HUF: హెచ్‌యూఎఫ్‌ అంటే ఏమిటి..? హిందూ అవిభాజ్య కుటుంబం ద్వారా టాక్స్ ఆదా చేసుకోవడం ఎలా?

|

Aug 02, 2023 | 2:48 PM

మీరు కష్టపడి సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగం పన్ను రూపంలో వెళ్లడాన్ని చూడటం కంటే అధ్వాన్నమైన పరిస్థితి మరోటి ఉండదు. సాధారణంగా టాక్స్ ఆదా చేసుకునేందుకు రకరకాల పద్ధతులను సంవత్సరం పొడవునా ప్రయత్నిస్తూనే ఉంటారు ప్రజలు. హైదరాబాద్ కు చెందిన రమేష్ కు టాక్స్ రూపేణా ఒకటిన్నర లక్షల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. వెంటనే అతను తన CAకి కాల్ చేసాడు. విషయం విన్న CA టాక్స్ ఆదా చేసుకునేందుకు ఒక మార్గం ఉందన్నాడు. హెచ్‌యూఎఫ్‌ ద్వారా..

HUF: హెచ్‌యూఎఫ్‌ అంటే ఏమిటి..? హిందూ అవిభాజ్య కుటుంబం ద్వారా టాక్స్ ఆదా చేసుకోవడం ఎలా?
Hindu Undivided Family
Follow us on

మీరు కష్టపడి సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగం పన్ను రూపంలో వెళ్లడాన్ని చూడటం కంటే అధ్వాన్నమైన పరిస్థితి మరోటి ఉండదు. సాధారణంగా టాక్స్ ఆదా చేసుకునేందుకు రకరకాల పద్ధతులను సంవత్సరం పొడవునా ప్రయత్నిస్తూనే ఉంటారు ప్రజలు. హైదరాబాద్ కు చెందిన రమేష్ కు టాక్స్ రూపేణా ఒకటిన్నర లక్షల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. వెంటనే అతను తన CAకి కాల్ చేసాడు. విషయం విన్న CA టాక్స్ ఆదా చేసుకునేందుకు ఒక మార్గం ఉందన్నాడు. హెచ్‌యూఎఫ్‌ ద్వారా టాక్స్ సేవ్ చేసుకోవచ్చని సీఏ అతనికి చెప్పాడు. 2022-23 సంవత్సరంలో 8 లక్షల 75 వేలకు పైగా హెచ్‌యూఎఫ్‌లు ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేశారని, అలాగే వారు 3,803 కోట్ల రూపాయల విలువైన డిస్కౌంట్స్ క్లెయిమ్ చేశారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది విన్న తరువాత మీరు అసలు ఈ హెచ్‌యూఎఫ్‌ అంటే ఏమిటి అని ఆలోచిస్తూ ఉండవచ్చు కదా. ఇది ఎలా పని చేస్తుంది? దాని నుంచి మనం మరింత టాక్స్ ఎలా ఆదా చేయవచ్చు? అనే డౌట్స్ కూడా వచ్చే ఉంటాయి.

హెచ్‌యూఎఫ్‌ అంటే ఏమిటి..?

హెచ్‌యూఎఫ్‌ (HUF) అంటే హిందూ అవిభక్త కుటుంబం అని అర్ధం. హెచ్‌యూఎఫ్‌ అనేది చట్టం ద్వారా ఏర్పాటు చేసినది. ఒక హిందూ వ్యక్తి వివాహం చేసుకున్నప్పుడు అతని కొత్త కుటుంబం హెచ్‌యూఎఫ్‌ అవుతుంది. అయినప్పటికీ కోపార్సెనర్‌లు అనే భావన ఉంటుంది. ఈ చట్టం ప్రకారం.. ఒకటి కంటే ఎక్కువ కోపార్సెనర్‌లు కుటుంబంలో ఉండాలి. అలాంటి సందర్భంలో దంపతులకు సంతానం ఉన్నప్పుడు, వారు హెచ్‌యూఎఫ్‌ ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తారు. హిందువులే కాకుండా, జైనులు, సిక్కులు – బౌద్ధులు కూడా హెచ్‌యూఎఫ్‌ ఏర్పాటు చేసుకోవచ్చు.

