
ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ పెట్టుబడిదారులలో ఒకరైన వారెన్ బఫెట్ సోమవారం తన చివరి CEO లేఖలో కంపెనీ నుండి వైదొలగుతున్నట్లు తెలిపారు. దాదాపు 60 సంవత్సరాలు బెర్క్‌షైర్ హాత్వేను నడిపించిన తర్వాత 94 ఏళ్ల బఫెట్ ఈ సంవత్సరం చివరిలో పదవీ విరమణ చేయనున్నారు. అయితే ప్రతి సంవత్సరం తన పిల్లలు, వాటాదారులకు కృతజ్ఞతా పత్రాలను పంపుతూనే ఉంటానని ఆయన అన్నారు. వారెన్ బఫెట్ తన నాయకత్వ పాత్ర నుండి వైదొలిగినప్పటికీ, ఆయన పెట్టుబడి వ్యూహాలు, పెట్టుబడిదారులకు రాసిన లేఖలు ఎంతో ప్రముఖ్యతను కలిగి ఉన్నాయి. ఈ సందర్భంలో వారెన్ బఫెట్ మాట్లాడుతూ.. పెట్టుబడిలో గెలవడానికి తాను ఎల్లప్పుడూ ఈ 20 పంచ్ నియమాలను పాటిస్తానని, పెట్టుబడిదారులు కూడా వాటిని ఉపయోగించాలని ఆయన సిఫార్సు చేశారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్‌కి కొత్తగా వస్తే వారెన్ బఫెట్ 20 పంచ్ కార్డ్ నియమాలు మీకు గొప్ప మార్గదర్శిగా ఉంటాయి. ఇంతకీ ఆ 20 నియమాలేంటో ఇప్పుడు చూద్దాం..
పెట్టుబడి పెట్టడం అంటే కేవలం డబ్బును పెట్టుబడి పెట్టడం మాత్రమే కాదు, సరైన అవకాశాలను జాగ్రత్తగా ఎంచుకోవడం కూడా అని వారెన్ బఫెట్ “20 పంచ్ కార్డ్ రూల్” వివరిస్తుంది. మీరు స్టాక్ మార్కెట్‌కు కొత్తవారైతే, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎంత తరచుగా పెట్టుబడి పెట్టాలి? ఏ కంపెనీ సరైనది అనే దానితో తరచుగా ఇబ్బంది పడుతుంటే, వారెన్ బఫెట్ ’20 పంచ్ కార్డ్ రూల్’ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
చాలా మంది పెట్టుబడిదారులు విఫలమవడానికి కారణం వారు మెరిసే ప్రతిదానినీ వెంబడించడం, ఇతరులు చూసే దాని ఆధారంగా ఎక్కువ ట్రేడ్‌లు చేయడం అని వారెన్ బఫెట్ అభిప్రాయపడ్డారు. వారు స్టాక్‌లో పెట్టుబడి పెట్టే ముందు తమ పరిశోధన చేయరు లేదా కంపెనీ ఆర్థిక ఆరోగ్యాన్ని అర్థం చేసుకోరు. ’20 పంచ్ కార్డ్ రూల్’ అనేది ఈ మనస్తత్వాన్ని మార్చడంలో మీకు సహాయపడే మానసిక వ్యాయామం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి