World Most Costly Oil: ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వంట నూనె… ధర రూ. 22500 / లీటర్… ఇది ఎలా తయారు చేస్తారో తెలుసా?

|

Jun 02, 2021 | 6:56 PM

Cooking Argan Oil: ప్రస్తుతం ఒక లీటరు అర్గాన్ ఆయిల్ ధర $ 300.. అంటే మీరు దీన్ని భారతీయ రూపాయిలతో పోల్చి చూస్తే..  లీటరుకు సుమారు 22,000 రూపాయలు. 20 సంవత్సరాల క్రితం వరకు...

World Most Costly Oil: ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వంట నూనె… ధర రూ. 22500 / లీటర్… ఇది ఎలా తయారు చేస్తారో తెలుసా?
Cooking Oil Argan Oil
Follow us on

ఏ వంట నూనె ధర చూసిన చుక్కులు కనిపిస్తున్నాయి. వంట నూనె నుంచి పెట్రోల్ వరకు ప్రతిదీ ఖరీదైనదిగా మారిపోయింది. మనకు తెలిసి వంట నూనె ధర సుమారు రూ. 180 వరకు ఉండే అవకాశం ఉంది. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వంట నూనె మరొకటి ఉంది. దాని విలువ ఇప్పుడు బంగారంతో సమానంగా పరుగులు పెడుతోంది. ప్రపంచంలో అత్యంత ప్రత్యేకమైన నూనెగా మార్కెట్లో అమ్ముతున్న ఈ నూనె పేరు “అర్గాన్ ఆయిల్”.   ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే…  20 సంవత్సరాల క్రితం వరకు ఆర్గాన్ వంట నూనె  ఎవరికీ తెలియదు.  రెండు దశాబ్దాల్లో ఈ నూనె ఖరీదు మారిపోయింది. బంగారం కంటే వేగంగా పెరిగిపోయింది.

ఇప్పుడు లీటరుకు $ 3 నుంచి $ 300

ప్రస్తుతం ఒక లీటరు అర్గాన్ ఆయిల్ ధర $ 300.. అంటే మీరు దీన్ని భారతీయ రూపాయిలతో పోల్చి చూస్తే..  లీటరుకు సుమారు 22,000 రూపాయలు. 20 సంవత్సరాల క్రితం వరకు దీని గురించి ఎవరికీ తెలియదు. దీనిని మొరాకోలోని ఒక చిన్న గ్రామంలో ఉత్పత్తి చేసి రోడ్డు పక్కన అమ్మారు. అప్పుడు దాని ధర కేవలం 3 డాలర్లు  మాత్రమే ఉండేది. కానీ నెమ్మదిగా ఈ వంట నూనె వినియోగం గురించి చాలా మంది తెలుసుకున్నారు.  అప్పటి నుంచి ఈ నూనె ధర పెరుగుతూ ఇక్కడికి చేరింది.  నేడు అర్గాన్ నూనె ఉత్పత్తి బిలియన్ డాలర్ల పరిశ్రమగా మారింది. మొరాకో తెగ అమాజిగ్ మహిళలు  ఈ నూనెను  తయారు చేస్తున్నారు. ఈ నూనెను తయారుచేసే పద్ధతి ఇప్పటికీ సాంప్రదాయ పద్ధతులపై ఆధారపడి ఉంటుంది.

ఇవి కూడా చదవండి :  Petrol Prices Around The World: పెట్రోల్ ధరలు ఏయే దేశాల్లో తక్కువ? ఏయే దేశాల్లో ఎక్కువ? భారత్ ర్యాంకు ఎంతంటే?

Girl Fights off Wild Bear: పెంపుడు కుక్కల కోసం ప్రాణాలకు తెగించి ఎలుగుబంటితో పోరాడిన యువతి.. వీడియో వైరల్..