
ప్రకృతి వైపరీత్యాలు ప్రజలను భయకంపితులను చేస్తాయి. తుఫాన్లు, భూకంపాలు, సునామీలు విరుచుకుపడితే ఏమి మిగిలదు. ముందుగా గుర్తిస్తే మనిషి ప్రాణాలు మాత్రం దక్కించుకోగలుగుతాడు. ఇల్లు, ఆస్తులు, సంపద, కార్లు అన్ని తుడిచిపెట్టుకుపోతాయి. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో తుఫానులు ఎక్కువగా పరిచయమే గానీ, భూకంపాలు చాలా అరుదు. ఎప్పుడైన భూమి కంపించి సందర్భాలున్నాయి గానీ పెద్ద ఎత్తున భూకంపం సంభవించలేదు. కానీ కొన్ని ప్రాంతాల్లో తరచూ భూకంపం సంభవిస్తుంది. ముఖ్యంగా జపాన్ వంటి దేశాల్లో ఇది చాలా సర్వసాధారణం. అందుకే అక్కడి ప్రజలు వారి ఇల్లు, ఇతర కట్టడాలను కాంక్రీట్ తో నిర్మించరు. చెక్కతోనే కడతారు. అయితే ఇలా భూ కంపం కారణంగా కలిగే నష్టాన్ని కూడా తిరిగి పొందుకొనే వెసులు బాటు ఉంది. అదే భూకంప బీమా(ఎర్త్ క్వేక్ ఇన్సురెన్స్) . ఇది భూకంపం సమయంలో కలిగే నష్టాన్నిపూడ్చేందుకు సాయపడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
అక్టోబర్ 3న నేపాల్లోని రెండు ప్రాంతాల్లో భూ కంపాలు సంభవించాయి. రెక్టర్ స్కేల్ పై మొదటి భూకంప తీవ్రత 4.6గా నమోదవగా.. రెండో సారి వచ్చిన భూకంప తీవ్రత 6.2గా ఉంది. దీని ప్రభావం మొత్తం నార్త్ పైనా కనిపించింది. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హరియాణా వంటి రాష్ట్రాల్లో కూడా స్పల్పంగా భూమి కనిపించింది.
సాధారణంగా భూకంపం వచ్చినప్పుడు నష్ట తీవ్రత అధికంగా ఉంటుంది. కట్టడాలన్నీ కూలిపోతాయి, దానిలో సామగ్రి కూడా నాశనం అయిపోతుంది కాబట్టి ఎక్కువగా భూకంపాలు చూసే ప్రాంతాలు ఈ భూకంప బీమాను తీసుకోవడం ఉత్తమం. అయితే ఈ బీమాను తీసుకొనే ముందు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అవేంటంటే..
హోమ్ ఇన్సురెన్స్ ఉందా.. మీరు మొదటిగా మీ ఇంటికి హోమ్ ఇన్సురెన్స్ ఉందేమో చూసుకోవాలి. చాలా హోమ్ ఇన్సురెన్స్ పాలసీల్లో భూ కంపాలు, సైక్లోన్లు, తుపానులను కవర్ చేస్తాయి. మీ పాలసీ ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలను కవర్ చేస్తుందో ముందు తెలుసుకోవాలి.
స్ట్రక్చర్ కవర్.. ఇన్సురెన్స్ పాలసీలో మీ ఇంటి స్ట్రక్చర్ డ్యామేజ్ కి కవర్ ఉందో లేదో చూసుకోవాలి. అది మనిషి కల్పించిన ప్రమాదవల్లనైనా లేదా ప్రకృతి వల్ల సంభవించినది అయినా కావొచ్చు. మీరు ఒకవేళ హౌసింగ్ సొసైటీలో నివసిస్తూ ఉంటే కనుక ఆ సొసైటీకి స్ట్రక్చర్ కవర్ ఉందేమో కనుక్కొవాలి. అలాగే ఇండిపెండెంట్ హౌస్, బంగ్లా, స్టాండ్ అలోన్ బిల్డింగ్, విల్లా వంటి వాటికి తప్పనిసరిగా స్ట్రక్చర్ కవర్ కొనాల్సిందే.
పాలసీలో ఏమి ఉంది.. మీరు తీసుకున్న హోమ్ ఇన్సురెన్స్ లో ఏమి కవర్ అవుతుంది.. ఏమి కవర్ కావడం లేదనేది తప్పనిసరిగా తెలుసుకోవాలి. సాధారణంగా హోమ్ ఇన్సురెన్స లలో అగ్ని ప్రమాదాలకు కవరేజ్ ఉంటుంది. అయితే భూకంపాలకు కవర్ ఉందో లేదో చూసుకోవాలి.
మీ ఇంటి భద్రతను పరిగణనలోకి తీసుకోండి.. మీరు హోమ్ ఇన్సురెన్స్ తీసుకునే ముందు మీ ఇంటికి ఎటువంటి రక్షణ అవసరమే గుర్తించాలి. మీరు ఉండో ప్రాంతం.. ఆ ప్రాంతంలో అధిక సంభవించే ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలను గుర్తించాలి. ఉదాహరణకు మన దేశంలోని ఉత్తరంలో జమ్మూ అండ్ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తారాఖండ్, నార్త్ బిహారం ప్రాంతాల్లో ఎక్కువగా భూకంపాలు సంభవిస్తాయి. ఆయా చోట్ల తప్పనిసరిగా కవర్ ఉండేటట్లు చూసుకోవాలి.
ఎక్కువ కాల వ్యవధితో తీసుకోవాలి.. మీరు పాలసీ తీసుకునే ముందు దాని కాల పరిమితిని అడగాలి. అధిక కాలపరిమితితో పాలసీ తీసుకుంటే పాలసీ ధర కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు పదేళ్లకు పాలసీ తీసుకుంటే పాలసీ అందించే కంపెనీలు కూడా పలు డిస్కౌంట్లు అందిస్తారు. మొత్తం పాలసీ కాస్ట్ కూడా తగ్గుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..