ఇటీవల చాలా మంది సొంతంగా వ్యాపారం చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఉద్యోగంలో ఎంత జీతం ఉన్నా తమ కాళ్లపై తాము నిలబడుతూ మరికొందరికి ఉపాధి కల్పించాలనే భావన చాలా మందిలో పెరుగుతోంది. ప్రభుత్వాలు సైతం స్వయం ఉపాధికి సహకరిస్తూ రుణాలు అందిస్తుండడం కూడా సొంత వ్యాపారాలు చేసే వారికి ఊతమిస్తున్నాయి. మరి మీరు కూడా సొంతం వ్యాపారం చేయాలనుకుంటే కొన్ని బెస్ట్ బిజినెస్ ఐడియాలపై ఓ లుక్కేయండి..
* ప్రస్తుతం బ్యూటీషియన్లకు డిమాండ్ పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం పెళ్లిలకు మాత్రమే మేకప్ వేసుకోవడానికి ఆసక్తి చూపించే వారు ఇప్పుడు పుట్టిన రోజు వేడుకలకు కూడా మేకప్ వేసుకుంటున్నారు. ఇందుకోసం ఏవైనా క్రాష్ కోర్సులు కూడా చేయొచ్చు. సోషల్ మీడియా వేదికగా మీ సొంత బ్రాండింగ్ చేసుకుంటే ఆర్డర్స్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
* టిఫిన్ బిజినెస్ కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోంది. గజిబిజీ జీవితాల కారణంగా బయట టిఫిన్ చేసే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. కాబట్టి ఈ వ్యాపారాన్ని మొదలు పెడితే నష్టం అనేది ఉండదు. ఉదయం కేవలం 4 నుంచి 5 గంటలు కష్టపడితే చాలు రోజుకు కనీసం రెండు నుంచి మూడు లక్షలు సంపాదించొచ్చు.
* పెట్ కేర్ సెంటర్లకు కూడా గిరాకీ పెరుగుతోంది. చాలా రోజుల పాటు ఇంటికి దూరంగా వెళ్తున్న వారు వారి పెంపుడు జంతువుల సంరక్షణ కోసం ఇలాంటి సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. సొంతంగా స్థలం ఉంటే ఈ వ్యాపారంతో భారీగా ఆర్జించవచ్చు.
* ఇక ఎవ్వరిపై ఆధారపడకుండా సొంతం సంపాదించుకోవాలంటే ట్యాక్సీ సేవలు బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. కేవలం కార్లు మాత్రమే కాకుండా చేతిలో బైక్ ఉన్నా చాలు వెంటనే ట్యాక్సీ సేవల ద్వారా డబ్బులు ఆర్జించవచ్చు. ర్యాపిడో వంటి బైక్ ట్యాక్సీ సేవలు ఇలాంటి జాబితాలోకి వస్తాయి.
* ఎలాంటి పెట్టుబడి లేకుండా డబ్బులు ఆర్జించడానికి మరో బెస్ట్ ఆప్షన్ ట్యూషన్స్. కరోనా తర్వాత ఆన్‌లైన్‌లో ట్యూటర్లకు డిమాండ్ పెరిగింది. ఆన్‌లైన్‌లో ట్యూషన్స్ చెబుతూ డబ్బులు సంపాదిస్తున్న వారి సంఖ్య ఇటీవల భారీగా పెరిగింది.
* కంటెంట్ రైటింగ్, వీడియో లేదా ఫొటో ఎడిటింగ్ వంటి అంశాల్లో మీకు పరిజ్ఞానం ఉంటే ఇంట్లోనే ఉంటూ ఫ్రీలాన్సర్‌గా పనిచేసుకోవచ్చు. ఇటీవల చాలా కంపెనీలు ఉద్యోగులను ఫ్రీలాన్సర్స్‌గా తీసుకుంటున్నాయి. వీటికి కూడా ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..