ఆదాయపు పన్ను చట్టంలో హెచ్‌యూఎఫ్‌ అనేది ఒక వ్యక్తి లా లేదా ఒక ప్రత్యేక సంస్థగా పరిగణిస్తారు. హెచ్‌యూఎఫ్‌లో ఒక వ్యక్తి – అతని తర్వాత తరం కొడుకు-కూతురు, మనవడు-మనవరాలు, మునిమనవడు-మనవరాలు వంటి వారు ఉంటారు. వీరే కాకుండా భార్య – కోడలు కూడా ఈ పరిధిలోకి వస్తారు. ఉదాహరణకు, రమేష్ తన కుటుంబాన్ని హెచ్‌యుఎఫ్‌గా చూపిస్తే, ఆ కుటుంబంలో అత్యంత సీనియర్ కోపార్సెనర్‌గా అతను మెయిన్ బాధ్యుడు అవుతాడు. అతని కొడుకు-కూతురు, మనవడు-మనవరాలు ఒకే కుటుంబంలో జన్మించారు అందువల్ల వారు సహచరులుగా ఉంటారు. మరో కుటుంబం నుంచి వచ్చిన అతని భార్య లేదా కోడలు హెచ్‌యూఎఫ్‌ సభ్యులుగా ఉంటారు.

ఇవి కూడా చదవండి

అన్ని కోపార్సెనర్‌లు హెచ్‌యూఎఫ్‌ సభ్యులు కావచ్చు. కానీ సభ్యులందరూ కోపార్సెనర్‌లు కాలేరు. సభ్యులకు హెచ్‌యూఎఫ్‌ ఆదాయం లేదా ఆస్తిని చూసుకునే హక్కు ఉంటుంది. కానీ ఆస్తి విభజన కోసం కోపార్సెనర్‌లు మాత్రమే క్లెయిమ్ చేయవచ్చు. అయితే, సభ్యులు ఆస్తి విభజనలో వాటా పొందవచ్చు.

హెచ్‌యూఎఫ్‌ దాని ఆస్తిని ఎక్కడ నుంచి పొందుతుంది? అనే విషయాన్ని CA వినోద్ రావల్ ఇలా వివరించారు. హెచ్‌యూఎఫ్‌ కలిగి ఉన్న ఆస్తి సాధారణంగా బహుమతి రూపంలో వస్తుంది. వీలునామా లేదా పూర్వీకుల ఆస్తులు… అది ఏదైనా కావచ్చు. ఇల్లు, దుకాణం, భూమి, డబ్బు లేదా కుటుంబ ఆస్తులను అమ్మడం ద్వారా కొనుగోలు చేసిన ఆస్తి ఇలా ఏదైనా కావచ్చు. హెచ్‌యూఎఫ్‌ లో ఎవరైనా వివాహం చేసుకున్నప్పుడు, అక్కడ ఇచ్చే బహుమతులు హెచ్‌యూఎఫ్‌ కోసం బహుమతులుగా ఉంటాయి. ఎందుకంటే ఆ బహుమతి వధువు లేదా వరుడికి చెందదు. కానీ వారి ఉమ్మడి కుటుంబానికి చెందినది అవుతుంది. అదేవిధంగా, తండ్రి వీలునామా లేదా వారసత్వంగా పొందిన ఆస్తి కూడా ఒక రకమైన బహుమతి. ముఖ్య బాధ్యుడితో పాటు ఏ సభ్యుడు అయినా హెచ్‌యూఎఫ్‌కి ఏదైనా బహుమతిగా ఇవ్వవచ్చు.

హెచ్‌యూఎఫ్‌ ఎంటిటీ ఉనికిని చూపించడానికి, కుటుంబ ముఖ్య బాధ్యుడు ఇతనిని బ్యాంకింగ్ పరిభాషలో కర్త అంటారు. ఇతను ఒక హెచ్‌యూఎఫ్‌ డీడ్ చేయాలి. హెచ్‌యూఎఫ్‌ కోసం ప్రత్యేక PAN అలాగే బ్యాంక్ ఎకౌంట్ కూడా ఉండాలి. మన ఉదాహరణలో రమేష్ తన వ్యక్తిగత పాన్‌తో పాటు హెచ్‌యూఎఫ్‌ కోసం ఒక పాన్ కార్డ్‌ను కలిగి ఉంటాడు.

