Revolt RV400 BRZ: మార్కెట్లోకి మరో అదిరిపోయే ఎలక్ట్రిక్‌ బైక్‌.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా..

రివోల్ట్‌ ఆర్‌వీ400 బీఆర్‌జెడ్‌ పేరుతో ఈ కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌ను తీసుకొచ్చారు. ఇప్పటికే ఈ బైక్‌ బుకింగ్స్‌ ప్రారంభమ్యాయి. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ లేదా రివోల్ట్‌ షోరూమ్‌లలో బైక్‌ను బుక్‌ చేసుకోవాలని రివోల్ట్‌ తెలిపింది. ఇక ధర విషయానికొస్తే ఈ ఎలక్ట్రిక్‌ బైక్‌ ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ. 1.38 లక్షలుగా నిర్ణయించారు...

Revolt RV400 BRZ: మార్కెట్లోకి మరో అదిరిపోయే ఎలక్ట్రిక్‌ బైక్‌.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా..
Revolt Rv400 Brz
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 25, 2024 | 7:01 PM

ఎలక్ట్రిక్‌ బైక్‌లకు పెట్టింది పేరు రివోల్ట్‌ మోటార్స్‌. అప్పటి వరకు కేవలం ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌ మాత్రమే అందుబాటులో ఉన్న సమయంలో బైక్‌ను లాంచ్‌ చేసిందీ సంస్థ. పెట్రోల్‌ బైక్‌లకు ఏమాత్రం తీసిపోని మోడల్స్‌లో వచ్చిన ఈ ఎలక్ట్రిక్‌ బైక్‌లకు యూత్‌ పెద్ద ఎత్తు అట్రాక్ట్‌ అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా వినియోగదారులను పెంచుకునే లక్ష్యంతో రివోల్ట్‌ మరో ముందడుగు వేసింది.

రివోల్ట్‌ ఆర్‌వీ400 బీఆర్‌జెడ్‌ పేరుతో ఈ కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌ను తీసుకొచ్చారు. ఇప్పటికే ఈ బైక్‌ బుకింగ్స్‌ ప్రారంభమ్యాయి. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ లేదా రివోల్ట్‌ షోరూమ్‌లలో బైక్‌ను బుక్‌ చేసుకోవాలని రివోల్ట్‌ తెలిపింది. ఇక ధర విషయానికొస్తే ఈ ఎలక్ట్రిక్‌ బైక్‌ ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ. 1.38 లక్షలుగా నిర్ణయించారు. అయితే బుకింగ్ సమయంలో ఎంత చెల్లించాల్సి ఉంటుందన్న విషయం కంపెనీ వివరించలేదు. ఇక ఈ బైక్‌.. ఎలిప్స్‌ రెడ్‌, కాస్మిక్ బ్లాక్‌, మిస్ట్‌ గ్రే, ఇండియా బ్లూ, స్టెల్త్ బ్లాక్‌, లైటింగ్‌ ఎల్లో రంగుల్లో లభిస్తుంది.

ఈ బైక్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 2.24 కేడబ్ల్యూహెచ్‌ లిథియం బ్యాటరీ 3కేడబ్ల్యూ మిడ్‌ డ్రైవ్‌ మోటార్‌ను ఇచ్చారు. 170Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక ఛార్జింగ్‌ విషయానికొస్తే బ్యాటరీ ఫుల్‌ కావడానికి 4.3 గంటలు పడుతుంది. ఇక ఒక్కసారి ఫుల్‌ ఛార్జింగ్‌ చేస్తే ఏకంగా 150 కిలోమీటర్లు నాన్‌స్టాప్‌గా దూసుకుపోతుంది. అయితే ఇది ఎకో మోడ్‌లో మాత్రమే. తక్కువ స్పీడ్‌తో వెళితే 150 కిమీల రేంజ్‌ ఇస్తుందని, గంటకు 65 కిలోమీటర్ల వేగంతో వెళితే.. 100 కి.మీలు, 85 కిలోమీటర్ల వేగంతో వెళితే.. 80 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

ఈ కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌లో కాంబి-బ్రేకింగ్ సిస్టమ్, సైడ్-స్టాండ్ కటాఫ్‌, స్పీడ్‌, బ్యాటరీ స్థాయి, రైడింగ్ మోడ్, వెదర్‌ను చూపించే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఇందులో అందించారు. ఇక ఈ ఎలక్ట్రిక్‌ బైక్‌ 3 గంటల్లో 0 నుంచి 75 శాతం ఛార్జింగ్‌ అవుతుంది. అలాగే ఇందులో హెక్జాగోనల్‌ ఎల్‌ఈడీ హెడ్‌లాంప్‌ను ఇచ్చారు. డిజిటల్‌ ఇస్ట్రుమెంట్‌ కన్జోల్‌, డ్యూయల్‌ టోన్‌ బాడీ వర్క్‌, సింగిల్‌ పీస్‌ సీట్‌ను అందించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?