
యమహా కంపెనీ త్వరలో రివర్ ఇండి ఆధారంగా సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందని నిపుణులు చెబతున్నారు. రాబోయే యమహా ఈవీకు ఆర్‌వై 01 అనే కోడే నేమ్ కూడా ఉంది. రివర్ ఇండి ఈవీ స్కూటర్ మాదిరిగానే బ్యాటరీ నిర్వహణ వ్యవస్థ, పవర్ ట్రెయిన్‌ను ఉపయోగిస్తుందని పలు నివేదికల ద్వారా స్పష్టమైంది. జపాన్‌కు చెందిన యమహా మోటార్ కంపెనీ ఫిబ్రవరి 2024లో రివర్ ఇండి కంపెనీ సుమారు 40 మిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది. రివర్ ఇండీ భాగస్వామ్యంతో కొత్త యమహా ఆర్‌వై01 ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ పండుగ సీజన్‌తో ఉత్పత్తి ప్రారంభించి ఈ సంవత్సరం చివరి నాటికి లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.
ఈ కొత్త ఈవీ భారతదేశం, అమెరికా, యూరప్లోని యమహా గ్లోబల్ ఇంజనీరింగ్ బృందాలు అభివృద్ధి చేస్తున్నాయి. యమహా డిజైన్ మరియు బ్రాండ్ ఎథోస్‌తో వచ్చే ఈ స్కూటర్ లాంచ్ అయినా ఇంజనీరింగ్, టెస్టింగ్, పరిశోధన, అభివృద్ధి, అన్నీ రివర్ కంపెనీ ద్వారా నిర్వహిస్తారు. డిజైన్ ఫైనల్ అయిన తర్వాత యమహా ఆర్‌వై ఈవీ స్కూటర్‌ను బెంగళూరులోని రివర్ కంపెనీ తయారు చేస్తుంది. ఇక్కడి నుంచే ఈ స్కూటర్ ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేస్తారు. దీని వల్ల దేశంలో ఉత్పత్తి పరిమాణం పెరుగడంతో ఖర్చులు నియంత్రణలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
యమహా వంటి గ్లోబల్ కంపెనీ పవర్ ట్రెయిన్, ఇంజనీరింగ్, బ్యాటరీ ఇంటిగ్రేషన్, టెస్టింగ్తో కూడిన భారతీయ ఎలక్ట్రిక్ వాహన స్టార్టప్‌ను విశ్వసించడం శుభపరిణామమని నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం పెరుగుతున్న పరిశోధన, అభివృద్ధి, తయారీ సామర్థ్యాలకు నిదర్శనంగా ఈ భాగస్వామ్యంగా సాక్ష్యంగా నిలుస్తుందని నివేదికల్లో స్పష్టం చేస్తున్నారు. యమహా ఆర్‌వై 01 భారతదేశంలో ప్రారంభిస్తే టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ రిజ్టా, బజాజ్ చేతక్, హీరో విడీ వీ1 వంటి ఈవీ స్కూటర్లకు గట్టి పోటినిస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి