2023-24 ఆర్థిక సంవత్సరానికి మీ ట్యాక్స్‌ల గురించి ప్లాన్ చేయడానికి మీకు రెండున్నర నెలల కంటే తక్కువ సమయం ఉంది. జీతం పొందిన వ్యక్తులు పన్ను పొదుపులకు సంబంధించిన పత్రాలను ఫిబ్రవరిలో తమ కంపెనీలకు సమర్పించాలి. కొత్త పన్ను విధానం ఆకర్షణీయంగా రూపొందించినా.. కొత్త, పాత పన్నుల వ్యవస్థల్లో దేనిని ఎంపిక చేసుకోవాలన్నదానిపై ప్రజల్లో గందరగోళం ఉంది. ఇక్కడున్న వీడియోలో రెండు పన్ను విధానాలలో అందుబాటులో ఉన్న పన్ను ప్రయోజనాలను తెలుసుకోవచ్చు. ఈ సమాచారం మీకు మంచి నిర్ణయం తీసుకోవడానికి సహాయపడతాయి.
పన్ను పొదుపు కోసం అందుబాటులో ఉన్న అనేక ఆప్షన్స్ వల్ల పాత పన్ను విధానం.. పన్ను చెల్లింపుదారులలో బాగా పాపులారిటీని సంపాదించింది. పాత పన్ను విధానంలో దాదాపు 70 మినహాయింపులు, తగ్గింపులు ఉన్నాయి. ఇవి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం, పన్ను భారాన్ని తగ్గిస్తాయి. అదనంగా ఈ పథకం పొదుపు అలవాట్లను పెంచడానికి దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా పన్ను రహిత రాబడిని సంపాదించడానికి, పదవీ విరమణ కోసం నిధులను కూడబెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
పాత పన్ను విధానంలో మినహాయింపులు, తగ్గింపుల కోసం అత్యంత సాధారణ విభాగాలలో ఒకటి సెక్షన్ 80C. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C ప్రకారం ఉద్యోగుల భవిష్య నిధి (EPF), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), జీవిత బీమా మొదలైన వివిధ పథకాలలో పెట్టుబడులు 1.5 లక్షల రూపాయల వరకు తగ్గింపులకు అవకాశం కల్పిస్తాయి. అంతేకాకుండా నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పిఎస్)లో పెట్టుబడులకు 50,000 రూపాయల అదనపు మినహాయింపు ఉంది. ఈ విధంగా 2 లక్షల రూపాయల వరకు పెట్టుబడులకు ట్యాక్స్ లేకుండా చూసుకోవచ్చు.
సెక్షన్ 80డి కింద ఆరోగ్య బీమా వర్తిస్తుంది. 25,000 రూపాయల మినహాయింపు పరిమితితో పాలసీదారు, తన జీవిత భాగస్వామి, పిల్లలకు ఆరోగ్య బీమా పాలసీ కోసం చెల్లించిన ప్రీమియంలకు ట్యాక్స్ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. సీనియర్ సిటిజన్లకు ఈ పరిమితి 50,000 రూపాయలు. మీరు, మీ తల్లిదండ్రులు ఇద్దరూ సీనియర్ సిటిజన్లు అయితే, మీరు గరిష్టంగా 1 లక్ష రూపాయల వరకు మినహాయింపు పొందవచ్చు. హౌస్ రెంట్ అలవెన్స్ (HRA).. జీతం పొందే వ్యక్తులు వసతి కోసం చెల్లించిన అద్దెకు తగ్గింపును క్లెయిమ్ చేయడానికి అనుమతిస్తుంది. అయితే, దీని కోసం కొన్ని షరతులు పాటించాలి. మొదట, HRAగా స్వీకరించిన మొత్తం. రెండవది.. మెట్రో నగరాల్లో ప్రాథమిక వేతనంలో 50%, నాన్-మెట్రో నగరాల్లో జీతంలో 40% ను HRAగా పరిగణించాలి. మూడో కండీషన్.. పైన పేర్కొన్న లెక్కింపు తరువాత.. మిగిలిన వార్షిక జీతం నుండి చెల్లించే వార్షిక అద్దెలో 10% తీసివేయడం.
