Salary Overdraft: శాలరీ ఓవ‌ర్‌డ్రాఫ్ట్‌ అంటే ఏమిటో తెలుసా.. ఇది ఎప్పుడు తీసుకోవాలంటే..

|

Jan 23, 2022 | 3:42 PM

శాలరీ ఓవ‌ర్‌డ్రాఫ్ట్‌ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ అత్యవసర సమయాల్లో ఇది ఉపయోగపడుతుంది...

Salary Overdraft: శాలరీ ఓవ‌ర్‌డ్రాఫ్ట్‌ అంటే ఏమిటో తెలుసా.. ఇది ఎప్పుడు తీసుకోవాలంటే..
Money
Follow us on

శాలరీ ఓవ‌ర్‌డ్రాఫ్ట్‌ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ అత్యవసర సమయాల్లో ఇది ఉపయోగపడుతుంది. మీరు జీతం ద్వారా ఆదాయం పొందే వ్యక్తులైతే.. మీ శాలరీ ఖాతా ఉన్న బ్యాంకు నుంచి ఈ సదుపాయం పొందచ్చు. అయితే, శాలరీ అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ సదుపాయం ఉండదు. అర్హత ఉన్న వారికి మాత్రమే అవకాశం ఉంటుంది.

ఖాతాదారులు తమ ఖాతాలో ఉండే మొత్తం కంటే ఎక్కువ మొత్తాన్ని ఉపసంహరించుకోవడాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. ఓవర్ డ్రాఫ్ట్ లో మీరు ఖాతా నుంచి విత్ డ్రా చేసే వరకు వడ్డీ వసూలు చేయరు. మీరు తీసుకున్న అధిక మొత్తంపై మాత్రమే వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. సాధారణంగా పొదుపు, కరెంట్ ఖాతాలపై ఈ సదుపాయం ఉంటుంది.

మీ జీతం ఖాతాలో పొందగలిగే రివాల్వింగ్ క్రెడిట్ శాలరీ ఓవర్ డ్రాఫ్ట్. మీకు డబ్బు అవసరమైనప్పుడు ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌కు మించి నిర్దిష్ట మొత్తాన్ని తీసుకోవచ్చు. దీనిపై తిరిగి చెల్లించేంత వరకు వడ్డీ పడుతుంది. ఏక మొత్తంగా గానీ, వాయిదాలలో కాని అదనంగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించవచ్చు.

బ్యాంకులు తమ పాలసీని అనుసరించి ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని కల్పిస్తాయి. ఇది వేరు వేరు బ్యాంకులకు వేరు వేరుగా ఉంటుంది. వ్యక్తి క్రెడిట్ ప్రొఫైల్, క్రెడిట్ స్కోరు ఆధారంగా ఆ వ్యక్తి ఓవర్ డ్రాఫ్ట్ పరిమితిని నిర్ణయిస్తారు. బ్యాంకు, ఖాతాను బట్టి ఒక్కోసారి శాలరీ కంటే మూడింతలు అధికంగా లిమిట్ ఉంటుంది.

Read Also… ICICI Bank Interest Rates of FD: ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను పెంచిందన ఐసీఐసీఐ.. తాజా వడ్డీ రేట్లు ఇవే..