Post Office Scheme: ఎలాంటి రిస్క్‌ లేకుండా మీ డబ్బులు డబుల్‌.. పోస్టాఫీస్‌లో ఆకట్టుకునే పథకం..

|

Nov 12, 2022 | 7:35 PM

కరోనా తదనంతర నేపథ్యంలో ప్రచారాలు పెట్టుబడుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు. ఎలాంటి రిస్క్‌ లేని మార్గాలను అన్వేషిస్తున్నారు. తక్కువ రిస్క్‌తో ఎక్కువ లాభాలు ఉండే స్కీమ్స్‌ కోసం వెతుకుతున్నారు. మీరు ఇలాంటి స్కీమ్‌ కోసమే వెతుకుతున్నారా.? అయితే...

Post Office Scheme: ఎలాంటి రిస్క్‌ లేకుండా మీ డబ్బులు డబుల్‌.. పోస్టాఫీస్‌లో ఆకట్టుకునే పథకం..
Post Office Savings Scheme
Follow us on

కరోనా తదనంతర నేపథ్యంలో ప్రచారాలు పెట్టుబడుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు. ఎలాంటి రిస్క్‌ లేని మార్గాలను అన్వేషిస్తున్నారు. తక్కువ రిస్క్‌తో ఎక్కువ లాభాలు ఉండే స్కీమ్స్‌ కోసం వెతుకుతున్నారు. మీరు ఇలాంటి స్కీమ్‌ కోసమే వెతుకుతున్నారా.? అయితే పోస్టాఫీస్‌ అందిస్తోన్న ఈ ప్రత్యేక పథకం మీకోసమే. పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్ స్కీమ్‌ పేరుతో ఆకట్టుకునే పథకాన్ని అందిస్తోంది. దీని ద్వారా 10 ఏళ్లలో మీ డబ్బులు రెట్టింపయ్యే అవకాశం ఉంటుంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

పోస్టాఫీస్‌ అందించే ఈ పథకంలో మీరు దీర్ఘకాలికంగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు ఈ పథకంలో రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టారనుకోండి. 6.7 శాతం వడ్డీతో ఐదేళ్లకు రూ. 6,97,033 అవుతుంది. వడ్డీ వల్ల మీకు అదనంగా రూ. 1,97,033 అందుతాయి. ఈ మొత్తానికి ఐదేళ్ల తర్వాత 6.7 శాతం వడ్డీతో రూ. 9,71,711 అవుతుంది. అంటే సుమారు రూ. 10 లక్షల వరకు చేరుకుంటుంది. ఇలా పదేళ్లలో మీరు డిపాజిట్‌ చేసిన రూ. 5 లక్షలపై రూ. 4,71,711 వడ్డీని పొందుతారు.

ఇక టైమ్‌ డిపాజిట్‌ ఖాతాను మినిమం రూ. 1000తో ఓపెన్‌ చేయొచ్చు. డిపాజిట్‌కు ఎలాంటి లిమిట్‌ లేదు. సింగిల్‌, జాయింట్‌ ఖాతాగా ఓపెన్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. కనీసం 5 ఏళ్ల కాల వ్యవధితో డిపాజిట్ చేస్తే సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. ఒకవేళ మెచ్యూరిటీ కంటే ముందే డబ్బులు తీసుకోవాలంటే కనీసం ఆరు నెలలు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..