AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warren Buffett: సహనం కీలకం.. సంపద సృష్టికి బఫెట్ చెప్పిన సింపుల్ సీక్రెట్స్..!

ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్ విజయానికి కారణమైన పెట్టుబడి సూత్రాలు నేటికీ లక్షలాది ఇన్వెస్టర్లకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు, సహనం, దురాశ లేకపోవడం, సొంత అవగాహనతో నిర్ణయాలు తీసుకోవడం స్టాక్ మార్కెట్‌లో అదృష్టం పరీక్షించుకోవాలని ఉవ్విళ్లూరేవారికి తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణాలు. వారెన్ బఫెట్ చెప్పిన ఈ 8 కీలక నియమాల గురించి తెలుసుకోండి.

Warren Buffett: సహనం కీలకం.. సంపద సృష్టికి బఫెట్ చెప్పిన సింపుల్ సీక్రెట్స్..!
Warren Buffett Investment Tips
Janardhan Veluru
|

Updated on: Jul 17, 2026 | 1:11 PM

Share

ప్రపంచంలో అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారుల్లో ఒకరు వారెన్ బఫెట్. ఆయన పెట్టుబడి ప్రపంచంలో ఒక దిగ్గజంగా గుర్తింపు పొందారు. దశాబ్దాలుగా ఆయన క్రమశిక్షణ, సహనం, దీర్ఘకాలిక దృష్టి వల్లే అపార సంపదను సృష్టించగలిగారు. సంపద సృష్టి కోసం వారెన్ బఫెట్ చెప్పే పెట్టుబడి సూత్రాలు కొత్త ఇన్వెస్టర్లకే కాదు.. అనుభవం ఉన్నవారికీ ఆచరణీయమే. సంపదను సృష్టించేందుకు స్టాక్ మార్కెట్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఉవ్విళ్లూరేవారి కోసం పలు సందర్భాల్లో బఫెట్ చేసిన కీలక సూచనలు ఇవిగో..

1. అర్థమైన వ్యాపారాల్లోనే పెట్టుబడి పెట్టండి

మీకు పూర్తిగా అర్థం కాని కంపెనీలు లేదా రంగాల్లో పెట్టుబడి పెట్టకండి. ఒక కంపెనీ ఎలా ఆదాయం సంపాదిస్తోంది? భవిష్యత్తులో దాని వృద్ధి ఎలా ఉంటుంది? అర్థం చేసుకుని దానిపై స్పష్టత ఉండాలి. తెలియని విషయాల గురించి అర్థం చేసుకోవాలి. స్వీయ అవగాహన, వాస్తవికతతో అర్థం చేసుకున్న తర్వాతే ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టాలని బఫెట్ సూచిస్తారు.

2. దురాశ వద్దు.. దీర్ఘకాలిక దృష్టి ముద్దు

షేర్ మార్కెట్‌లో ప్రతిరోజూ జరిగే హెచ్చుతగ్గులను చూసి భయపడకండి. మంచి కంపెనీల్లో పెట్టుబడి పెట్టి వాటిని సంవత్సరాల పాటు కొనసాగించడం ద్వారానే సంపద పెరుగుతుందని బఫెట్ నమ్మకం. స్వల్పకాలంలో లాభాలను ఆర్జించాలన్న అత్యాశతో కాకుండా దీర్ఘకాలిక దృష్టితోనే పెట్టుబడి పెట్టాలి.

3. సహనం విజయానికి కీలకం

తొందరపడి కొనడం, అమ్మడం కంటే సరైన అవకాశాల కోసం వేచి ఉండడం మంచిదని ఆయన చెబుతారు. మార్కెట్‌లో సహనం పాటించే వారే దీర్ఘకాలంలో మంచి లాభాలు పొందే అవకాశం ఎక్కువ.

4. సొంత ఆలోచన ఉండాలి

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేవారిలో క్రమశిక్షణ అత్యంత అవసరం. సమాజంలో ప్రబలంగా వినిపించే అభిప్రాయాల ట్రాప్‌లో పడకుండా..మనకంటూ సొంత ఆలోచన ఉండాలి. స్టాక్స్‌ను ఒక వ్యాపారంగా భావించి.. ఏది రాణిస్తుందో గుర్తించాలి. ఊహించని నష్టాల నుంచి బయటపడేలా బఫరింగ్ ఉండాలి.

