Bank Deposits: ఈ డిపాజిట్లపై ఈ ఐదు బ్యాంకులు బంపర్‌ రిటర్న్స్.. ఏయే బ్యాంకులు అంటే..

|

Aug 24, 2024 | 7:22 PM

పెట్టుబడి విషయానికి వస్తే, ప్రతి ఒక్కరి మదిలో వచ్చే మొదటి ఆలోచన రాబడి గురించి. అధిక రాబడి కోసం ప్రజలు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టమని సలహా ఇస్తారు నిపుణులు. కానీ అధిక రాబడితో స్టాక్ మార్కెట్లో అధిక రిస్క్ ఉంటుంది. మీరు అధిక రాబడి కోసం మాత్రమే స్టాక్ మార్కెట్‌ను ఆశ్రయించాలని కాదు. ఈ రోజు మనం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీని..

Bank Deposits: ఈ డిపాజిట్లపై ఈ ఐదు బ్యాంకులు బంపర్‌ రిటర్న్స్.. ఏయే బ్యాంకులు అంటే..
Follow us on

పెట్టుబడి విషయానికి వస్తే, ప్రతి ఒక్కరి మదిలో వచ్చే మొదటి ఆలోచన రాబడి గురించి. అధిక రాబడి కోసం ప్రజలు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టమని సలహా ఇస్తారు నిపుణులు. కానీ అధిక రాబడితో స్టాక్ మార్కెట్లో అధిక రిస్క్ ఉంటుంది. మీరు అధిక రాబడి కోసం మాత్రమే స్టాక్ మార్కెట్‌ను ఆశ్రయించాలని కాదు. ఈ రోజు మనం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీని అందించే బ్యాంకుల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఈ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయడం ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. ఈ బ్యాంక్ ఆఫర్‌లు అందరికీ ఉన్నప్పటికీ కొన్ని బ్యాంకులు 10 శాతం వరకు రిటర్న్‌లు ఇస్తున్నాయి. బ్యాంకు బజార్‌ వివరాల ప్రకారం.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ రాబడిని ఇస్తున్న 5 బ్యాంకుల గురించి తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: Central Bank: డిసెంబర్‌లో రూ.5000 నోట్లు విడుదల.. ఆ సెంట్రల్‌ బ్యాంకు కీలక ప్రకటన

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్:

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1 సంవత్సరం కాలపరిమితికి 7.85%, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల కాలవ్యవధికి 8.15%, అలాగే సాధారణ కస్టమర్‌లకు గరిష్టంగా 9% ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో అగ్రస్థానంలో ఉంది. సీనియర్ సిటిజన్లు అదనంగా 50 బేసిస్ పాయింట్లను (bps) పొందుతారు. వారి రేటు 9.50%కి చేరుకుంది.

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్:

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డీపై 1 సంవత్సరానికి 8%, 3 సంవత్సరాలకు 8.50%, 5 సంవత్సరాలకు 7.75% వడ్డీని అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు అదనంగా 60 బేసిస్ పాయింట్లను (bps) పొందుతారు. వారి ఎఫ్‌డీ రేటు 9.10%.

శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్:

శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1 సంవత్సరానికి 6%, 3 సంవత్సరాలకు 7.50%, 5 సంవత్సరాలకు 6.50% ఎఫ్‌డీ రేట్లను అందిస్తుంది. ఇది సీనియర్ సిటిజన్లకు 9.05% రేటును అందిస్తుంది.

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్:

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1 సంవత్సరం, 3 సంవత్సరాలకు 8.25% ఎఫ్‌డీ రేట్లను అందిస్తుంది. అయితే 5 సంవత్సరాలకు ఎఫ్‌డీ రేటు 7.25%. సీనియర్ సిటిజన్లు అత్యధిక వడ్డీ రేటు 8.75% వరకు పొందుతారు.

DCB బ్యాంక్

DCB బ్యాంక్ 1 సంవత్సరానికి 7.10%, 3 సంవత్సరాలకు 7.55%, అలాగే 5 సంవత్సరాలకు 7.40% ఎఫ్‌డీ రాబడిని అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు అత్యధిక ఎఫ్‌డీ రేటు 8.55% అదనంగా 50 bps.

ఇది కూడా చదవండి: Indian Railways: ఒకే రైలు టికెట్‌పై 56 రోజుల ప్రయాణం.. సర్క్యులర్ జర్నీ టికెట్‌ గురించి మీకు తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి