Silver Profit: ఏడాది కిందట వెండి కొంటే ఇప్పుడు ఎంత లాభం వస్తుందో తెలిస్తే మీకు నిద్ర కూడా పట్టదు!

Silver Profit: జనవరి 20, 2026న అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లో వెండి ఔన్సుకు $94.85 స్థాయికి చేరుకుంది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక ధరగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీన్ని బట్టి అంతర్జాతీయ స్థాయిలో సిల్వర్‌కు డిమాండ్‌ ఎంత పెరిగిందో అర్థమైపోతుంది..

Silver Profit: ఏడాది కిందట వెండి కొంటే ఇప్పుడు ఎంత లాభం వస్తుందో తెలిస్తే మీకు నిద్ర కూడా పట్టదు!
Silver Profit

Updated on: Jan 25, 2026 | 12:01 PM

Silver Profit: ప్రస్తుతం వెండి ధర రాకెట్‌లా దూసుకుపోతోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో ధర పెరిగిపోతోంది. ఒకప్పుడు బంగారం మాత్రమే స్వల్పంగా పెరుగుతూ వచ్చేది. కానీ ఇప్పుడు అది కూడా రికార్డు సృష్టిస్తోంది. దీనికి తోడు వెండి కూడా అదే బాటలో పరుగులు పెడుతోంది. ఇప్పుడు వెండిలో ఇన్వెస్ట్‌ చేసేందుకు ముందుకు వస్తున్నారు. ధరలు భారీగా పెరుగుతుండటంతో కొత్త పెట్టుబడిదారులలో కూడా వెండిపై ఆసక్తి గణనీయంగా పెరిగింది. దీంతో వెండి మళ్లీ పెట్టుబడి ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.

గత ఒక సంవత్సరాన్ని పరిశీలిస్తే, వెండి ధరలో అసాధారణమైన పెరుగుదల నమోదైంది. మార్కెట్ గణాంకాల ప్రకారం, గత ఏడాదిలో వెండి ధర 170 శాతం కంటే ఎక్కువగా పెరిగింది. ఇది పెట్టుబడి మార్కెట్లలో చాలా అరుదైన విషయం. అంతేకాదు ఈ ఏడాది కూడా అదే ధోరణి కొనసాగుతోంది. ఇప్పటికే వెండి ధరలో 37 శాతం కంటే ఎక్కువ వృద్ధి నమోదైంది. సంవత్సరం మారినా ధరలు తగ్గకుండా పెరుగుతుండటం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత బలపరుస్తోంది.

Gold Price Today: తులం రూ.1.60 లక్షలు దాటిన బంగారం ధర.. వెండి ధర తెలిస్తే షాకవుతారు!

జనవరి 20, 2026న అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లో వెండి ఔన్సుకు $94.85 స్థాయికి చేరుకుంది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక ధరగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీన్ని బట్టి అంతర్జాతీయ స్థాయిలో సిల్వర్‌కు డిమాండ్‌ ఎంత పెరిగిందో అర్థమైపోతుంది.

ఇవి కూడా చదవండి

వెండి ధర పెరగడానికి కారణాలు ఏంటి?

వెండి ధర పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, సౌర విద్యుత్ ప్యానెల్లు, ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు వంటి రంగాల్లో వెండి వినియోగం వేగంగా పెరుగుతోంది. ఈ పారిశ్రామిక అవసరాల వల్ల వెండిని ఇప్పుడు కేవలం ఆభరణాల లోహంగా కాకుండా, భవిష్యత్ సాంకేతిక అభివృద్ధికి కీలకమైన లోహంగా కూడా పరిగణిస్తున్నారు. ఇప్పుడు ఒక ఉదాహరణ ద్వారా సిల్వర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బెనిఫిట్స్‌ను తెలుసుకుందాం. జనవరి 21, 2025న భారతదేశంలో వెండి ధర గ్రాముకు రూ. 84.87గా ఉండేది. ఆ సమయంలో ఒక పెట్టుబడిదారుడు 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్‌ చేసి ఉంటే దాదాపు 1.18 కిలోగ్రాముల వెండిని కొనుగోలు చేయగలిగేవాడు. అప్పట్లో ఇది సాధారణ పెట్టుబడిలా కనిపించినప్పటికీ, ఇప్పుడది ఎన్నో రేట్లు పెరిగింది.

ఇది కూడా చదవండి: Flipkart Republic Day: కేవలం రూ.668కే మోటరోలా 5జి స్మార్ట్ ఫోన్.. షరతులు వర్తిస్తాయ్!

మూడింతల కంటే ఎక్కువ లాభం

జనవరి 20, 2026 నాటికి భారత మార్కెట్లో వెండి ధర కిలోకు దాదాపు రూ. 3.20 లక్షలకు చేరుకుంది. ఈ ధరను ఆధారంగా తీసుకుంటే గత ఏడాది కొనుగోలు చేసిన 1.18 కిలోగ్రాముల వెండి విలువ ఇప్పుడు సుమారు రూ. 3.77 లక్షలకు పెరిగింది. అంటే వెండి ధర పెరుగుదల పెట్టుబడిదారుల పెట్టుబడిని మూడింతలకంటే ఎక్కువగా మార్చింది. మొత్తంగా చూస్తే, ఒక సంవత్సరం క్రితం చేసిన రూ. 1 లక్ష పెట్టుబడి నేడు దాదాపు రూ. 3.77 లక్షలకు చేరుకుంది. అంటే పెట్టుబడిదారులు సుమారు రూ. 2.77 లక్షల నికర లాభాన్ని పొందారు. శాతం పరంగా ఇది దాదాపు 280 శాతం రాబడిగా మారుతుంది. అలాగే జనవరి 25వ తేదీన నమోదైన వెండి ధరలను పోలిస్తే ఇంకా రాబడి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం కిలో వెండి ధర దేశీయంగా రూ.3,35,000 ఉండగా, హైదరాబాద్‌లో రూ.3,65,000 వద్ద ట్రేడవుతోంది.

ఇది కూడా చదవండి: Gas Cylinder: గ్యాస్‌ సిలిండర్‌ వాడేవారు ఈ 3 తప్పులు అస్సలు చేయవద్దు.. లేకుంటే పేలిపొద్ది!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి