. ఇందులో రాజన్న మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఏఐ ఆర్థిక వ్యవస్థ ఏటా 39.4% వృద్ధి సాధిస్తోందని తెలిపారు. అంతర్జాతీయంగా ఏఐ అభివృద్ధిలో భారత్‌ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. నీతి ఆయోగ్‌ ప్రత్యేకంగా ‘అందరికీ ఏఐ’ పేరుతో ప్రత్యేక పథకాన్నీ తీసుకొచ్చిందని చెప్పుకొచ్చారు.

ఇక 2026 నాటికి భారత దేశంలో ఏకంగా 10 లక్షల మంది ఏఐ నిపుణులు అవసరమవుతారని ఆయనతెలిపారు. సంస్థలతోపాటు ప్రభుత్వాలూ ఏఐని ఉపయోగించుకోవడంలో ముందుంటాయన్న రాజన్న, 2 కోట్ల మందికి పైగా భక్తులు పాల్గొనే మేడారం జాతర సజావుగా సాగేందుకు తెలంగాణ పోలీసులు ఏఐ, డ్రోన్‌ సాంకేతికతను ఉపయోగిస్తున్నారని గుర్తుచేశారు. అలాగే పంట దిగుబడిని పెంచడంలోనూ ఏఐని ఉపయోగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. తయారీ రంగంలో సమర్థత, ఉత్పత్తి పెంపు, ఖర్చు నియంత్రణ ఏఐతోనే సాధ్యమేన్న రాజన్న ఏఐ ప్రపంచ రాజధానిగా మారేందుకు హైదరాబాద్‌కు అన్ని అవకాశాలు ఉన్నాయన్న స్పష్టం చేశారు.

ఇక ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫైనల్ ఇయర్‌ విద్యార్థులకు ఐటీ సంస్థలు కొన్ని నెలల పాటు ఇంటర్న్‌షిప్‌ ఇవ్వాలని తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ సూచించారు. ఇందుకోసం ప్రభుత్వమూ చర్యలు తీసుకుంటోందని తెలిపారు. హైసియా దీనికి సహకరించాలని ఆయన కోరారు. అలాగే ఏఐ టెక్నాలజీ గురించి టెక్‌ మహీంద్రా మాజీ సీఈ, ఎండీ సీసీ గుర్నాని మాట్లాడుతూ.. ఏఐని ఆపరేటింగ్‌ సిస్టమ్‌గా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని సత్య నాదెళ్ల చెప్పిన సంగతిని ఆయన గుర్తు చేశారు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..