క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్.. ఈ పదం చాలా మంది వినే ఉంటారు. ముఖ్యంగా బ్యాంకుల్లో ఏదైనా లోన్ల కోసం దరఖాస్తు చేసుకునే సందర్భంలో తప్పనిసరిగా ఈ క్రెడిట్ స్కోర్ గురించి బ్యాంకర్లు అడుగుతారు. ఇది తగిన విధంగా ఉంటేనే సులభంగా లోన్లు మంజూరవుతాయి. తక్కువ వడ్డీ కి లోన్లు వస్తాయి. అందుకే వ్యక్తులు ఈ సిబిల్ స్కోర్ ను సక్రమంగా మెయింటేన్ చేయాలి. ఏమాత్రం అటుఇటు అయినా ఆ స్కోర్ అమాంతం పడిపోతుంది. చాలా మంది సిబిల్ స్కోర్ బాగుండాలంటే తీసుకున్న లోన్ కి సంబంధించి ఈఎంఐ సక్రమంగా కడిటే సరిపోతుందని భావిస్తారు. కానీ అదొక్కటే కాదు.. ఇంకా చాలా అంశాలు సిబిల్ స్కోర్ ని ప్రభావితం చేస్తాయి. అయితే ఈఎంఐ బిల్లులు ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. వరుసగా రెండు ఈఎంఐలు చెల్లించకపోతే ఈ సిబిల్ స్కోర్ పై రెడ్ మార్క్ పడినట్లే లెక్క. ఈ నేపథ్యంలో క్రెడిట్ సక్రమంగా ఉండాలంటే ఏం చేయాలి? దానిని ప్రభావితం చేసే అంశాలేంటి? తెలుసుకుందాం రండి..
సిబిల్ స్కోర్ మీ ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబిస్తుంది. మీకున్న లోన్లు.. వాటి ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు, వాటి చెల్లింపులు, మీ రాబడి మీ ఖాతాలో ఉంటున్న బ్యాలెన్స్ వంటివన్నీ బేరీజు వేసుకుని స్కోర్ ఇస్తారు. కొన్ని ఏజెన్సీలు ఈ సిబిల్ స్కోర్ ను అందిస్తాయి. సాధారణంగా ఈ స్కోర్ 650 నుంచి 900 మధ్య ఉంటుంది. 750కి పైగా ఉంటే మంచి సిబిల్ స్కోర్ కింద లెక్కిస్తారు. అప్పుడు సులభంగా లోన్లు రావడంతో పాటు తక్కువ వడ్డీకి లోన్లు మంజూరవుతాయి. ప్రధానంగా హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు వంటివి దీని ఆధారంగానే మంజూరు చేస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..