Petrol Prices: పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో తగ్గింపు.. ! క్లారిటీ ఇచ్చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఉపశమనం లభించినట్లే..

వాహనదారులకు ఊరట కలగనుందా..? త్వరలోనే ధరలు తగ్గనున్నాయా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఊహాగానాలపై ప్రభుత్వం స్పందించింది. త్వరలోనే పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పష్టతిచ్చారు.

Petrol Prices: పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో తగ్గింపు.. ! క్లారిటీ ఇచ్చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఉపశమనం లభించినట్లే..
Petrol Diesel Price

Updated on: Jul 02, 2026 | 7:47 PM

పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో తగ్గుతాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. ఆల్ టైం గరిష్ట స్థాయి నుంచి సాధారణ స్థాయికి చేరుకున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు దిగొస్తుండగా.. భారత్‌లో కూడా రేట్లు తగ్గే అవకాశముందని ప్రచారం నడుస్తోంది. త్వరలోనే తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముందని చెబుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్తతలు తగ్గడం, హార్ముజ్ జలసంధి నుంచి ముడి చమురు రవాణా యధాతధ స్థాయికి చేరుకోవడంతో సానుకూల వాతావరణం ఏర్పడింది. దీని ఫలితంగా ఇంధన ధరలు తగ్గుతాయనే ఊహాగానాలు పుంజుకున్నాయి. ఈ క్రమంలో ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా..?

పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో తగ్గుతాయని జరుగుతున్న ప్రచారంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. ముడి చమురు ధరలు తక్కువగా కొనసాగితే కేంద్రం పరిస్థితిని సమీక్షిస్తుందని తెలిపారు. కొన్ని నెలల క్రితం కొనుగోలు చేసిన ముడి చమురు ధరల ఆధారంగా ధరలను నిర్ణయించామని, ధరలు తగ్గితే దానిని పునఃపరిశీలిస్తామని అన్నారు. ఇంధన ధరల తగ్గింపు వార్తలపై ఆయనను మీడియా ప్రశ్నించగా.. ఈ మేరకు సమాధానమిచ్చారు. హర్దీప్ సింగ్ పూరి వ్యాఖ్యలతో త్వరలోనే ధరలను కేంద్రం సవరించే అవకాశముందని తెలుస్తోంది. జులై 1న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్రం తగ్గించింది. ఇక అదే రోజున నయారా సంస్థ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించింది. దీంతో ప్రభుత్వ చమురు సంస్థలు కూడా ధరలు తగ్గించే అవకాశముందని తెలుస్తోంది.

ధరలు ఇంకా ఎందుకు తగ్గలేదు..?

యుద్ద పరిస్థితుల క్రమంలో కొనుగోలు చేసిన ముడి చమురును ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికీ శుద్ధి చేస్తున్నాయి. దీంతో అంతర్జాతీయంగా ధరలు తగ్గినా.. వాటి ప్రభావం రిటైల్ ఇంధన ధరల్లో కనిపించలేదు. యుద్ద సమయంలో కొనుగోలు చేసిన ముడి చమురును కంపెనీలు ఇప్పటికీ శుద్ధి చేస్తున్నాయి. అందుకే ధరలు ఇంకా తగ్గలేదని తెలుస్తోంది. కొత్తగా కొనుగోలు చేసిన చమురు దేశానికి చేరుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశముంది. యుద్ద పరిస్థితుల క్రమంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీలను ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరకు విక్రయించడం వల్ల జూన్ 30తో ముగిసిన కాలంలో చమురు మార్కెటింగ్ కంపెనీలు రూ.74,781 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. రు 70 డాలర్లకు చేరుకుంది హోర్ముజ్ జలసంధి మూతపడటం వల్ల బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు సుమారు 120 డాలర్లకు చేరుకున్నాయి. దీంతో ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు రోజువారీగా సుమారు రూ. 2,400 కోట్ల నష్టాలను చవిచూశాయి. ప్రభుత్వం క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 70 డాలర్ల దిగువకు చేరుకున్నాయి.

Follow Us