Investment Tips: తక్కువ పెట్టుబడితో కళ్లుచెదిరే రాబడి కావాలా? ఐదేళ్లల్లో అద్భుత రాబడినిచ్చే పథకాలు ఇవే..!

|

Jan 26, 2024 | 7:00 AM

గ్యారెంటీ రాబడిని పొందగలిగే పథకాలలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడే వారు చాలా మంది ఉన్నారు. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడని వారు, సురక్షితమైన పెట్టుబడి ఎంపికలను కోరుకుంటారు. మీరు కూడా అలాంటి పెట్టుబడి ఎంపికల కోసం చూస్తుంటే కేవలం 5 సంవత్సరాలలో మీకు మంచి రాబడిని ఇచ్చే పోస్టాఫీసు పథకాల గురించి ఓ సారి తెలుసుందాం.

Investment Tips: తక్కువ పెట్టుబడితో కళ్లుచెదిరే రాబడి కావాలా? ఐదేళ్లల్లో అద్భుత రాబడినిచ్చే పథకాలు ఇవే..!
Best Investment Scheme3
Follow us on

నేటి కాలంలో ప్రజలు మంచి రాబడిని అందిస్తున్న ఎస్‌ఐపీ ద్వారా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి వంటి మార్కెట్-లింక్డ్ పెట్టుబడి ఎంపికల్లో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతున్నారు. అయినప్పటికీ గ్యారెంటీ రాబడిని పొందగలిగే పథకాలలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడే వారు చాలా మంది ఉన్నారు. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడని వారు, సురక్షితమైన పెట్టుబడి ఎంపికలను కోరుకుంటారు. మీరు కూడా అలాంటి పెట్టుబడి ఎంపికల కోసం చూస్తుంటే కేవలం 5 సంవత్సరాలలో మీకు మంచి రాబడిని ఇచ్చే పోస్టాఫీసు పథకాల గురించి ఓ సారి తెలుసుందాం.

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పెట్టుబడికి గొప్ప ఎంపిక. దీనిని పోస్టాఫీసు ఎఫ్‌డీ అని కూడా అంటారు. మీరు పోస్టాఫీసులో 1, 2, 3, 5 సంవత్సరాలకు ఎఫ్‌డీ ఎంపికను పొందుతారు. కానీ మీరు 5 సంవత్సరాల ఎఫ్‌డీలో అత్యధిక లాభం పొందుతారు. ప్రస్తుతం మీరు 5 సంవత్సరాల ఎఫ్‌డీ పై 7.5 శాతం వడ్డీని పొందవచ్చు. ఇది కాకుండా ఐదు సంవత్సరాల ఎఫ్‌డీ లో పన్ను ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి దీనిని పన్ను ఆదా ఎఫ్‌డీ అని కూడా అంటారు.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్‌ఎస్‌సీ) కూడా సురక్షితమైన, హామీతో కూడిన రాబడి కోసం చూస్తున్న వారికి ఒక మంచి ఎంపిక. ఈ పోస్టాఫీసు పథకంలో కనీసం రూ. 1000 పెట్టుబడి పెట్టవచ్చు. ఇది 5 సంవత్సరాలలో మెచ్యూర్‌ అవుతుంది. ప్రస్తుతం ఈ పథకంపై వడ్డీ రేటు 7.7 శాతంగా ఉంది. ఇందులో వార్షిక ప్రాతిపదికన వడ్డీ జమ చేస్తారు. అయితే అది మెచ్యూరిటీ సమయంలో మాత్రమే చెల్లిస్తారు. ఇందులో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 ప్రకారం గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్‌సీఎస్‌ఎస్‌) అనేది హామీతో కూడిన రాబడిని కోరుకునే సీనియర్ సిటిజన్‌ల కోసం ఒక అద్భుతమైన పథకం. ఇందులో కనిష్టంగా రూ.1000, గరిష్టంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం కూడా 5 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది. ప్రస్తుతం దానిపై 8.2 శాతం వడ్డీ ఇస్తోంది. త్రైమాసిక ప్రాతిపదికన డిపాజిట్ చేసిన మొత్తంపై వడ్డీ ఇస్తారు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో కూడా పన్ను ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది కాకుండా వీఆర్‌ఎస్‌ తీసుకున్న 55-60 సంవత్సరాల వయస్సు ఉన్న  వ్యక్తులు, రిటైర్డ్ డిఫెన్స్ సిబ్బంది, వారి వయస్సు కనీసం 60 సంవత్సరాల పాటు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..