Reasons for Personal Loan Rejection: మీరు పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడం చాలా సార్లు జరుగుతుంది కాని అది తిరస్కరించబడుతుంది. ఇందుకు కొన్ని కారణాలున్నాయి. వాటిలో రుణ ప్రతిపాదన తిరస్కరణకు చాలా కారణాలు ఉండవచ్చు. ఈ కారణాల గురించి ఓ సారి చూద్దాం. మీరు రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు బ్యాంక్ రెండు అంశాలపై దృష్టి పెడుతుంది. మొదటిది రుణగ్రహీత తిరిగి చెల్లించగలరా..? లేదా..? అనేది. రెండవది సాధారణంగా సిబిల్ క్రెడిట్ స్కోరును చూస్తారు.
ఎంత ఎక్కువ స్కోర్ వస్తే మీకు రుణం పొందడానికి అంత ఎక్కువ లోన్ లభించే ఛాన్స్ ఉంది. ఎంత తక్కువ స్కోర్ వస్తే.. మీ దరఖాస్తు చేస్తున్న రుణం రిజెక్ట్ అవడానికి అన్ని ఛాన్సెస్ ఉంటాయి. మీకు నెలానెలా వచ్చే ఆదాయం, వేతనం ( Income / Salary ) ఎంత ? ఆదాయంలోంచి వ్యయం ( Expenses ) పోగా తిరిగి రుణం చెల్లించే పరిస్థితి ఉందా లేదా అనే అంశాలన్నింటినీ బ్యాంకులు పరిశీలిస్తాయి.
పర్సనల్ లోన్ కావాలంటే కనీసం 750 సిబిల్ స్కోర్ ఉండాలి. అంతకంటే తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నట్టయితే, మీరు చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు అయినా గురవుతుంది లేదా సాధారణ స్థాయి వడ్డీ రేటు ( Personal loan interest rates ) కంటే ఎక్కువ వడ్డీ రేటు ( Interest rates ) వసూలు చేయడం జరుగుతుంది. అంతేే మీరు అనుకున్న రుణం కంటే తక్కువ మొత్తంలో లోన్ దొరుకుతుంది.
అప్పుడు అతను సులభంగా రుణం పొందగలడు. క్రెడిట్ స్కోర్ తగ్గినప్పుడు బ్యాంక్ ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తుంది. కాని ఎన్‌బిఎఫ్‌సి మీకు రుణం ఇవ్వగలదు.
క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం
కొంతమందికి క్రెడిట్ స్కోరు రెడీగా ఉండదు. ఎవరికైనా క్రెడిట్ చరిత్ర లేకపోతే బ్యాంకులు రుణం ఇవ్వవు. ప్రతి బ్యాంకుకు కనీస రుణ పరిమితి ఉంటుంది.
ప్రతి బ్యాంకు పర్సనల్ లోన్ ఇవ్వడానికి కొంత లిమిట్ ఉంటుంది. ఉదాహరణకు జీతం 20-30 వేల కన్నా తక్కువ ఉంటే బ్యాంక్ రుణం ఇవ్వదు. మీకు ఎక్కువ loan కావాలంటే జీతం కూడా ఎక్కువగా ఉండాలి. ఇలా కాకుండా ప్రతి నెలా మీ నిర్ణీత ఖర్చులు ఎక్కువగా ఉంటే.. బ్యాంక్ లోన్ ఇవ్వదు.
అయితే ఇలా పర్సనల్ లోన్ తీసుకున్నప్పుడు తక్కువ మొత్తాన్ని తీసుకోండి. ఆ తరువాత లోన్ తిరిగి చెల్లిస్తున్నప్పుడు బ్యాంకులు మీకు మరోసారి లోన్ ఇచ్చేందుకు అవకాశం ఇస్తాయి. మీరు తీసుకున్నలోన్‌పై టాప్-అప్ తీసుకోండి.
మీ క్రెడిట్ స్కోరు అంత మంచిగా లేని సమయంలో రుణగ్రహీత నుంచి తక్కువ మొత్తంలో రుణం అడగాలి. ఆ తరువాత అదే బ్యాంక్ / ఆర్థిక సంస్థ నుండి లోన్ టాప-అప్ రూపంలో ఎంపిక చేసుకోండి. మీరు ప్రారంభ వాయిదాలను సకాలంలో చెల్లించినట్లయితే మాత్రమే ఇది సాధ్యమవుతుంది. మీకు లోన్ ఇచ్చే బ్యాంక్ కు మీపై నమ్మకం పెరుగుతుంది. మీరు తక్కువ రుణం కోసం చిన్న వాయిదాలపై తక్కువ పన్ను చెల్లించాలి. మీ నెలవారీ బడ్జెట్ పరిమితం చేయబడుతుంది.