Fixed Deposit: ఎస్‌బీఐ, పోస్ట్ ఆఫీసుల్లో ఏది బెటర్ ఆప్షన్? ఫిక్స్‌డ్ డిపాజిట్ ఎక్కడ చేస్తే మేలు..

|

Apr 24, 2023 | 5:20 PM

చాలా బ్యాంకులు 7 శాతానికి పైగానే వడ్డీ రేటును అందిస్తున్నాయి. దీనిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధికంగా 7.5శాతం వరకూ వడ్డీ అందిస్తుంది. మరి అలాంటప్పడు ఎస్బీఐ లో ఎఫ్ఢీ తీసుకోవడం మంచిదా? లేక పోస్ట్ ఆఫీసులో ఖాతా ప్రారంభించడం ఉత్తమమా?

Fixed Deposit: ఎస్‌బీఐ, పోస్ట్ ఆఫీసుల్లో ఏది బెటర్ ఆప్షన్? ఫిక్స్‌డ్ డిపాజిట్ ఎక్కడ చేస్తే మేలు..
Fixed Deposit
Follow us on

ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ) సురక్షిత పెట్టుబడి పథకంగా చాలా వినియోగదారులు భావిస్తారు. ఎందుకంటే ఎటువంటి రిస్క్ లు లేకుండా కచ్చితమైన రాబడులు వస్తాయి. అందుకే ఇది అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ ఎఫ్‌డీని బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసుల్లో ప్రారంభించవచ్చు. అయితే ఈ రెండింటికి మధ్య వడ్డీ రేట్లలో వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. మరి అలాంటప్పడు ఈ రెండు ఆప్షన్లలో ఏది బెటర్. 2022 మే నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు పెంచింది. దీంతో చాలా బ్యాంకులు తమ ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. చాలా బ్యాంకులు 7 శాతానికి పైగానే వడ్డీ రేటును అందిస్తున్నాయి. దీనిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధికంగా 7.5శాతం వరకూ వడ్డీ అందిస్తుంది. మరి అలాంటప్పడు ఎస్బీఐ లో ఎఫ్ఢీ తీసుకోవడం మంచిదా? లేక పోస్ట్ ఆఫీసులో ఖాతా ప్రారంభించడం ఉత్తమమా? అసలు పోస్ట్ ఆఫీసులో ఫిక్స్ డ్ డిపాజిట్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? రెండింటికీ మధ్య వ్యత్యాసం చూద్దాం రండి..

ఎస్బీఐ ఎఫ్‌డీ Vs పోస్ట్ ఆఫీస్ ఎఫ్‌డీ..

టెన్యూర్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో టెర్మ్ డిపాజిట్ ఏడు రోజుల నుంచి 10 ఏళ్ల కాల వ్యవధితో ఉంటుంది. అదే పోస్ట్ ఆఫీసు అయితే ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల కాల పరిమితితో ఉంటాయి.

వడ్డీ రేటు..

  • ఎస్బీఐ లో సాధారణ పౌరులకు రూ. రెండు కోట్ల వరకూ ఉండే తమ ఎఫ్ డీలపై మూడు నుంచి ఏడు శాతం వడ్డీ రేటు అందిస్తాయి. అదే సీనియర్ సిటిజెన్స్ కి అయితే 0.5శాతం అదనంగా ఉంటుంది. ముఖ్యంగా అమృత్ కలష్ పథకం 7.6శాతం వరకూ వడ్డీ వస్తుంది. అయితే దీని కాల వ్యవధి 400 రోజులు మాత్రమే.
  • అదే పోస్ట్ ఆఫీసుల్లో అయితే 6.8 నుంచి 7.5 శాతం వరకూ వడ్డీ రేటు అందుతుంది. ఏడాది ఒకసారి వడ్డీని జమ చేస్తారు. ఇందులో వయో వృద్ధులకు ఎటువంటి ప్రత్యేకమైన రేటు ఉండదు.

ట్యాక్స్ బెనిఫిట్స్.. ఎస్బీఐ, ఫోస్ట్ ఆఫీస్ రెండింటిలోనూ ఆదాయ పన్ను చట్ట ప్రకారం పన్ను మినహాయింపు పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

ముందే విత్ డ్రా చేయాలంటే..

  • పోస్ట్ ఆఫీసుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లను ముందే విత్ డ్రా చేయాలనుకుంటే మాత్రం కనీసం ఖాతా ప్రారంభించిన ఆరు నెలల వరకూ ఆగాల్సిందే. ఈలోపు విత్ డ్రా చేయడం కుదరదు. ఆరు నెలల తర్వాత ఏడాదిలోపు ఎఫ్ డీ నగదు విత్ డ్రా చేయాలంటే ఎఫ్ డీ వడ్డీ రేట్లు కాకుండా పోస్టు ఆఫీసుల్లో సేవింగ్స్ ఖాతాకు ఇచ్చే వడ్డీ రేటు ఇస్తారు.
  • ఎస్పీఐలో అయితే ఎఫ్ డీ సొమ్మును ఎప్పుడైనా విత్ డ్రా చేయొచ్చు. కానీ పెనాల్టీ కింద కొంత మొత్తాన్ని బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది.

మరి ఏది మంచిది..

ఎస్బీఐ, పోస్ట్ ఆఫీసుల్లో ఎఫ్ డీ ఖాతాల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూశాం కదా. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్? అని అడిగితే అది వ్యక్తి అవసరాలను బట్టి ఉంటుంది. రెండు కూడా మంచి ఆప్షన్లే.. రెండు చోట్ల ప్రభుత్వ భరోసా ఉంటుంది. కాని మీ ఆర్థిక అవసరాలను బట్టి మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. తక్కువ వ్యవధికి అయితే ఎస్బీఐ మంచి ఆప్షన్. అదే ఎక్కువ కాలానికి మీరు ఎఫ్డీ చేయాలనుకుంటే మాత్రం పోస్ట్ ఆఫీసులైతే మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..