Wipro WFH Ends: విప్రోలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి ముగింపు.. ఇక వారంలో రెండ్రోజులు ఆఫీస్‌కు..
Wipro WFH News: కోవిడ్ పరిస్థితుల కారణంగా గత 18 మాసాలుగా అమలు చేస్తున్న వర్క్ ఫ్రమ్ హోం విధానానికి విప్రో ముగింపు పలికింది. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవడం, కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
Wipro WFH News: కోవిడ్ పరిస్థితుల కారణంగా గత 18 మాసాలుగా అమలు చేస్తున్న వర్క్ ఫ్రమ్ హోం విధానానికి విప్రో ముగింపు పలికింది. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవడం, కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకుంది. విప్రో కార్యాలయాలు సోమవారం నుంచి తెరుచుకున్నాయి. ఉద్యోగులు సోమవారం ఉదయం నుంచి తమ కార్యాలయాల్లో పని మొదలుపెట్టారు. అయితే అందరూ ఉద్యోగులు ఆఫీస్‌కు రాకుండా.. హైబ్రీడ్ విధానంలో వారంలో కొన్ని రోజులు ఇళ్ల దగ్గర.. మరికొన్ని రోజులు ఆఫీస్‌కు వచ్చి పనిచేయనున్నారు. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులు సోమవారంనాటి నుంచి వారంలో రెండు రోజులు కార్యాలయాల్లో పనిచేయాల్సి ఉంటుందని ఆ సంస్థ ఛైర్మన్ రిషాద్ ప్రేమ్‌జీ ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.
రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వారినే కార్యాలయాలకు అనుమతిస్తామని రిషాద్ ప్రేమ్‌జీ తెలిపారు. కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ, ఉద్యోగులు సురక్షితంగా వచ్చి వెళ్లేలా, భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తమ ఉద్యోగుల ఆరోగ్య భద్రత నిమిత్తం కార్యాలయాల్లో చేసిన ఏర్పాట్లకు సంబంధించి ఓ వీడియోను కూడా ఆయన ట్వీట్ చేశారు. విప్రో కార్యాలయాల్లో ఉద్యోగులకు శరీర ఉష్ణోగ్రత పరిశీలన, క్యూఆర్ స్కాన్ వంటి ఏర్పాట్లను చేశారు. కార్యాలయాలకు ఉద్యోగులు వస్తున్న నేపథ్యంలో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తామని రిషాద్ ప్రేమ్‌జీ పేర్కొన్నారు. హైబ్రీడ్ పని విధానాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని స్పష్టంచేశారు.
విప్రోలో ప్రస్తుతం దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో గత జులై 14 నాటికే దాదాపు 55 శాతం మంది కొవిడ్ టీకాలు పందారు.
Also Read..
ఏపీలోని పలు పెట్రోల్ బంకుల్లో భారీ మోసం.. లీటరు కొట్టిస్తే దాదాపు పావు లీటరు ఖతం
గణేషుడి నిమజ్జనానికి అనుమతివ్వండి.. హైకోర్టులో జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్..