AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆవకాయ తర్వాత అంత క్రేజ్ ఉన్న ఆంధ్రుల ఆల్‌టైమ్ ఫేవరెట్.. రుచిలో మాత్రం రాజీ లేదు

వంటకాలలో గోంగూర పచ్చడికి ప్రత్యేక స్థానం ఉంది. పులుపు, కారం, ఘుమఘుమలాడే తాలింపు కలిసిన ఈ పచ్చడి వేడి అన్నంలో నెయ్యితో తింటే అద్భుతమైన రుచిని అందిస్తుంది. తక్కువ పదార్థాలతో సులభంగా తయారయ్యే ఈ సంప్రదాయ ఆంధ్రా వంటకం ప్రతి ఇంట్లోనూ ఎంతో ఫేమస్. వెల్లుల్లి, మసాలా దినుసులతో తయారుచేసే గోంగూర పచ్చడి రుచికే కాకుండా ఆరోగ్యానికీ మేలు చేస్తుంది. గ్రామీణ స్టైల్‌లో చేసిన ఈ స్పెషల్ గోంగూర పచ్చడి ఒకసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపించేలా ఉంటుంది..

Srilakshmi C
|

Updated on: Jul 02, 2026 | 7:14 PM

Share
గోంగూర పచ్చడి (Gongura Pachadi) తయారీ ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటుంది. అయితే పర్ఫెక్ట్ కొలతలతో ఈ కింది విధంగా చేస్తే మళ్లీ మళ్లీ చేసుకుని తింటారు. వేడి అన్నంలో కాస్తంత గోంగూర పచ్చడి వేసుకుని వానాకాలం చల్లని పూట తింటే ఉంటుంది సామీ.. ఇంకెందుకు ఆలస్యం ఆంధ్రా స్టైల్ గోంగూర పచ్చడి ఎలా వండాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
కావలసిన పదార్థాలు.. గోంగూర ఆకులు 4 నుంచి 5 కట్టలు, పచ్చిమిర్చి 8 నుంచి 10, ఎండుమిర్చి 8 నుంచి 12, వెల్లుల్లి రెబ్బలు 10 నుంచి 15, ఉప్పు తగినంత, పసుపు ½ టీస్పూన్, మెంతులు 1 టీస్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీస్పూన్, ఆవాలు 1 టీస్పూన్, మినప్పప్పు 1 టీస్పూన్, శనగపప్పు 1 టీస్పూన్, కరివేపాకు కొద్దిగా, నూనె  4 నుంచి 5 టేబుల్ స్పూన్లు

2 / 5
గోంగూర ఆకులను శుభ్రంగా కడిగి నీరు పూర్తిగా ఆరనివ్వాలి. పాన్‌లో కొద్దిగా నూనె వేసి గోంగూర ఆకులు, పచ్చిమిర్చి వేసి మెత్తబడే వరకు వేయించాలి. ఉడికిన గోంగూరలో ఉప్పు, పసుపు, ముందుగా తయారు చేసిన మసాలా పొడి వేయాలి. వెల్లుల్లి రెబ్బలు కలపాలి. ఆ తర్వాత చల్లారనివ్వాలి. మసాలా కోసం మరో పాన్‌లో కొద్దిగా నూనె వేసి మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయించి చల్లారనివ్వాలి. వీటిని మిక్సీలో పొడిగా చేసుకోవాలి.

3 / 5
వేయించిన గోంగూర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు, పసుపు, మసాలా పొడి వేసి మిక్సీలో పచ్చడిలా గ్రైండ్ చేయాలి. అవసరమైతే కొద్దిగా వెల్లుల్లి ముక్కలు అలాగే ఉంచవచ్చు. తాలింపు కోసం పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. అవి వేగిన తర్వాత గ్రైండ్ చేసిన గోంగూర పచ్చడి వేసి 2 నుంచి 3 నిమిషాలు కలపాలి.

4 / 5
అంతే.. చూస్తేనే నోరూరే గోంగూర పచ్చడి, ఆంధ్రా స్టైల్ స్పెషల్ రుచితో రెడి అయిపోయినట్లే. ఈ గోంగూర పచ్చడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీ, దోసె, చపాతీలతో కూడా బాగా సరిపోతుంది. 4, 5 రోజులు ఫ్రిజ్‌లో నిల్వ ఉంటుంది.

5 / 5
Follow Us
ఆవకాయ తర్వాత అంత క్రేజ్ ఉన్న పచ్చడి ఇదే.. రుచిలో మాత్రం రాజీ లేదు

హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం అప్డేట్

నాడు గన్.. నేడు నాగలి.. వ్యవసాయం పనుల్లో మహిళా మావోయిస్టు

అంతా రామమయం అనుకుంటే.. విరాళాల చోరీతో మొదలై భారీ స్కామ్‌గా మారిన

సికింద్రాబాద్‌లోని ఈ ప్రాంతంలో ప్రతి రోజూ ఉచిత టిఫిన్..

రాజమౌళికి మరో అరుదైన గౌరవం.. దిగ్గజాల సరసన నిలిచిన జక్కన్న

తిరుగులేని శక్తిగా భారత్.. ప్రపంచ సవాళ్ల నడుమ టాప్ గేర్లలో జీడీపీ

అనుకోకుండా వచ్చే అతిథుల కోసం అద్భతమైన స్వీట్.. నోట్లే వేస్తే ..

ఫ్రీ బిర్యానీ కోసం ఎగబడ్డ జనం.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్

బెజవాడ స్టైల్ చిట్టి పునుగులు.. ఇలా చేస్తే ఏమన్నా ఉంటాయా..?