Stock Market: స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం లాభదాయకమేనా?

| Edited By: Anil kumar poka

Sep 16, 2022 | 3:27 PM

Stock Market: స్టాక్ మార్కెట్‌ లో మీరు భారీగా సంపాదించవచ్చు . అయితే ఇక్కడ కొన్ని అంశాలు గుర్తుంచుకోవాలి. స్టాక్ మార్కెట్ కు సాధారణ మార్కెట్ కు పెద్ద తేడా లేదు. వస్తువులు కొనడం, అమ్మడంలాగే..

Stock Market: స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం లాభదాయకమేనా?
Stock Market
Follow us on

Stock Market: స్టాక్ మార్కెట్‌ లో మీరు భారీగా సంపాదించవచ్చు . అయితే ఇక్కడ కొన్ని అంశాలు గుర్తుంచుకోవాలి. స్టాక్ మార్కెట్ కు సాధారణ మార్కెట్ కు పెద్ద తేడా లేదు. వస్తువులు కొనడం, అమ్మడంలాగే .. స్టాక్‌ మార్కెట్‌ లో షేర్లు కొనచ్చు. అమ్మచ్చు.

షేర్ మార్కెట్‌ అంటే ఏంటి ?

నిర్ణీత కాల వ్యవధిలో కొనుగోలుదారులు, అమ్మకం దార్లు పబ్లిక్ లిస్టెడ్ కంపెనీల షేర్‌ల ను అమ్మటానికి కొనడానికి షేర్‌ మార్కెట్‌ వేదిక.

ఇవి కూడా చదవండి

షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం ఎందుకు ముఖ్యం ?

షేర్ మార్కెట్‌లో పెట్టుబడితో చాలా లాభాలున్నాయి. ఇక్కడ పెట్టుబడి దారుడు భారీగా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది . కాలానుగుణంగా స్టాక్స్‌ ధరలు పెరుగుతూ.. తగ్గుతూ.. ఉంటాయి.స్వల్ప కాల వ్వవధిలో బ్యాంక్‌ ఫిక్స్‌ డ్ డిపాజిట్ల కంటే అధిక రిటర్న్స్‌ ఇచ్చే సామర్థ్యం ఉండటం షేర్ మార్కెట్ల ప్రయోజనాల్లో ఒకటి. దీర్ఘ కాలంలో ఏ ఇతర పెట్టుబడి సాధనాలతో పోల్చినా.. షేర్లు అధిక రిటర్న్స్‌ ఇస్తాయి.

షేర్లను ధన రూప ఆస్తిగా చెప్పచ్చు. షేర్లను సులభంగా నగదుగా మార్చుకోవచ్చు. అంతే కాక.. పెట్టుబడి దారుల ప్రయోజనాలు పరిరక్షించేందుకు, స్టాక్ మార్కెట్ నియంత్రణకు ఓ సంస్థ ఉంది.

పెట్టుబడి పెట్టడం ఎలా ప్రారంభించాలి?

షేర్ మార్కెట్ లో పెట్టుబడి కోసం డీ మ్యాట్ ట్రేడింగ్ అకౌంట్ తీసుకోవాలి. షేర్లు అమ్మడానికి, కొనడానికి ట్రేడింగ్ అకౌంట్ ఉపయోగిస్తారు. డీ మ్యాట్‌ అకౌంట్.. బ్యాంక్‌ అకౌంట్‌ లా పనిచేస్తుంది, ఈ అకౌంట్‌ లో మీ షేర్లను ఎలక్ట్రానిక్ రూపంలో నిక్షిప్తం చేస్తారు. మీరు షేర్లు కొన్నప్పుడు, అమ్మినపుడు మీ అకౌంట్లో క్రెడిట్‌, డెబిట్‌ అవుతాయి.

ఏ స్టాక్ కొనాలి? ఏ స్టాక్ అమ్మాలి అనేది మీరు ఎంచుకోవచ్చు. షేర్లు కొనేందుకు మీ అకౌంట్లో సరిపడా నగదు ఉండేలా చూసుకోవాలి. ఏ ధరకు షేర్లు కొనాలి? లేదా అమ్మాలి ? అనేది మీరు నిర్ణయించుకోవాలి.

పెట్టుబడికి ఎలాంటి వ్యూహం అనుసరించాలి ?

షేర్ మార్కెట్‌లో పెట్టుబడితో తక్కువ కాలంలో కోటీశ్వరులై పోతామనే భ్రమను తొలగించుకోవాలి. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే ముందు , మీరు నిర్దేశించుకున్న కార్పస్‌ ఫండ్ జమ అయ్యేదాకా ఆగాలి. స్టాక్స్‌ కొన్న తర్వాత కొంత కాలం మార్కెట్ లో కొనసాగాలి. ఇల్లు కొన్న వెంటనే ఆ ఇంటి రేట్లు ఎంత పెరిగాయి? తగ్గాయని అడిగినట్లు మీ స్టాక్స్‌ గురించి బ్రోకర్‌ ని అడగకండి. మీ పోర్ట్‌ ఫోలియోలో స్ఠాక్స్‌ పెరగడం తగ్గడం చూసి నిరుత్సాహపడకుండా సంయమనం పాటించండి.

మార్కెట్లో పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోండి. https://bit.ly/3RreGqO అటువంటి ప్లాట్‌ఫారమ్‌లో ఒకటి. దీని ద్వారా మీరు స్టాక్ మార్కెట్‌లలో మీ ప్రయాణాన్ని స్థిరమైన అడుగులతో ప్రారంభించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..