మూడు మొత్తాలలో అతి తక్కువ మొత్తాన్ని తగ్గింపు కోసం లెక్కలోకి తీసుకుంటారు. పాత పన్ను విధానం ప్రకారం.. హోమ్ లోన్‌తో ఇంటిని కొనుగోలు చేయడానికి పన్ను ప్రయోజనం కూడా ఉంది. సెక్షన్ 24(బి) ప్రకారం.. గృహ రుణం వడ్డీపై 2 లక్షల రూపాయల వరకు తగ్గింపును పొందవచ్చు. అదేవిధంగా సెక్షన్ 80C కింద ప్రిన్సిపల్ అమౌంట్‌పై మినహాయింపు అందుబాటులో ఉంది. కొత్త పన్ను వ్యవస్థలో పన్ను రేట్లు తక్కువగా ఉంటాయి. కానీ పాత పన్ను వ్యవస్థలో ఉన్నట్టుగా కాకుండా, మినహాయింపులు, తగ్గింపులు లేవు. బడ్జెట్ 2023 కొత్త పన్ను విధానంలో అనేక మార్పులను తీసుకొచ్చింది. ప్రాథమిక మినహాయింపు పరిమితిని రెండున్నర లక్షల నుంచి మూడు లక్షలకు పెంచారు. పన్ను స్లాబ్‌ల సంఖ్య 6 నుండి 5కి తగ్గించారు. ఉద్యోగస్తులు 50,000 రూపాయల స్టాండర్డ్ డిడక్షన్ ను పొందుతారు. అధికంగా ఆదాయం ఉన్నవారికి సర్‌చార్జి ని తగ్గించారు. కొత్త పన్ను వ్యవస్థలో ఏడు లక్షల రూపాయల వరకు ఆదాయంపై పన్ను ఉండదు. స్టాండర్డ్ డిడక్షన్‌ను కలపడం వల్ల పన్ను పరిధికి బయట ఏడున్నర లక్షల రూపాయల వరకు ఆదాయం ఉంటుంది.
ఆదాయపు పన్ను కాలిక్యులేటర్ ద్వారా పన్ను ఆదాను బాగా అర్థం చేసుకోవచ్చు. ఒక ఉదాహరణ తీసుకుందాం.. మీ స్థూల జీతం 10 లక్షల రూపాయలు. మీరు రెండు పన్ను నిబంధనల కింద 50,000 రూపాయల స్టాండర్డ్ డిడక్షన్‌కు అర్హులైతే, పాత పన్నుల విధానంలో ఎలాంటి మినహాయింపులు లేకుండా మొత్తం పన్ను 1,06,600 రూపాయలు ఉంటుంది. కొత్త దానిలో అది 54,600 రూపాయలు. కొత్త దానిని ఎంచుకోవడం వలన మీకు 52,000 రూపాయలు ఆదా అవుతుంది.
పాత పన్ను విధానం ప్రకారం, మీరు 80Cలో 1.5 లక్షలు, 80Dలో 25,000, సెక్షన్ 80CCD(1b) కింద NPSలో 50,000 పెట్టుబడులు పెడితే, సెక్షన్ 24(b), మీ పాత పన్ను విధానం ప్రకారం మీ ట్యాక్స్ 18,200 రూపాయలు. దీని ప్రకారం చూస్తే.. పాత విధానాన్ని ఎంచుకోవడం వలన మీకు 36,400 రూపాయలు ఆదా అవుతుంది.
కొత్త పన్ను నియంత్రణ పరిమితి వరకు అందుబాటులో ఉన్న మినహాయింపులను గరిష్టంగా ఉపయోగించడం వలన మరింత ముఖ్యమైన ప్రయోజనాలు లభిస్తాయని ఈ లెక్క స్పష్టం చేస్తుంది. ఉదాహరణకు పన్ను చెల్లింపుదారు తమ ఆదాయంలో గణనీయమైన భాగాన్ని పన్నును ఆదా చేసే ఆప్షన్స్ లో పెట్టుబడి పెడితే, పాత పన్ను విధానాన్ని ఎంచుకోవడం వల్ల వాళ్లకు మరింత ప్రయోజనం దక్కవచ్చు.
అయితే, పెట్టుబడుల కోసం అదనపు నిధులను కేటాయించలేని.. లేదా పన్ను ఆదా కోసం పెట్టుబడులు పెట్టకూడదు అనుకునే వారికి కొత్త పన్ను విధానం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని అర్థమవుతుంది. ఏదైనా ఒకదానిని ఎంచుకునే ముందు ఆదాయ పన్ను శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఆదాయ పన్ను కాలిక్యులేటర్‌ని ఉపయోగించడం ద్వారా రెండు విధానాలలో మీ ఆదాయాన్ని లెక్కించడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి