Business Idea: ఉద్యోగం బోర్‌ కొడుతోందా.? ఈ వ్యాపారంతో లాభాలే లాభాలు..

సీజన్‌తో వాతావరణంతో సంబంధం లేకుండా అమ్మకాలు జరిగే వాటిలో చాక్లెట్లు ఒకటి. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ చాక్లెట్లను ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇలాంటి బిజినెస్‌ను ఎంపిక చేసుకుంటే మంచి లాభాలు ఆర్జించవచ్చు. చాక్లెట్ల తయారీని తక్కువ బడ్జెట్‌లోనే ప్రారంభించవచ్చు. ఇందుకోసం పెద్దగా స్థలం కూడా అవసరం లేదు...

Business Idea: ఉద్యోగం బోర్‌ కొడుతోందా.? ఈ వ్యాపారంతో లాభాలే లాభాలు..
Business Idea

Updated on: Apr 13, 2024 | 5:52 PM

ఉద్యోగం చేసే ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సమయంలో వ్యాపారం చేయాలని ఆశతో ఉంటారు. అయితే లాభాలు వస్తాయో రావో అన్న భయంతో చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. అలాగే పెట్టుబడి భారంగా మారుతుందని కూడా చాలా మంది బిజినెస్‌ చేయాలని ఆశగా ఉన్నా చేయలేరు. అయితే తక్కువ బడ్జెట్‌లో, మంచి లాభాలు వచ్చే వ్యాపారాలను ప్రారంభిస్తే మాత్రం ఎంచక్కా ఆదాయం పొందొచ్చు. అలాంటి బిజినెస్‌ ఐడియాల్లో ఒక బిజినెస్‌ ప్లాన్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సీజన్‌తో వాతావరణంతో సంబంధం లేకుండా అమ్మకాలు జరిగే వాటిలో చాక్లెట్లు ఒకటి. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ చాక్లెట్లను ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇలాంటి బిజినెస్‌ను ఎంపిక చేసుకుంటే మంచి లాభాలు ఆర్జించవచ్చు. చాక్లెట్ల తయారీని తక్కువ బడ్జెట్‌లోనే ప్రారంభించవచ్చు. ఇందుకోసం పెద్దగా స్థలం కూడా అవసరం లేదు. ఇంట్లోనే ఒక గదిలోనే ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంతకీ చాక్లెట్‌ తయారీ యూనిట్‌ను ఎలా ప్రారంభించాలి.? ఇందుకు ఎంత పెట్టుబడి అవసరం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

చాక్లెట్‌ తయారీకి చాక్లెట్‌ మోల్డ్‌, హీటింగ్ షీట్స్‌, బౌల్స్‌ వంటి సామాన్లు అవసరం ఉంటుంది. అలాగే చాక్లెట్ల తయారీకి అవసరమైన ముడి సరకు అవసరం ఉంటుంది. అలాగే చాక్లెట్లను స్టోర్‌ చేసుకోవడానికి ఒక పెద్ద ఫ్రిజ్‌ అవసరం ఉంటుంది. చాక్లెట్లను ప్యాక్‌ చేయడానికి కవర్స్‌తో పాటు ప్యాకింగ్ మిషన్‌ అవసరపడుతుంది. అయితే చాక్లెట్ తయారీ కంటే ముందు మార్కెటింగ్‌ చేసుకోవాలి. స్థానికంగా ఉన్న దుకాణాలు, బేకరీల్లో మార్కెటింగ్‌ చేసుకోవాలి.

మీ సొంత బ్రాండ్‌ పేరు మీద చాక్లెట్లను తయారు చేస్తే చాక్లెట్ బిజినెస్ మొదలు పెట్టడానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్, ట్రేడ్ అండ్ జిఎస్టి లైసెన్స్ కావాలి. ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ వంటివి కూడా అవసరం అవుతాయి.. ఎంత పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారో ముందుగా ఒక అంచనా వెయ్యాలి.. ఈ బిజినెస్ కోసం మీరు లోన్ కూడా తీసుకోవచ్చు.. ప్రభుత్వ సహకారం కూడా ఉంటుంది.. ఖర్చులు అన్ని పోగా మీకు మంచి ఆదాయం కూడా ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..