Ather 450X: ఈవీ స్కూటర్‌పై ఉల్లిపాయల మూటలు.. కంపెనీ కూడా ఇలా టెస్ట్ చేసి ఉండదేమో..?

ఇటీవల ఓ వీడియో ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో హల్‌చల్ చేస్తుంది. ఓ వ్యక్తి ప్రముఖ ఈవీ స్కూటర్ అయిన ఏథర్ 450 ఎక్స్‌పై ఉల్లిపాయ మూటలతో బిజీగా ఉండే రోడ్డులో దూసుకుపోతున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల సెటైర్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాలో వైరల్ అవుతున్న వీడియో గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Ather 450X: ఈవీ స్కూటర్‌పై ఉల్లిపాయల మూటలు.. కంపెనీ కూడా ఇలా టెస్ట్ చేసి ఉండదేమో..?
Ather 450 X

Updated on: Apr 07, 2024 | 7:00 AM

ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా ఈవీ స్కూటర్లు అత్యంత ప్రజాదరణ పొందాయి. మొదట్లో కేవలం పట్టణ ప్రాంతాలకే పరమితమైన ఈవీ స్కూటర్లు క్రమేపి గ్రామీణ ప్రాంతాలకు కూడా చేరాయి. దీంతో అన్ని కంపెనీలు సరికొత్త మోడల్స్‌లో ఈవీ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. అయితే లాంచ్ చేసే ముందు ఆయా స్కూటర్ల పనితీరుపై పలు రకాల పరీక్షలను కంపెనీ నిర్వహిస్తుంది. ముఖ్యంగా స్కూటర్ ఫీచర్స్‌తో పాటు అన్ని రకాల పరిస్థితుల్లో తట్టుకుంటుందని కొనుగోలుదారులకు నమ్మకం కల్పించడానికి ఆయా పరీక్షలు చేస్తుంది. అయితే ఇటీవల ఓ వీడియో ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో హల్‌చల్ చేస్తుంది. ఓ వ్యక్తి ప్రముఖ ఈవీ స్కూటర్ అయిన ఏథర్ 450 ఎక్స్‌పై ఉల్లిపాయ మూటలతో బిజీగా ఉండే రోడ్డులో దూసుకుపోతున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల సెటైర్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాలో వైరల్ అవుతున్న వీడియో గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన చిన్న క్లిప్‌లో, సాల్ట్ గ్రీన్ ఏథర్ 450 ఎక్స్‌లోని రైడర్ దానిని కార్గోను రవాణా చేయడానికి ఉపయోగించాడు. ఆ వ్యక్తి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంపై నాలుగు బస్తాల ఉల్లిపాయలను ఎక్కించుకుని ట్రాఫిక్ మధ్య దూసుకుపోతున్నారు. ముఖ్యంగా తన భద్రతను పణంగా పెట్టి మరీ ఈవీ ముందు మూడు సంచులు, వెనుక సీటుపై ఒకదానితో ఓవర్లోడ్‌తో వెళ్తున్నాడు. ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నప్పటికీ ఆయన తన ఈవీ స్కూటర్‌పై పెట్టుకున్న నమ్మకాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అయితే బిజీ రోడ్లపై ఇలాంటి ఫీట్లు ఏంటి? అని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

ఏథర్ 450 ఎక్స్ ఫీచర్లు

ఏథర్ 450 ఎక్స్ రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో విక్రయిస్తున్నారు. 2.9 కేడబ్ల్యూహెచ్, 3.7 కేడబ్ల్యూహెచ్. చిన్న 2.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఒకే ఛార్జ్‌పై 111 కిమీ పరిధిని అందిస్తుంది. అలాగే పెద్ద 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఒకే ఛార్జ్ పై 150 కిమీ పరిధిని కలిగి ఉంటుంది. పనితీరు కారకాన్ని హైలైట్ చేస్తూ ఈ ఈవీ 3.3 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. అలాగే ఈ స్కూటర్ గరిష్ట వేగం 90 కిలోమీటర్లు. ఏథర్ 450 ఎక్స్ రైడర్ల కోసం మరింత మెరుగ్గా ఉండడానికి బ్రాండ్ పార్క్ అసిప్ట్, ఆటో హెూల్డ్, గైడ్ మి హెూమ్ లైట్, 7- అంగుళాల టీఎఫ్‌టీస్క్రీన్ వంటి ఫీచర్లను జోడించింది. ఇది కనెక్టివిటీ ఫీచర్లతో పాటు గూగుల్ మ్యాప్స్, కాల్స్ వంటి నోటిఫికేషన్లను అందిస్తుంది. అయితే ఏథర్ 450 ఎక్స్ స్కూటర్ రూ.1.26 లక్షల (ఎక్స్-షోరూమ్)కు కొనుగోలుక అందుబాటులో ఉంటుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి