Business Idea: ఇంట్లోనే వేల రూపాయాలు సంపాదించే ఛాన్స్‌.. బెస్ట్‌ బిజినెస్ ప్లాన్‌..

|

Oct 29, 2023 | 10:06 PM

ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ఈ తరం యువత సరికొత్తగా ఆలోచిస్తోంది. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను ఆర్జించే వ్యాపారాలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇలా సరికొత్త ఆలోచనతో వ్యాపారం చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి ఎవర్‌ గ్రీన్‌ బిజినెస్‌ ఐడియాల్లో పుట్ట గొడుగుల పెంపకం ఒకటి. ప్రస్తుతం మార్కెట్లో వీటికి డిమాండ్ భారీగా పెరుగుతోంది. దీనిని అవకాశంగా...

Business Idea: ఇంట్లోనే వేల రూపాయాలు సంపాదించే ఛాన్స్‌.. బెస్ట్‌ బిజినెస్ ప్లాన్‌..
Business Idea
Follow us on

ప్రస్తుతం యువత ఆలోచనలో మార్పు వస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగం చేయాలంటే బోర్‌గా ఫీలవుతున్నారు. చిన్నదైనా సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సరికొత్త వ్యాపారాలకు తెర తీస్తున్నారు. అయితే వ్యాపారం అనగానే చాలా మంది నష్టాలు ఉంటాయేమో అనే భయంలో ఉంటారు.

ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ఈ తరం యువత సరికొత్తగా ఆలోచిస్తోంది. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను ఆర్జించే వ్యాపారాలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇలా సరికొత్త ఆలోచనతో వ్యాపారం చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి ఎవర్‌ గ్రీన్‌ బిజినెస్‌ ఐడియాల్లో పుట్ట గొడుగుల పెంపకం ఒకటి. ప్రస్తుతం మార్కెట్లో వీటికి డిమాండ్ భారీగా పెరుగుతోంది. దీనిని అవకాశంగా మలుచుకొని పుట్ట గొడుగులను పెంచుతూ భారీగా సంపాదిస్తున్నారు.

పుట్ట గొడుగుల్లో ఉన్న పోషకాలు వీటి డిమాండ్‌ పెరగడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. విటమిన్‌ బీ12, విటమిన్‌ సీలు పుష్కలంగా ఉండే పుట్ట గొడుగులతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాకుండా పలు ఔషధాల తయారీల్లోనూ పుట్టగొడులను ఉపయోగిస్తున్నారు. అందుకే పుట్ట గొడుగులకు డిమాండ్‌ పెరుగుతోంది. దీంతో పుట్ట గొడుగుల తయారీ ఇప్పుడు మంచి వ్యాపారంగా అంతరించింది.

తక్కువ పెట్టుబడితో, ఇంట్లోనే పుట్ట గొడుగులను తయారీని ప్రారంభించవచ్చు. అంతే కాదండోయ్‌ పుట్ట గొడుగుల పెంపకానికి ప్రత్యేకంగా యంత్రాలు, స్థలం అవసరం లేదు. ఇంట్లోనే ఒక గది ఖాళీ ఉంటే చాలు ఎంచక్కా వ్యాపారం చేసుకోవచ్చు. పుట్టగొడుగుల పెంపకానికి 30 నుంచి 40 గజాల ఒక చిన్న గది ఉన్నా చాలు. కంపోస్ట్ మిశ్రమం, పుట్టగొడుగు విత్తనాలు ఉంటే చాలు వీటిని పెంచుకోవచ్చు. పుట్టగొడుల పెంపకానికి కావాల్సిన కంపోస్ట్ మిశ్రమం ప్రస్తుతం మార్కెట్లో రెడీమేడ్‌గా లభిస్తోంది.

పుట్టగొడుగులు పెరిగి చేతికి రావడానికి గరిష్టంగా 60 రోజులు పడుతుంది. ఇక ప్రస్తుతం మార్కెట్లో పుట్టగొడుగులకు మంచి డిమాండ్ ఉంది. కిలో హోల్‌సేల్‌ ధర రూ. 100 నుంచి రూ. 150కి లభిస్తోంది. అయితే రిటైల్ ధర ఇంతకంటే ఎక్కువ ఉంటుంది. రిటైల్‌ మార్కెట్‌లో 200 గ్రాముల పుట్టగొడుగుల ప్యాకెట్ రూ. 40 వరకు పలుకుతోంది. కొన్ని సంస్థలు పుట్ట గొడుగుల పెంపకంపై శిక్షణ అందిస్తున్నాయి. అలాగే పుట్టగొడుగుల వ్యాపారం చేస్తూ, లాభాలు ఆర్జిస్తున్న వారికి సంబంధించిన కొన్ని సక్సెస్‌ స్టోరీలు కూడా యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి. వ్యాపారం ప్రారంభించే ముందు వాటిపై ఓ లుక్కేయండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..