
ఫిబ్రవరి నెల సగమైంది. ఈలోపే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 7 గంటలయితే చాలు.. ఉక్కపోత, వేడి మొదలైపోతోంది. ధనికులైతే ఠక్కున ఏసీనో, కూలరో కొనేస్తారు. కానీ మధ్యతరగతివారు అలా కాదు.. ఏది కొనాలన్నా భారమే. మరి అలాంటివారి కోసమే పోర్టబుల్ ఏసీలను తీసుకొచ్చేశాం. ఇవి మీ ఇంటిలోనే కాదు.. ఆఫీసు, పిక్నిక్ ఇలా ఎక్కడికైనా తీసుకెళ్లిపోవచ్చు. ఇల్లంతటిని క్షణాల్లో షిమ్లాలా మార్చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న పోర్టబుల్ ఏసీలకు.. ఈ కామర్స్ సైట్లలో భారీ డిమాండ్ ఉంది. మరి ఆ కోవకు చెందిన ఓ పోర్టబుల్ ఏసీ ధర, ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందామా..
ప్రముఖ ఆన్‌లైన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో ఈ పోర్టబుల్ ఏసీ అందుబాటులో ఉంది. వాస్తవానికి దీని ధర రూ. 1,399 కాగా.. 50 శాతం తగ్గింపుతో రూ. 699కి లభిస్తోంది. ఈ పోర్టబుల్ ఏసీలోని కూలింగ్ ఫ్యాన్ స్పీడ్‌ను మూడు మోడ్స్‌లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. బరువు తక్కువగా ఉండే ఈ మినీ కూలర్‌ను మీరు ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. సుమారు 600ఎంఎల్ వాటర్ ట్యాంక్‌లో ఒకసారి నీళ్లు నింపితే దాదాపుగా 4-5 గంటల వరకు ఉపయోగించవచ్చు. దీని నుంచి పెద్దగా సౌండ్ కూడా రాదు. రాత్రి చాలా కూల్‌గా నిద్రపోవచ్చు. అలాగే ఇందులో 7 రంగుల ఎల్‌ఈడీ కలర్ ఆప్షన్ ఉంది. కాగా, ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆ సైట్, వస్తువుకు సంబంధించిన కండీషన్‌ను సరిగ్గా చూసి తీసుకోండి. పైన ఇచ్చినది కేవలం సమాచారం కోసమే.. ఇది గమనించగలరు.(Source)
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..