Wheat: దేశంలో భారీగా పెరుగుతున్న గోధుమల ధరలు.. కారణం అదే..

|

May 05, 2022 | 4:13 PM

Wheat: కేంద్ర ప్రభుత్వం దేశంలో గోధుమల ఉత్పత్తి 5.7% తగ్గుతుందని అంచనా వేసింది. ఇంతకుముందు 2021-22 పంట సంవత్సరంలో ఉత్పత్తి 111.3 మిలియన్ టన్నులుగా ఉండవచ్చని అంచనా వేయబడింది.

Wheat: దేశంలో భారీగా పెరుగుతున్న గోధుమల ధరలు.. కారణం అదే..
Wheat
Follow us on

Wheat: కేంద్ర ప్రభుత్వం దేశంలో గోధుమల ఉత్పత్తి 5.7% తగ్గుతుందని అంచనా వేసింది. ఇంతకుముందు 2021-22 పంట సంవత్సరంలో ఉత్పత్తి 111.3 మిలియన్ టన్నులుగా ఉండవచ్చని అంచనా వేయబడింది. కానీ.. విపరీతంగా పెరిగిన ఎండ వేడి(Heat Waves) కారణంగా పంటపై ప్రభావం పడనుందని తెలిపింది. తాజా అంచనాల ప్రకారం దేశంలో గోధుమల ఉత్పత్తి(Production Fall) వలం 105 మిలియన్ టన్నులుగా ఉంటుందని లెక్కగట్టింది. కిందటి ఏడాది గోధుమల ఉత్పత్తి 109.5 మిలియన్ టన్నులుగా ఉంది. ప్రస్తుతం గోధుమ ఎగుమతులను నియంత్రించే పరిస్థితి లేదని కేంద్ర ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే వెల్లడించారు. వేసవి ముందుగానే ప్రారంభం కావటం వల్ల ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో పంట దిగుబడిపై ప్రభావం చూపిందని ఆయన తెలిపారు. ఎమ్ఎస్పీ కంటే కొన్ని రాష్ట్రాల్లో గోధుమల ధరలు ఎక్కువగా ఉండటం వల్ల రైతులు, వ్యాపారులు రేట్లు పెరుగుతాయని గోధుమలను స్టాక్ చేస్తున్నారని ఆయన అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో అంచనాల కంటే నిల్వలు ఎక్కువగా ఉండటం కూడా దిగుమతి తగ్గటానికి మరో కారణమని అన్నారు.

ఈ సీజన్‌లో 44.4 మిలియన్ టన్నుల కొనుగోలు లక్ష్యంగా ఉంది. దీనితో పాటు ప్రభుత్వ గోధుమ సేకరణ 2022-23లో 19.50 మిలియన్ టన్నుల వరకు ఉంటుంది. ఇది గత సంవత్సరం కంటే సగానికి పైగా తక్కువని తెలుస్తోంది. ఇప్పటి వరకు 1.75 కోట్ల టన్నుల వరకు కొనుగోలు చేశారు. ఈ సీజన్‌లో 44.4 మిలియన్ టన్నులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రజాపంపిణీ వ్యవస్థకు ఆహార ధాన్యాల డిమాండ్‌ను తీర్చడంలో కొరత ఉండదని తెలుస్తోంది.

రాష్ట్రాలకు గోధుమలకు బదులుగా 55 లక్షల టన్నుల అదనపు బియ్యం అందుతున్నాయి. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద పంపిణీ చేసే రేషన్ కోసం కేంద్రం రాష్ట్రాలకు గోధుమలకు బదులుగా 55 లక్షల టన్నుల అదనపు బియ్యాన్ని కేటాయించింది. కొరత కారణంగా ఈ కొనుగోళ్లు జరగలేదని, రాష్ట్రాల డిమాండ్‌లో భాగంగా ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీని పెంచే ప్రయత్నాల్లో భాగంగానే ఈ సేకరణ జరగలేదన్నారు. దీంతో రూ.4800 కోట్ల అదనపు సబ్సిడీ భారం కేంద్ర ప్రభుత్వంపై పడనుంది. ఈ పథకం కింద 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం వద్ద 35 మిలియన్ టన్నులకు పైగా స్టాక్ ఉంది. ఈజిప్ట్, టర్కీతో పాటు మరి కొన్ని యూరోపియన్ దేశాల మార్కెట్లు కూడా భారత్ నుంచి గోధుమలకు కొంటున్నాయి.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వ కొనుగోళ్ల అంచనా ఎందుకు తగ్గింది..

బహిరంగ మార్కెట్‌లో కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధరలు ఉండడంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో కాకుండా బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఏర్పడిన ఆహార సంక్షోభంతో గోధుమ డిమాండ్, ధరలు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు, వ్యాపారులు నిల్వ చేసుకుంటున్నారు. అకాల వేడి కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఉత్పత్తి దెబ్బతింది. దీంతో కొన్ని రాష్ట్రాల్లో దిగుబడిపై ప్రభావం పడింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Interest Rate Hike: బ్యాడ్ న్యూస్.. వడ్డీ రేట్లను పెంచిన ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా.. ఎంత మేర అంటే..

HUL News: సామాన్యులకు మరో షాక్.. మరోసారి సోపులు, షాంపుల రేట్లు 15 శాతం పెంచిన హిందుస్థాన్ సంస్థ..