మీరు భవిష్యత్‌లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే మీకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్(savings account) చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. మీరు ఖచ్చితంగా ఈ పథకాలలో మంచి రాబడిని పొందుతారు. అంతేకాదు మీ డబ్బు కూడా సురక్షితంగా ఉంటుంది. బ్యాంక్ డిఫాల్ట్ అయితే మీరు రూ. 5 లక్షలు మాత్రమే తిరిగి పొందుతారు. కానీ పోస్టాఫీసులో అలా కాదు ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంది. అంతేకాదు పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు చాలా తక్కువ మొత్తంతో ప్రారంభించవచ్చు. పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాలలో పోస్టాఫీసు పొదుపు ఖాతా కూడా ఒకటి. ఈ పథకం గురించి వివరంగా తెలుసుకుందాం. వాస్తవానికి బ్యాంకు మునిగిపోతే అందులో పెట్టిన పెట్టుబడిలో రూ.5 లక్షలు మాత్రమే చెల్లించాలనే నిబంధనను ప్రభుత్వం ఇటీవల అమలులోకి తెచ్చింది. పోస్టాఫీసులో చేసిన 100 శాతం పెట్టుబడి పూర్తిగా సురక్షితం , దానిపై మంచి వడ్డీని కూడా ఇస్తుంది.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ వచ్చిన తర్వాత బ్యాంకుల్లో ఖాతాదారులకు అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో కస్టమర్లు ఇంట్లో కూర్చొని ఒక ఖాతా నుండి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేసుకోవచ్చు. ఇది కాకుండా, కస్టమర్లు చెక్ బుక్, ATM కార్డ్, క్రెడిట్ కార్డ్.. ఇంటి నుండి రుణం కోసం కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.