Life Certificate: మరికొన్ని రోజులే సమయం.. లేకుంటే పెన్షన్‌ నిలిపివేత!

|

Nov 18, 2024 | 5:13 PM

Life Certificate: రాష్ట్రాల వారీగా చూస్తే, మహారాష్ట్ర 10 లక్షలకు పైగా డిఎల్‌సిల జారీతో ముందంజలో ఉంది. దీని తర్వాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ వచ్చాయి. ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల్లో 6 లక్షల డీఎల్‌సీలు విడుదలయ్యాయి. ఉత్తరప్రదేశ్ కూడా 5 లక్షల కంటే ఎక్కువ..

Life Certificate: మరికొన్ని రోజులే సమయం.. లేకుంటే పెన్షన్‌ నిలిపివేత!
Follow us on

Life Certificate: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాత ఉద్యోగులకు పాత పెన్షన్ (OPS) లభిస్తుంది. ఈ పెన్షన్ ప్రతినెలా ఆటోమేటిక్‌గా వారి ఖాతాలో జమ అవుతుంది. ప్రతి నెలా సకాలంలో ఖాతాలో పింఛను జమ కావాలంటే, పింఛనుదారు ప్రతి సంవత్సరం తన లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించడం అవసరం. మీరు ఈ ఏడాది నవంబర్ 30వ తేదీలోగా మీ బ్యాంకులో డిపాజిట్ చేయవచ్చు. మీరు ఇంకా అలా చేయకపోతే ఖచ్చితంగా చేయండి. లేకపోతే పెన్షన్ ఆగిపోతుంది. కావాలంటే బ్యాంకు శాఖకు వెళ్లకుండానే డిజిటల్‌గా డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ ఏడాది ఇప్పటి వరకు 77 లక్షల డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్లు అందించారు.

డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అంటే ఏమిటి?

పెన్షనర్ల జీవితాన్ని సులభతరం చేయడానికి, కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను రూపొందించడానికి ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం కింద ఇప్పటివరకు 77 లక్షల డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు (డిఎల్‌సి) జారీ అయ్యాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ (DLC) ప్రచారం 3.0 కింద కవర్ చేసిన 1,77,153 మంది పెన్షనర్లు 90 ఏళ్లు పైబడిన వారు కాగా, 17,212 మంది పెన్షనర్లు 80-90 సంవత్సరాల మధ్య వయస్సు వారు ఉన్నారు.

అధికారిక సమాచారం ప్రకారం.. 24 లక్షల డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లు ముఖ గుర్తింపు వంటి అధునాతన ప్రమాణీకరణ పద్ధతుల ద్వారా జారీ అయ్యాయి. విడుదలైన మొత్తం డిఎల్‌సిలో ఇది 34 శాతం. పాత పింఛనుదారులు తమ ఇంటి నుంచి లేదా సమీపంలోని కార్యాలయాలు లేదా బ్యాంకు శాఖల్లో డీఎల్‌సీని డిపాజిట్ చేసుకునే వెసులుబాటు కల్పించడం గమనార్హం. ఈ ప్రచారాన్ని కేవలం రెండు వారాల క్రితమే ప్రారంభించారు.

ఇది కూడా చదవండి: Indian Railways: భారతదేశంలో 5 అతిపెద్ద రైల్వే స్టేషన్‌లు ఎక్కడ ఉన్నాయో తెలుసా?

ప్రభుత్వ డీఎల్‌సీ ప్రచారానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) నాయకత్వం వహించాయి. ఈ రెండు బ్యాంకులు ప్రారంభించిన రెండవ వారం ముగిసే సమయానికి 9 లక్షలకు పైగా డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికేట్‌ (DLC) జారీ చేశాయి. అదే సమయంలో కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా లక్ష , 57,000 డిఎల్‌సిలను జారీ చేశాయి.

రాష్ట్రాలలో మహారాష్ట్ర ముందుంది

రాష్ట్రాల వారీగా చూస్తే, మహారాష్ట్ర 10 లక్షలకు పైగా డిఎల్‌సిల జారీతో ముందంజలో ఉంది. దీని తర్వాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ వచ్చాయి. ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల్లో 6 లక్షల డీఎల్‌సీలు విడుదలయ్యాయి. ఉత్తరప్రదేశ్ కూడా 5 లక్షల కంటే ఎక్కువ DLC (Digital Life Certificate)లతో మంచి పనితీరు కనబరిచింది.

ఇది కూడా చదవండి: Fact Check: ఎంఎస్ ధోని పేరిట రూ.7 నాణెం విడుదల అవుతుందా? ఇందులో నిజమెంత?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి