SBI: ఎస్బీఐ ఈ పథకాన్ని పొడిగించింది.. ఎవరు అర్హులు.. ఎవరు అనర్హులో తెలుసుకోండి..

|

Oct 02, 2021 | 3:23 PM

SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సీనియర్ సిటిజన్స్ కోసం 'వి కేర్ సీనియర్ సిటిజన్' (We Care Senior Citizen) టర్మ్ డిపాజిట్ స్కీమ్‌ని ప్రారంభించిన సంగతి

SBI: ఎస్బీఐ ఈ పథకాన్ని పొడిగించింది.. ఎవరు అర్హులు.. ఎవరు అనర్హులో తెలుసుకోండి..
Term Deposit
Follow us on

SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సీనియర్ సిటిజన్స్ కోసం ‘వి కేర్ సీనియర్ సిటిజన్’ (We Care Senior Citizen) టర్మ్ డిపాజిట్ స్కీమ్‌ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే బ్యాంకు ఈ పథకాన్ని మార్చి 31, 2022 వరకు పొడిగించింది. ఈ స్కీం మొదటిసారిగా మే 2020లో ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ పథకాన్ని పలుమార్లు పొడిగించారు. కొవిడ్ సమయంలో సీనియర్‌ సిటిజన్లు ప్రయోజనం పొందడానికి ఎస్బీఐ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. సీనియర్ సిటిజన్లు మాత్రమే వి కేర్‌ టర్మ్ డిపాజిట్ పథకాన్ని తీసుకోవచ్చు. సాధారణ ఖాతాదారులు ఈ పథకం ప్రయోజనాన్ని పొందలేరు. దీని ద్వారా సీనియర్‌ సిటిజన్లు అధిక వడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు.

1 ‘వి కేర్ సీనియర్ సిటిజన్’ 
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్స్ కోసం మే 2020లో SBI We Care డిపాజిట్ టర్మ్ ప్లాన్‌ను ప్రారంభించింది. దీని కింద ఒక టర్మ్ డిపాజిట్ 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలానికి ఇస్తారు. ఇందులో వడ్డీ రేటు సాధారణం కంటే 0.30 శాతం ఎక్కువగా చెల్లిస్తారు. ఈ పథకం మే నుంచి సెప్టెంబర్ 2020 వరకు పొడిగించారు. తరువాత డిసెంబర్ 2020 వరకు పొడిగించారు. తరువాత మార్చి 2021కి పెంచారు. తర్వాత సెప్టెంబర్ 30, 2021కి పెంచారు. ఇప్పుడు 2022 వరకు మార్చి వరకు పొడగించారు.

2 పథకాన్ని ఎవరు తీసుకోవచ్చు
ఈ పథకం కేవలం సీనియర్ సిటిజన్లకు మాత్రమే. సాధారణ ఖాతాదారులు దీని పరిధిలోకి రారు. సీనియర్ సిటిజన్లకు టర్మ్ డిపాజిట్లపై అదనపు వడ్డీ ప్రయోజనం లభిస్తుంది. తద్వారా వారి ఆదాయాలు స్థిరంగా ఉంటాయి రోజువారీ ఖర్చులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

3. పథకంపై ఎంత వడ్డీ లభిస్తుంది
SBI ఈ ప్రత్యేక FD పథకంపై 6.5%వడ్డీని చెల్లిస్తోంది. సాధారణ ప్రజల విషయంలో FD పై వడ్డీ రేటు 5.4%గా నిర్ణయించారు. సీనియర్ సిటిజన్లు సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లను కొనుగోలు చేస్తే, వారికి 6.20 శాతం వడ్డీ లభిస్తుంది. వి కేర్ సీనియర్ సిటిజన్ టర్మ్ డిపాజిట్ పథకం కింద, 6.5% వడ్డీ లభిస్తుంది.

4. పథకం వ్యవధి ఎన్ని రోజులు
ఈ పథకాన్ని కనీసం 5 సంవత్సరాలు, గరిష్టంగా 10 సంవత్సరాలు తీసుకోవచ్చు. ఈ పథకం దేశీయ టర్మ్ డిపాజిట్ కింద వస్తుంది. ఈ పథకంపై రుణ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం కింద టీడీఎస్‌ని తీసివేయడానికి నిబంధన ఉంది. ఈ పథకాన్ని SBI బ్రాంచ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో నుంచి తీసుకోవచ్చు.

IDBI Bank AM Result 2021: అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

Coronavirus: డెత్ సర్టిఫికెట్‌లో “కోవిడ్ సస్పెక్ట్”.. సాయం అందక చిన్నబోతున్న బాధిత కుటుంబాలు

Maa Elections 2021: హోరాహోరీగా ఎన్నికలప్రచారాలు.. సీన్లోకి హీరోయిన్ పూనమ్ కౌర్.. అన్నీ విషయాలు బయటపెడతానంటూ..