Xiaomi India: పాకిస్థాన్‌కు షావోమీ ఇండియా తరలింపు.. క్లారిటీ ఇచ్చిన చైనా కంపెనీ..

|

Oct 07, 2022 | 8:58 PM

పాకిస్థాన్‌కు షావోమీ కార్యకలాపాలంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి..దీంతో మా సంస్థ కార్యకలాపాలను ఎక్కడికీ తరలించేది లేదంటూ షావోమీ కంపెనీ క్లారిటీ ఇచ్చింది.

Xiaomi India: పాకిస్థాన్‌కు షావోమీ ఇండియా తరలింపు.. క్లారిటీ ఇచ్చిన చైనా కంపెనీ..
Xiaomi India
Follow us on

షావోమీ ఇండియా తమ కంపెనీ కార్యకలాపాలను భారత్ నుంచి పాక్‌కు తరలిస్తోందంటూ వచ్చిన వార్తలను ఆ కంపెనీ తోసిపుచ్చింది. ఆ వార్తలు అవాస్తవమంటూ చైనా స్మార్ట్‌ ఫోన్‌ తయారీ కంపెనీ షావోమీ క్లారిటీ ఇచ్చింది. అదంతా అవాస్తవ ప్రచారమని.. భారత్ నుంచి తరలించడం లేదని పేర్కొంది. అయితే ఇటీవలే ఈ షావోమీ కంపెనీకి భారీ షాక్‌ తగిలింది. షావోమీ సంస్థకు చెందిర 5వేల 551కోట్ల నగదును ఎన్ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సీజ్‌ చేశారు. ఈడీ చరిత్రలో తొలిసారి అత్యధిక మొత్తం నగదు సీజ్‌ చేసిటన్లు తెలుస్తోంది.అయితే ఫారిన్​ఎక్స్ఛేంజ్​ మేనేజ్​మెంట్ యాక్ట్​నిబంధనలను ఉల్లంఘించి షావోమీ విదేశాలకు డబ్బు మళ్లించిట్లు తేలింది. ఫెమా చట్టానికి విరుద్ధంగా రాయల్టీల రూపంలో ఈ భారీ మొత్తాన్ని తరలిస్తోందంటూ ఆ నగదును సీజ్‌ చేసింది. నగదు జప్తు చేయకుండా స్టే విధించాలంటూ షావోమీ ఇండియా కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. దానిని కోర్టు తిరస్కరించింది.

అయితే ఇప్పుడు షావోమీ కార్యకలాపాలు పాక్‌కు తరలిస్తోందంటూ వార్తలు వచ్చాయి. దీంతో వాటి వివరణ ఇస్తూ మా సంస్థ కార్యకలాపాలను ఎక్కడికీ తరలించడం లేదని, ఆ వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది. ‘‘2014 జులైలో భారత్‌లోకి షావోమీ ప్రవేశించింది. కార్యకలాపాలు ప్రారంభించి ఏడాది పూర్తికాక ముందే మేం మా ‘మేకిన్‌ ఇండియా’ ప్రయాణాన్ని మొదలుపెట్టాము. నేడు 99 శాతం స్మార్ట్‌ఫోన్లు,100 శాతం స్మార్ట్‌ టీవీలు భారత్‌లోనే తయారవుతున్నాయి. ఓ గ్లోబల్‌ కంపెనీగా తప్పుడు, నకిలీ సమాచారం బారి నుంచి కంపెనీ ప్రతిష్ఠను కాపాడుకోవడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నాం’’ అని ఆ సంస్థ వెల్లడించింది.

షావోమీ ఇండియా.. నిధులను విదేశాల్లో పనిచేస్తున్న మూడు సంస్థలకు పంపిందంటూ ఈడీ చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో.. పాక్‌కు కంపెనీ షిఫ్ట్ అవుతుందంటూ వస్తున్న ప్రచారం మరింత చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..