సొంతిల్లు అనేది ప్రతి మధ్యతరగతి ఉద్యోగి కల. ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటూ సొంత ఇల్లు కొనుగోలు చేసుకోవాలని పొదుపును పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉండేవారైతే నెలనెలా అద్దె కట్టే బదులు ఆ సొమ్మును నెలవారీ ఈఎంఐ రూపంలో కట్టుకుని సొంతింటి కలను నెరవేర్చుకోవాలని కోరుకుంటూ ఉంటారు. అందువల్ల భారతదేశంలో హోమ్‌లోన్లపై డిమాండ్ పెరిగింది. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా అన్ని బ్యాంకులు గృహ రుణాలను అందిస్తున్నారు. అయితే గత కొంతకాలంలో భారతదేశంలో ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యలు గృహ రుణాలపై వడ్డీ రేట్లను మరింత తక్కువ ధరకు చేర్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ వరుసగా ఐదు సార్లు రెపో రేటును 6.5 శాతం వద్ద మార్చకుండా ఎంసీఎల్‌ఆర్ రేట్లలో సవరణ చేశారు. అయితే ఏప్రిల్‌లో ఈ విరామానికి ముందు సెంట్రల్ బ్యాంక్ వరుసగా ఆరు రేట్ల పెంపులను అమలు చేసింది. అంతే దాదాపు 250 బేసిస్ పాయింట్లు. కాబట్టి ఆర్‌బీఐ ఎంసీఎల్‌ఎల్‌ఆర్ రేట్ల రివిజన్ తర్వాత అన్ని బ్యాంకులు గృహ రుణాలపై ఇచ్చే వడ్డీ రేట్లు అందుబాటులోకి వచ్చాయి. అందువల్ల ప్రస్తుతం గృహ రుణాలపై వడ్డీ రేట్లు బ్యాంకుల వారీగా ఓ సారి తెలుసుకుందాం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్ 2023లో ఎంపిక చేసిన కాలపరిమితిపై ఎంసీఎల్‌ఆర్‌ను 5 నుంచి 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ఎస్‌బీఐ వెబ్‌సైట్ ప్రకారం డిసెంబర్ 15 నుంచి ఒక సంవత్సరం కాలవ్యవధిపై ఎంసీఎల్‌ఆర్ 8.65%కి పెంచారు. దీనికి అనుగుణంగా ఒకటి నుంచి మూడు నెలల ఎంసీఎల్‌ఆర్ 8.20 శాతంగా ఉంది. ఆరు నెలలకు 8.55 శాతం, సంవత్సరానికి 8.65 శాతం, రెండు సంవత్సరాలకు 8.75 శాతం, మూడేళ్లకు 8.85 శాతం ఎంసీఎల్‌ఆర్ శాతంగా ఉంది.
జనవరి 8, 2024న హెచ్‌డీఎఫ్‌సీ తన ఎంసీఎల్‌ఆర్‌ను సవరించింది. ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్ 9.20 శాతానికి పెరిగింది. ఇంతలో ఓవర్‌నైట్ ఎంసీఎల్‌ఆర్ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.80 శాతానికి, మూడు నెలల ఎంసీఎల్‌ఆర్ 5 బేసిస్ పాయింట్లు పెరిగి 9 శాతానికి చేరాయి.
పీఎన్‌బీ జనవరి 1, 2024 నుంచి దాని ఎంసీఎల్‌ఆర్‌ను సవరించింది. ఓవర్ నైట్ ఎంసీఎల్‌ఆర్ 8.25 శాతంగా ఉంది. ఒక నెల ఎంసీఎల్‌ఆర్ 8.30 శాతం, మూడు నెలలైతే 8.40 శాతం, ఆరు నెలలు 8.60 శాతం, ఒక సంవత్సరం 8.70 శాతం, మూడు సంవత్సరాలైతే 9 శాతానికి ఎంసీఎల్‌ఆర్ రేటు చేరింది.
ఐడీఎఫ్‌సీ బ్యాంక్ తన ఎంసీఎల్‌ఆర్ రేటను జనవరి 8, 2024లో సవరించింది. ఈ బ్యాంకు ఒక నెలకు 9.50 శాతం, మూడు నెలలైతే 9.75 శాతం, ఆరు నెలలకు 10.10 శాతం, ఒక సంవత్సరానికి 10.25 శాతంగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..