సిమెంట్, ఇనుము కృత్రిమ కొరతను సృష్టించి రేట్లు పెంచుతున్నారని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఇనుము ధరలు తగ్గించాలని ఉత్పత్తి దారులను, వ్యాపారులను కోరారు. దేశంలో వినియోగిస్తున్న స్టీల్, సిమెంట్‌లో 40 శాతం దేశ వ్యాప్తంగా నిర్మిస్తున్న రహదారుల కోసమే వినియోగిస్తున్నామని వివరించారు. అందుకే సిమెంట్, ఇనుము ధరలను తగ్గించాలని కోరారు. లేని పక్షంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేశిస్తామని మంత్రి ఉత్పత్తిదారులు, వ్యాపారులను హెచ్చరించారు.
దేశీయంగా ఉత్పత్తి అధికంగా ఉండి… సేవలు తక్కువ ధరలకే లభిస్తున్నా సిమెంట్, ఇనుమును బ్లాక్ చేసి అధిక ధరలకు వ్యాపారులు విక్రయిస్తున్నారని మంత్రి గడ్కరీ ఆరోపించారు. ఆయన ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కృత్రిమ ధరల పెరుగుదల న్యాయం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఉత్పత్తిదారులు దారికి రాకపోతే ఇనుముకు ప్రత్యామ్నాయంగా సింథటిక్ ఫైబర్, కాంపోసిట్ ఫైబర్ వినియోగిస్తామని హెచ్చరించారు.