ఇప్పుడు రమేష్ వ్యక్తిగత హెచ్‌యూఎఫ్‌ ఆదాయం రెండూ పన్ను మినహాయింపు పొందుతాయి. హెచ్‌యూఎఫ్‌పై వర్తించే పన్ను రేటు ఒక వ్యక్తికి వర్తించే విధంగానే విధించినా.. దాని కర్త – సభ్యులు తమ వ్యక్తిగత ఆదాయాలు – హెచ్‌యూఎఫ్‌ ఆదాయం రెండింటిపై 80C, 80D వంటి పన్ను ప్రయోజనాలను తీసుకోవచ్చు. ఈ రకమైన ఆదాయాలు రెండింటిపై ప్రాథమిక మినహాయింపు పరిమితి అందుబాటులో ఉంటుందని రావల్ చెప్పారు.

రమేష్ తన తండ్రి మరణానంతరం ఆస్తి పొందాడని అనుకుందాం. అతను ఈ ఆస్తిపై అద్దెకు సంపాదిస్తాడు. రమేష్ తన కుటుంబాన్ని హెచ్‌యూఎఫ్‌గా ఆస్తిలో వాటాదారుగా చేయవచ్చు. రమేష్‌కి తన స్వంత ఉద్యోగం కూడా ఉంది. అలాంటి సందర్భంలో అద్దె ద్వారా వచ్చే ఆదాయం అతని జీతంతో కలిపి.. అద్దె విషయంలో హెచ్‌యూఎఫ్‌గా రిటర్న్‌లు దాఖలు చేస్తే, వారు ప్రయోజనం పొందుతారు. ఇప్పుడు దాని లెక్కను అర్థం చేసుకుందాం.

రమేష్ చోప్రా ఆదాయం 20 లక్షల రూపాయలు. ఇంటి అద్దె ద్వారా 7 లక్షల 50 వేల రూపాయల కంటే ఎక్కువ వస్తుంది. ఇంటి మరమ్మత్తు- ఇతర ఖర్చులకు 30% స్టాండర్డ్ డిడక్షన్ లభిస్తుంది. ఇంటి ఆస్తి ద్వారా వచ్చే ఆదాయం 5 లక్షల 25 వేల రూపాయలు. మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం 25,25,000 రూపాయలు. 80C కింద లక్షన్నర రూపాయల తగ్గింపును క్లెయిమ్ చేసిన తర్వాత, నికర పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం అంటే పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం 23 లక్షల 75 వేల రూపాయలు. దానిపై అతను 5 లక్షల 53 వేల రూపాయలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

రమేష్ జీతం ఆదాయం- హెచ్‌యూఎఫ్‌ ఆదాయాన్ని విడివిడిగా చూపితే.. 20 లక్షల రూపాయల జీతంపై, 80C కింద మినహాయింపును క్లెయిమ్ చేసిన తర్వాత, పన్ను విధించదగిన ఆదాయం 18 లక్షల 50 వేల రూపాయలు అవుతుంది. అతను 3 లక్షల 91 వేల రూపాయల పన్ను చెల్లించవలసి ఉంటుంది. మరోవైపు, హెచ్‌యూఎఫ్‌ ఆదాయం 7 లక్షల 50 వేల రూపాయలపై స్టాండర్డ్ డిడక్షన్ పొందిన తర్వాత, మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం 5 లక్షల 25 వేల రూపాయలు. 80C కింద మినహాయింపు పొందిన తర్వాత 7,725 రూపాయల పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

రమేష్ అంతకుముందు 5.5 లక్షల రూపాయల కంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సి వచ్చింది. కానీ అతని ఆదాయం – హెచ్‌యూఎఫ్‌ ఆదాయాన్ని కలపడం ద్వారా, అంతిమంగా 3.99 లక్షల రూపాయల పన్ను చెల్లించాల్సి వస్తుంది. అంటే హెచ్‌యూఎఫ్‌ని సృష్టించడం ద్వారా అతను 1.5 లక్షల రూపాయల పన్నును ఆదా చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి