Stock Market: స్టాక్‌ మార్కెట్‌లో బుల్‌ జోష్.. సెన్సెక్స్‌ 1500 పాయింట్లు జంప్‌..

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నా.. బుల్‌ జోరుకు కారణమేంటి..? డాలరు విలువ తగ్గడం కూడా మన మార్కెట్లకు కలిసొస్తుందా..? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓసారి లుక్కేయండి మరి.. ఈ ఆర్టికల్ మీకోసమే చూసేయండి.

Stock Market: స్టాక్‌ మార్కెట్‌లో బుల్‌ జోష్.. సెన్సెక్స్‌ 1500 పాయింట్లు జంప్‌..
Stock Market

Updated on: Apr 17, 2025 | 7:37 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో బుల్‌ జోరు కొనసాగుతోంది. స్టాక్ మార్కెట్‌ సూచీలు వరుసగా నాలుగో రోజూ లాభాల్లో ముగిశాయి. ఒక దశలో నిఫ్టీ 23,861 పాయింట్ల దగ్గర గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 78, 566 పాయింట్ల గరిష్టానికి వెళ్లింది. అమెరికా, చైనా మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నా.. ఫైనాన్షియల్‌ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సూచీలను ముందుండి నడిపించాయి. దేశీయంగా కనిష్ఠ స్థాయికి రిటైల్‌ ద్రవ్యోల్బణ చేరడం, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కూడా పాజిటివ్‌ సెంటిమెంట్‌కు తోడయ్యాయి.

దీంతో సెన్సెక్స్‌ 1500 పాయింట్ల మేర లాభపడి మళ్లీ 78 వేల మార్కును దాటగా.. నిఫ్టీ దాదాపు 400 పాయింట్ల మేర లాభపడి 23,800 దగ్గర ముగిసింది. అమెరికా కరెన్సీ అయిన డాలరు విలువ బలహీన పడడం మన మార్కెట్లకు సానుకూల పరిణామం అని అనలిస్టులు చెబుతున్నారు. టారిఫ్‌ల విషయంలో అమెరికా, జపాన్‌ మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. ఇది సెంటిమెంట్‌ను బలపరిచింది. ఇదే తరహాలో భారత్‌తో కూడా సానుకూల ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందన్న అంచనాలు కూడా తోడయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ 66 డాలర్ల వద్ద కొనసాగుతోంది. దిగుమతులపై ప్రధానంగా ఆధారపడే భారత్‌కు ఎంతకాలం తక్కువ ధరలకు క్రూడాయిల్‌ లభిస్తే ఆ మేర ద్రవ్యలోటు తగ్గుతుంది.