AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Potato: అమ్మబాబోయ్.. కేజీ బంగాళదుంప రూ.లక్ష.. జనాల క్యూ.. ఎక్కడోొ తెలుసా..?

భారత్‌లో బంగాళాదుంపలు కేవలం రూ.25కే లభిస్తుంటే, ఆసియా దేశాల్లో వాటి ధరలు రూ.380 వరకు చేరాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగాళాదుంప లే బోనాట్ గురించి తెలుసా? ఫ్రాన్స్‌కు చెందిన ఈ ప్రత్యేకమైన బంగాళాదుంప కిలో ధర ఏకంగా లక్ష రూపాయలు. దీనికి ఎందుకంత ధర అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Potato: అమ్మబాబోయ్.. కేజీ బంగాళదుంప రూ.లక్ష.. జనాల క్యూ.. ఎక్కడోొ తెలుసా..?
World Most Expensive Potato
Krishna S
|

Updated on: Nov 16, 2025 | 2:51 PM

Share

భారతదేశంలో బంగాళదుంపలను విరివిగా వాడతారు. దేశంలో ప్రధాన ఆహారంగా వినియోగించే బంగాళాదుంపలు ఇక్కడ ప్రజలకు చాలా తక్కువ ధరకే అందుబాటు ధరలో ఉంటాయి. దేశీయ మార్కెట్‌లో ఒక కిలో బంగాళాదుంప కేవలం రూ.25 చొప్పున అమ్ముడవుతున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా దీని ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా ఆసియా దేశాలలో బంగాళాదుంపల ధరలు ప్రజలను భయపెట్టిస్తున్నాయి.

ఆసియాలో బంగాళాదుంపల ధరలు

  • దక్షిణ కొరియా: రూ.380
  • జపాన్: దాదాపు రూ.255
  • తైవాన్: రూ.245
  • హాంకాంగ్: రూ.235
  • ఫిలిప్పీన్స్: రూ.225
  • సింగపూర్: రూ.215
  • ఇండోనేషియా: రూ.140
  • థాయిలాండ్: రూ.135
  • వియత్నాం: రూ.90
  • చైనా: రూ.85
  • మలేషియా: రూ.80

అత్యంత ఖరీదైన బంగాళాదుంప – లే బోనాట్

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగాళాదుంపగా ఫ్రాన్స్‌లో లభించే లే బోనాట్ రకం నిలిచింది. ఈ ప్రత్యేకమైన బంగాళాదుంప కిలో ధర దాదాపు లక్ష రూపాయలు కావడం విశేషం. ఇంత ఖరీదైనప్పటికీ దానిని కొనుగోలు చేయడానికి ప్రజలు క్యూలో నిలబడతారు.

లే బోనాట్ ప్రత్యేకత

లే బోనాట్ బంగాళదుంప దిగుబడి చాలా తక్కువ. ఇది ప్రతి సంవత్సరం కేవలం మే, జూన్ నెలల్లో మాత్రమే మార్కెట్‌కు వస్తుంది. ఇది అట్లాంటిక్ మహాసముద్రంలోని లోయిర్ ప్రాంతంలో ఉన్న ఫ్రెంచ్ ద్వీపం నోయిర్‌మౌటియర్‌లో ఉత్పత్తి అవుతుంది. ఈ బంగాళాదుంపకు చాలా ప్రత్యేకమైన, అద్భుతమైన రుచి ఉండటం వల్ల దీనికి అధిక డిమాండ్ ఉంది. దీనిని సాంప్రదాయ పద్ధతిలో పండిస్తారు. సాగు కోసం ఎటువంటి యంత్రాలను వాడరు. అవసరమైన పనులన్నీ చేతితోనే చేస్తారు. ఇది పరిమాణంలో చిన్నదిగా ఉండడంతో పాటు చర్మం చాలా సన్నగా ఉంటుంది. దీనిని ఉడకబెట్టి నెయ్యి, ఉప్పుతో కలిపి తింటారు. లే బోనాట్ రకాన్ని మొట్టమొదట పండించిన రైతు బెనాయిట్ బోనోట్ పేరు మీదుగా దీనికి లే బోనోట్ అని పేరు పెట్టారు. ఉత్పత్తిలో మార్పుల కారణంగా ప్రతి సంవత్సరం దీని ధర పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి