AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personal loans: తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్ కావాలా..? ఈ టిప్స్ పాటిస్తే చాలంతే..!

జీవతంలో అత్యవసర ఖర్చులు, ఆస్తుల కొనుగోలు, ఇతర అవసరాల కోసం రుణాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ సమయంలో బ్యాంకులు, ఇతర రుణదాతలను సంప్రదిస్తాం. వారి నుంచి వ్యక్తిగత రుణాలను తీసుకుని అవసరాలు గడుపుకొంటాం. వ్యక్తిగత రుణం కోసం ఎటువంటి పూచీకత్తు, ఆస్తిని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం మీకు వచ్చే ఆదాయం, క్రెడిట్ స్కోర్ ఆధారంగా మంజూరు చేస్తారు. సాధారణంగా వీటికి వడ్డీ రేటు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అయితే తక్కువ వడ్డీకే వ్యక్తిగత రుణం పొందటానికి కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి.

Personal loans: తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్ కావాలా..? ఈ టిప్స్ పాటిస్తే చాలంతే..!
Personal Loan
Nikhil
|

Updated on: Mar 06, 2025 | 3:45 PM

Share

మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు చేస్తాయి. మీకు 750 కంటే ఎక్కువ స్కోర్ ఉంటే రుణదాతలకు నమ్మకం కలుగుతుంది. కాబట్టి క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి. దాని కోసం క్రెడిట్ కార్డు బిల్లులు, ఈఎంఐలను సక్రమంగా గడువు లోపు చెల్లించాలి. క్రెడిట్ కార్డు పరిమితిలో 30 శాతం కంటే ఎక్కువ వాడకపోవడం మంచిది. అలాగే క్రెడిట్ నివేదికను తరచూ పరిశీలించుకోవాలి. ఏమైనా పొరపాట్లు ఉంటే సరి చేసుకోవాలి.

పరిశీలన

బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీలు), డిజిటల్ రుణదాతలు వివిధ ఆఫర్లు ప్రకటిస్తారు. తక్కువ వడ్డీ, జీరో ప్రాసెసింగ్ ఫీజు వంటివి వీటిలో ఉంటాయి. రుణం తీసుకునే ముందు వీటిని బాగా పరిశీలించాలి. ముందస్తు చార్జీలు, దాచిన ఖర్చులను కూడా తనిఖీ చేయాలి.

తక్కువ కాలపరిమితి

రుణం తీసుకున్న తర్వాత ప్రతి నెలా ఈఎంఐల రూపంలో వాయిదాలు చెల్లించాలి. ఎక్కువ కాలపరిమతిని ఎంచుకుంటే ఈఎంఐ తక్కువగా ఉంటుంది. కానీ వడ్డీ ఎక్కువ అవుతుంది. వీలున్నంత వరకూ తక్కువ కాల పరిమితిని ఎంపిక చేసుకోవాలి. తద్వారా వడ్డీ రూపంలో డబ్బులను ఆదా చేసుకునే వీలుంటుంది.

ఇవి కూడా చదవండి

ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు

బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రుణాలపై డిస్కౌంట్లు ప్రకటిస్తాయి. పండగ సీజన్లు, వివిధ సమయాల్లో వీటిని అమలు చేస్తాయి. ఉదాహరణకు మీరు ఒక ప్రముఖ కంపెనీలో పనిచేస్తుంటే కార్పొరేట్ టై అప్ ల ద్వారా మీకు తక్కువ వడ్డీకి రుణాలు లభించవచ్చు.

ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్లు

తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించిన ఖాతాదారులకు బ్యాంకులు ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్లు ప్రకటిస్తాయి. తక్కువ వడ్డీకే రుణాలను మంజూరు చేస్తాయి.

అనవసర రుసుములు

కొందరు రుణదాతలు వ్యక్తిగత రుణాలను మంజూరు చేసేటప్పుడు బీమా పాలసీలను కూడా విక్రయిస్తారు. దీని వల్ల మీకు ఖర్చు పెరుగుతుంది. కాబట్టి రుణ ఒప్పందం మీద సంతకం చేసేటప్పుడు అన్నింటినీ గమనించాలి.

ఎఫ్ డీలపై రుణం

మీకు ఫిక్స్ డ్ డిపాజిట్లు, ఇతర ఆస్తులు ఉంటే, వాటిపై రుణం తీసుకునే అవకాశం ఉంది. వీటికి వడ్డీ తక్కువ వడ్డీ వసూలు చేస్తారు. సౌకర్యవంతమైన ఎంపికలు, తక్కువ డాక్యుమెంటేషన్ తో తొందరగా మంజూరవుతాయి.

తక్కువ వడ్డీకి బ్యాలెన్స్ బదిలీ

మీకు ఇప్పటికే అధిక వడ్డీకి వ్యక్తిగత రుణం ఉంటే దాన్ని తక్కువ వడ్డీ వసూలు చేస్తున్న మరో రుణదాతకు బదిలీ చేయవచ్చు. ఈ ప్రక్రియను బ్యాలెన్స్ బదిలీ అంటారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి