National Pension System: ఎన్‍పీఎస్‍లో రెండు ఆప్షన్లు ఏమిటి? వాటిలో ఏది బెటర్? పూర్తి వివరాలు..

|

Apr 05, 2023 | 12:45 PM

ఎన్‍పీఎస్ పథకంలో పెట్టుబడి పెట్టడానికి ఖాతాదారులకు ఆటో, యాక్టివ్ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఆటో అంటే దీనిలో ఖాతాదారులు తమ డబ్బును తమకు కావలసిన చోట పెట్టుబడి పెట్టడానికి ఫండ్ మేనేజర్‌కు స్వేచ్ఛను ఇస్తారు. యాక్టివ్ అంటే ఖాతాదారుడు తనే తన అసెట్స్ ఎంపిక చేసుకొని పెట్టుబడి పెడతాడు.

National Pension System: ఎన్‍పీఎస్‍లో రెండు ఆప్షన్లు ఏమిటి? వాటిలో ఏది బెటర్? పూర్తి వివరాలు..
Nps
Follow us on

నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్‍పీఎస్).. పదవీ విరమణ తర్వాత వృద్ధాప్యంలో మీకు ఆర్థిక భద్రతను కల్పించే మంచి పథకం. ఆ సమయంలో మీ అవసరాలకు ఎవరిపైనా ఆధారపడకుండా ఉండేందుకు దోహద పడుతుంది. ఆ సమయంలో స్థిరమైన ఆదాయాన్ని ఇస్తూ.. జీవితాన్ని ప్రశాంతంగా గడిపేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ పథకం ప్రారంభించిన తొలి నాళ్లలో ఇది ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే ఆ తర్వాత దీనిని అందిరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. 2004 జనవరిలో ఈ పథకాన్ని ప్రారంభించగా.. 2009లో అందరికీ అందుబాటులోకి తెచ్చారు.

ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ కార్పొరేట్ బాండ్‌లు, ప్రభుత్వ సెక్యూరిటీలు లేదా ఈక్విటీలో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని ప్రజలకు కల్పిస్తుంది. మీరు 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ పౌరులైతే, మీరు ఎన్‍పీఎస్‍లో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు ఉద్యోగం చేసే వయస్సులో క్రమం తప్పకుండా పెట్టుబడి పెడుతూ.. 60 సంవత్సరాల వయస్సుకు వచ్చే సరికి మీరు కూడబెట్టిన డబ్బులో కొంత భాగాన్ని ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన మొత్తం నుండి సాధారణ పెన్షన్ ఆదాయాన్ని పొందవచ్చు.

రెండు రకాలు.. ఎన్‍పీఎస్ పథకంలో పెట్టుబడి పెట్టడానికి ఖాతాదారులకు ఆటో, యాక్టివ్ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి.
ఆటో అంటే దీనిలో ఖాతాదారులు తమ డబ్బును తమకు కావలసిన చోట పెట్టుబడి పెట్టడానికి ఫండ్ మేనేజర్‌కు స్వేచ్ఛను ఇస్తారు. యాక్టివ్ అంటే ఖాతాదారుడు తనే తన అసెట్స్ ఎంపిక చేసుకొని డబ్బును పెట్టుబడి పెడతాడు.

ఇవి కూడా చదవండి

యాక్టివ్ ఆప్షన్ అంటే.. యాక్టివ్ ఆప్షన్ లో ఖాతాదారుడు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తనే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మీరు మీ కోరిక మేరకు ఈక్విటీ, బాండ్‌లు లేదా ఇతర పెట్టుబడి సాధనాల్లో మీ మూలధనాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. ఈక్విటీలో పెట్టుబడి పరిమితి మీ మొత్తం పెట్టుబడి మూలధనంలో 75%. ఈ ఎంపికలో, ఫండ్ మేనేజర్ మీకు అన్ని పథకాల గురించి సమాచారాన్ని అందిస్తారు. వాటిలో మీరే ఎంపిక చేసుకోవాలి.

ఆటో ఆప్షన్ అంటే.. ఆటో ఆప్షన్ లో మూడు రకాలుగా ఫండ్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మొదటిది డిఫాల్ట్ మోడరేట్ లైఫ్ సైకిల్ ఫండ్.. ఇందులో గరిష్టంగా ఈక్విటీ పెట్టుబడి 50 శాతం వరకు ఉంటుంది. రెండవది కన్జర్వేటివ్ లైఫ్ సైకిల్ ఫండ్, ఇది ఈక్విటీలలో 25% వరకు మాత్రమే పెట్టుబడిని అనుమతిస్తుంది. మూడవది అగ్రెసివ్ లైఫ్ సైకిల్ ఫండ్, ఇందులో మీరు ఈక్విటీలో 75% వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

మీకు ఏ ఎంపిక సరైనది?

మీరు యాక్టివ్ లేదా ఆటో ఆపప్షన్లలో ఏది ఎంచుకోవాలో అనే అయోమయంలో ఉంటే, ఆటో కేటాయింపు మీకు సరైనది. ఈ ఎంపిక లో ఖాతాదారులు తమ డబ్బును అందుబాటులో ఉన్న ఆస్తుల మధ్య సమానంగా పంపిణీ చేయడానికి సహాయపడుతుంది. కొంత సమయం తర్వాత, సబ్‌స్క్రైబర్‌లు మార్కెట్‌ను అర్థం చేసుకోవడం మరియు పెట్టుబడి గురించి అవగాహన కలిగి ఉన్నప్పుడు, వారు యాక్టివ్ ఛాయిస్ ప్లాన్‌ని ఎంచుకోవడం ద్వారా వారి స్వంత పోర్ట్‌ఫోలియోను నిర్వహించవచ్చు.

మీరు ఒక వేళ యాక్టివ్ చాయిస్ ను ఎంచుకోవాలనుకుంటే, అలా చేయడానికి ముందు మూడు ప్రశ్నలు మిమ్మల్ని మీరు వేసుకోవాలి. మొదటిది, వివిధ అసెట్ క్లాస్‌లను అధ్యయనం చేసి, సరైన విధంగా కేటాయింపు చేయగలరా? రెండవది, మీకు వేరే చోట పెట్టుబడులు ఉంటే.. మీ మొత్తం పెట్టుబడుల పోర్ట్ ఫోలియోలో ఎన్‍పీఎస్ ఒక భాగం మాత్రమేనా? మూడవదిగా, భవిష్యత్తులో ఎన్‍పీఎస్ పోర్ట్‌ఫోలియోను మార్చాల్సిన అవసరం ఉంటుందా? ఈ మూడు ప్రశ్నలకు అవును అనే సమాధానం గనుక మీరు ఇస్తే అప్పుడు యాక్టివ్ ఆప్షన్ కు వెళ్లవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..