Breaking News
  • మహబూబ్‌నగర్‌లో టెండర్‌ ఓటు నమోదు. 41వ వార్డులో 198వ పోలింగ్‌ కేంద్రంలో టెండర్‌ ఓటు నమోదు. ఘటనపై జిల్లా ఎన్నికల అధికారుల ఆగ్రహం. ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు. రీపోలింగ్‌ నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి ఆదేశం.
  • ల్యాండ్‌ పూలింగ్‌ సమయంలో చంద్రబాబు అనుచరులు భూములు కొన్నారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి-అంబటి. చట్టప్రకారం వాళ్లమీద యాక్షన్‌ తీసుకుంటాం-అంబటి. లోకేష్‌, చంద్రబాబు తాబేదారులు భూములు కొన్నారు-అంబటి.
  • కడప: ప్రొద్దుటూరులో ముగ్గురు క్రికెట్‌ బుకీల అరెస్ట్‌. రూ.2,68 లక్షలు స్వాధీనం.
  • ఏపీ హైకోర్టులో ఉత్కంఠ. సీఆర్‌డీఏ రద్దు, రాజధాని తరలింపు పిటిషన్ల కీలక విచారణ. వాదోపవాదాలు తెలుసుకోవటం కోసం వచ్చిన.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కేశినేని నాని. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్న.. మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహిత్గి.
  • ఎవరైనా చట్టాలకు లోబడే పనిచేయాలి. మండలిలో జరిగేది ప్రజలకు తెలియకూడదనే ప్రసారాలు నిలిపేశారు. మండలిలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చట్టం ప్రకారమే నడవాలి. మండలి చైర్మన్‌కు అధికార పార్టీ నేతలు నరకం చూపించారు. బిల్లును హడావుడిగా ఆమోదించుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు. బెయిల్‌పై ఉన్న విజయసాయిరెడ్డికి కౌన్సిల్‌లో ఏం పని. -ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, దీపక్‌, బచ్చులఅర్జునుడు, సత్యనారాయణరాజు.

టెలికం కంపెనీలకు కేంద్రం గుడ్ న్యూస్.. ఇక..!

In Major Relief For Telecom operators.. Government Defers Spectrum Payments, టెలికం కంపెనీలకు కేంద్రం గుడ్ న్యూస్.. ఇక..!

ఇప్పటి వరకు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న టెలికం కంపెనీలకు కేంద్రం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. స్పెక్ట్రమ్ చెల్లింపులకు సంబంధించి రెండేళ్ల పాటు మోరటోరియం విధిస్తూ.. కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో టెలికం కంపెనీలకు పెద్ద ఎత్తున ఊరట కల్గినట్లైంది. రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్‌లు రూ.42,000 కోట్లకు పైగా స్పెక్ట్రం రుసుము చెల్లించాల్సి ఉంది.

అయితే ప్రస్తుతం ఈ టెలికం ఆపరేటర్లలో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. ముఖ్యంగా వోడాఫోన్ తీవ్ర నష్టాల్లో కొట్టుమిట్టాడుతుంది. పెద్ద ఎత్తున అప్పులు ఉండటంతో.. ఇక కంపెనీ చేతులెత్తేసి దేశం విడిచి వెళ్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. దీనికి ముఖ్య కారణం ఇటీవల ఆపరేటర్ల మధ్య నెలకొన్న పోటీ. దీంతో ఈ సంక్షోభంలో వోడాఫోన్, ఎయిర్ టెల్, ఐడియా నష్టాల్లోకి వెళ్లాయి. అదే సమయంలో జియో మాత్రం మంచి లాభాలను గడించింది. అయితే తాజాగా కేంద్రం చేసిన ప్రకటనతో వోడాఫోన్, ఐడియా, ఎయిర్ టెల్ కంపెనీలు ఫుల్ జోష్‌లో ఉన్నాయి.

కేంద్ర క్యాబినెట్ సమావేశం అనంతరం దీనికి సంబంధించి ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ఇటీవల టెలికం కంపెనీలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని గమనించి.. సీఓఎస్ సిఫారసులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రెండేళ్ల పాటు స్పెక్ట్రం వేలం వాయిదాల చెల్లింపులను వాయిదా వేసినట్టు తెలిపారు. దీంతో రాబోయే 2020 – 21, 2021- 22 సంవత్సరాలకు కంపెనీలు స్పెక్ట్రం చెల్లింపులు చెల్లించాల్సిన అవసరం లేదు. తిరిగి 2022-23 సంవత్సరానికి చెల్లించాల్సి ఉంటుంది. మొత్తానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో.. టెలికం కంపెనీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.