Senior Citizen Investment Scheme: రిటైర్మెంట్‌ తర్వాత ఎలాంటి పథకాల్లో పెట్టుబడి పెట్టాలి..

|

Mar 30, 2022 | 6:15 AM

చాలా మంది రిటైర్మెంట్‌ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వారు అలా సమస్యలు ఎదుర్కొకుండా ఉండాలంటే ఉద్యోగం చేస్తున్నప్పుడే పలు పథకాల్లో పెట్టుబడి పెట్టాలి...

Senior Citizen Investment Scheme: రిటైర్మెంట్‌ తర్వాత ఎలాంటి పథకాల్లో పెట్టుబడి పెట్టాలి..
Investments
Follow us on

చాలా మంది రిటైర్మెంట్‌ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వారు అలా సమస్యలు ఎదుర్కొకుండా ఉండాలంటే ఉద్యోగం చేస్తున్నప్పుడే పలు పథకాల్లో పెట్టుబడి పెట్టాలి. సీనియర్ సిటిజన్ల కోసం ప్రభుత్వం కొన్ని ప్రత్యేక పథకాలను అందుబాటులోకి తెచ్చింది. మిగిలిన వారితో పోలిస్తే వారికి ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టినప్పుడు ఎక్కువ మెుత్తంలో రాబడి లభిస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పథకాలు పెద్ద ఎఫెక్టివ్‌గా ఉండవు. వడ్డీ రేట్లు తక్కువగా ఉండటమే ప్రధాన కారణం. రిటైర్మెంట్ అయిన వారికి వయో వందన ఒక పథకం ఉంది. ఇందు రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రభుత్వానికి చెందిన ఈ 10 సంవత్సరాల పెన్షన్ స్కీమ్‌ను LIC నిర్వహిస్తుంది. దీనికింద ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు 7.4 శాతం యాన్యువల్ వడ్డీ లభిస్తుంది.

రిటైర్మెంట్‌ అయిన వారు ఈ పథకంలో పెట్టుబడి పెడితే.. వారికి రాబోయే 10 సంవత్సరాల పాటు ఈ వడ్డీ రేట్ లభిస్తుంది. రెగ్యులర్ పెన్షన్ పొందాలంటే.. ఈ స్కీమ్‌లో ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ తరువాత ప్రతినెల, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ లేదా ఇయర్లీ పెన్షన్ పొందేందుతు ఈ స్కీమ్ లో ఎంచుకోవచ్చు. ప్రతినెలా పెన్షన్ తీసుకుంటే 9వేల250 రూపాయలు వస్తుంది. క్వార్టర్లీ పెన్షన్ తీసుకుంటే 27వేల750 రూపాయలు, హాఫ్ ఇయర్లీ బేస్ పెన్షన్ తీసుకుంటే 55 వేల500 రూపాయలు, ఇయర్లీ ఒకసారి పెన్షన్ తీసుకున్నట్లయితే 1 లక్ష 11 వేల రూపాయలు పొందుతారు. వయో వందన యోజనలో ఒక వ్యక్తి గరిష్ఠంగా 15 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం మార్చి 31, 2023 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

రిటైర్మెంట్ అయిన వారు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో15 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం వృద్ధులకు అత్యంత ప్రభావవంతమైన పథకంగా పరిగనిస్తున్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లకు 7.4 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ పొదుపు పథకం పదవీకాలం 5 సంవత్సరాలు, దీనిని మరో 3 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. యశ్వంత్ ఈ పథకంలో 15 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే.. ప్రతి క్వార్టర్ కు 27వేల750 రూపాయలు పొందుతారు. ఐదు సంవత్సరాల తర్వాత అతను అసలు మొత్తం తిరిగి పొందుతాడు. అటువంటి పరిస్థితిలో.. పెట్టుబడి పీరియడ్‌ను మరో మూడు సంవత్సరాలు పొడిగించడం ఉన్న మొదటి ఆప్షన్. లేదా.. వడ్డీ రేట్లు పెరిగినట్లయితే ఈ మొత్తాన్ని ఉపసంహరించుకుని మళ్లీ అదే స్కీమ్ లో తిరిగి పెట్టుబడిగా పెట్టవచ్చు.

Read Also..  Stock Market: వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 350, నిఫ్టీ 103 పాయింట్ల వృద్ధి..