5. మూలధనాన్ని కాపాడుకోవడం మొదటి లక్ష్యం

వారెన్ బఫెట్ ప్రసిద్ధ సూత్రం – 1. ఎప్పుడూ మూలధనాన్ని కోల్పోవద్దు. ఈ మొదటి నియమాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. అంటే భారీ లాభాల కోసం అనవసరమైన రిస్క్ తీసుకోవడం కంటే మూలధనాన్ని రక్షించుకోవడమే చాలా ముఖ్యం.

6. మార్కెట్ భావోద్వేగాలకు లోనవ్వొద్దు

మార్కెట్ ఒక్కసారిగా పెరిగినా, పడిపోయినా భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోవద్దు. భయం, అత్యాశ రెండూ పెట్టుబడిదారులకు నష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది. క్రమశిక్షణతో తీసుకునే నిర్ణయాలే మంచి ఫలితాలు ఇస్తాయి.

7. తక్కువ ఖర్చుతో పెట్టుబడులు పెట్టండి

అధిక ఫీజులు ఉన్న పెట్టుబడి సాధనాల కంటే తక్కువ ఖర్చుతో కూడిన పెట్టుబడి మార్గాలను ఎంచుకోవాలని బఫెట్ పలుమార్లు సూచించారు. దీర్ఘకాలంలో ఇది పెట్టుబడి రాబడిపై సానుకూల ప్రభావం చూపుతుంది.

8. ముందుగా మీలోనే పెట్టుబడి పెట్టండి

ఆర్థిక విజయం కోసం జ్ఞానం అత్యంత విలువైన పెట్టుబడి. పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, ఆర్థిక అవగాహన పెంచుకోవడం ద్వారా మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది.

స్టాక్ మార్కెట్‌లో విజయానికి షార్ట్‌కట్‌లు ఉండవు. సరైన కంపెనీలను ఎంచుకోవడం, సహనం పాటించడం, దీర్ఘకాలికంగా పెట్టుబడిని కొనసాగించడం, భావోద్వేగాలకు లోనుకాకపోవడం వంటి సూత్రాలే వారెన్ బఫెట్ విజయానికి కారణం. ఈ నియమాలను క్రమంగా పాటిస్తే, దీర్ఘకాలంలో మంచి సంపదను నిర్మించుకునే అవకాశం ఉంటుంది.

Follow Us
భారీగా పెరగనున్న నిత్యావసర వస్తువుల ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
భారీగా పెరగనున్న నిత్యావసర వస్తువుల ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
22 ఏళ్ల వయస్సులోనే సివిల్స్ కొట్టిన తెలుగమ్మాయి.. టాప్ ర్యాంక్..
22 ఏళ్ల వయస్సులోనే సివిల్స్ కొట్టిన తెలుగమ్మాయి.. టాప్ ర్యాంక్..
బోనమెత్తిన సీరియల్ హీరోయిన్ ప్రియాంక.. ఫొటోస్ ఇదిగో
బోనమెత్తిన సీరియల్ హీరోయిన్ ప్రియాంక.. ఫొటోస్ ఇదిగో
ఈ కొండపై ఉన్న గొర్రెను 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపులు!
ఈ కొండపై ఉన్న గొర్రెను 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపులు!
సీఎస్కే హెడ్ కోచ్ రేసులో వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్..?
సీఎస్కే హెడ్ కోచ్ రేసులో వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్..?
బిల్ గేట్స్ కూతురుకు 20 ఏళ్ల జైలు శిక్ష..? అసలేంటీ కుకీ స్టఫింగ్
బిల్ గేట్స్ కూతురుకు 20 ఏళ్ల జైలు శిక్ష..? అసలేంటీ కుకీ స్టఫింగ్
ముగ్గురు ఆడబిడ్డల తర్వాత మగ సంతానం.. అయినా ఆస్పత్రిలోనే ఆమె ఈ పని
ముగ్గురు ఆడబిడ్డల తర్వాత మగ సంతానం.. అయినా ఆస్పత్రిలోనే ఆమె ఈ పని
IND vs SL: టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన శ్రీలంక కెప్టెన్..!
IND vs SL: టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన శ్రీలంక కెప్టెన్..!
రాజధాని అమరావతిలో కీలక ఘట్టం ఆవిష్కృతం
రాజధాని అమరావతిలో కీలక ఘట్టం ఆవిష్కృతం
డ్రైవింగ్ ప్రాక్టీస్ చేద్దామని కారును బయటకు తీసిన మహిళ.. ఇంతలోనే
డ్రైవింగ్ ప్రాక్టీస్ చేద్దామని కారును బయటకు తీసిన మహిళ.. ఇంతలోనే