ఒక వ్యక్తి భారతదేశంలో రెండు రకాల బ్యాంకు ఖాతాలను తెరవవచ్చు. ఒకటి జీతం ఖాతా, మరొకటి పొదుపు ఖాతా. జీతం ఖాతా పొదుపు ఖాతా అనేవి వేర్వేరు ప్రయోజనాలను అందించే రెండు రకాల బ్యాంకు ఖాతాలు. మీరు సంఘటిత రంగంలో పనిచేస్తున్నట్లయితే మాత్రమే జీతం ఖాతా తెరవబడుతుంది. అలాగే ఈ ఖాతాలో ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ ఖాతా మీకు జీరో బ్యాలెన్స్ సౌకర్యాన్ని అందిస్తోంది. అంటే మీ ఖాతాలో డబ్బు లేకపోయినా ఎలాంటి జరిమానా విధించబడదు. ఖాతాదారులు పొదుపు ఖాతాలో కనీస నిల్వను నిర్వహించాలి. మినిమమ్ బ్యాలెన్స్ చెల్లించకపోతే, జరిమానా విధించబడుతుంది. కంపెనీలు తమ ఉద్యోగుల కోసం జీతం ఖాతాలను తెరవడానికి బ్యాంకులతో భాగస్వామ్యం కలిగి ఉంటాయి. మీరు శాలరీ అకౌంట్ ఉంటే.. దాని ద్వారా అనేక ప్రయోజనాలను పొందుతారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
బ్యాంకులు జీతం ఖాతాలు కలిగిన వినియోగదారులకు ఉచిత ATM లావాదేవీ సౌకర్యాన్ని అందిస్తాయి. ఈ సదుపాయం కింద మీరు నెలలో ఏటీఎంను ఎన్నిసార్లు ఉపయోగించవచ్చో లెక్కించాల్సిన అవసరం లేదు. జీతం తీసుకునే ఖాతాదారులకు బ్యాంకులు ATM వినియోగంపై వార్షిక ఛార్జీలను మాఫీ చేశాయి.
శాలరీ అకౌంట్‌పై వ్యక్తిగత రుణం కోసం లోన్ సదుపాయం కూడా ప్రత్యేక ఆఫర్‌ను పొందుతారు.. మీరు మీ జీతం ఖాతాలో ప్రీ-అప్రూవ్డ్ లోన్ సౌకర్యం కూడా పొందుతారు. గృహ, కారు రుణాలపై కూడా ప్రత్యేక ఆఫర్లు ఉంటాయి.
ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఈ సౌకర్యం కూడా కొన్ని షరతులకు లోబడి ఉంటుంది. కనీసం రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వ్యవధిని కలిగి ఉంటుంది. ఈ సదుపాయం మీ ఖాతాలో బ్యాలెన్స్ లేనప్పటికీ కొంత పరిమితి వరకు డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.
చాలా బ్యాంకులు జీతం ఖాతాదారులకు ఉచిత పాస్ బుక్, చెక్ బుక్, ఇ-స్టేట్మెంట్ సౌకర్యాలను అందిస్తాయి. ఖాతాదారులకు వారి లావాదేవీలు, ఖాతా బ్యాలెన్స్‌ను ట్రాక్ చేయడంలో ఇది సహాయపడుతుంది. దీని కోసం అదనపు ఖర్చు అవసరం లేదు.
రూ.20 లక్షల వరకు జీతం ఖాతాదారులకు ఉచిత బీమా సౌకర్యం. అప్పటి వరకు వ్యక్తిగత ప్రమాద బీమాకు కూడా అర్హత సాధించారు.
కొన్ని బ్యాంకులు శాలరీ అకౌంట్ ఉన్న తమ వినియోగదారులకు ఉచిత ఆన్‌లైన్ లావాదేవీ సౌకర్యాన్ని అందిస్తాయి. అంటే NEFT, RTGS సేవలు ఉచితం. చాలా బ్యాంకులు తక్షణ చెల్లింపు సేవలను (IMPS) కూడా అందిస్తాయి.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం..