Volvo Car: కస్టమర్లకు షాక్‌ ఇవ్వనున్న వోల్వో .. వచ్చే ఏడాది మోత మోగనున్న కార్ల ధరలు..!

|

Dec 30, 2021 | 8:56 PM

Volvo Car: వచ్చే ఏడాదిలో కస్టమర్లకు పలు వాహన సంస్థలు షాకివ్వనున్నాయి. ముందే ధరలతో సతమతమవుతుంటే.. కార్లు, బైక్‌ల తయారీ కంపెనీలు కూడా ధరలను..

Volvo Car: కస్టమర్లకు షాక్‌ ఇవ్వనున్న వోల్వో .. వచ్చే ఏడాది మోత మోగనున్న కార్ల ధరలు..!
Follow us on

Volvo Car: వచ్చే ఏడాదిలో కస్టమర్లకు పలు వాహన సంస్థలు షాకివ్వనున్నాయి. ముందే ధరలతో సతమతమవుతుంటే.. కార్లు, బైక్‌ల తయారీ కంపెనీలు కూడా ధరలను పెంచేందుకు రెడీ అవుతున్నాయి. ముడి సరుకుల ధరలు, ఇతర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో ధరలను పెంచక తప్పదని చెబుతున్నాయి. ఇక స్వీడిష్ కార్ల తయారీ సంస్థ వోల్వో కూడా కస్టమర్లకు షాకివ్వనుంది. భారతదేశంలో ఎంపిక చేసిన మోడళ్లపై జనవరి 1వ తేదీ నుంచి ధరలను పెంచనుంది. రూ. లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఈ ధరల పెంచనున్నట్లు వెల్లడించింది. ముడిసరుకు ధరలు పెరగడం వల్ల ధరలను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే దేశంలోని అనేక ఇతర కార్ల కంపెనీలు కూడా జనవరి 1 నుండి కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి.

ఏ కారు ఎంతంటే..
సవరించిన ధరల ప్రకారం.. SUV XC40 T4R డిజైన్ ఎడిషన్ రూ. 2 లక్షల పెరుగుదలతో రూ. 43.25 లక్షలు, XC60 B5 ఇన్‌స్క్రిప్షన్ SUV ధర రూ. 1.6 లక్షల పెరుగుదలతో రూ. 63.5 లక్షలుగా ఉంటుందని వోల్వో కార్ ఇండియా తెలిపింది. అదేవిధంగా వచ్చే నెల నుండి కంపెనీ సెడాన్ S90 కారు రూ. 3 లక్షలు పెరుగుదలతో రూ. 64.9 లక్షలుగా మారనుంది. ఇక SUV XC90 రూ. 90.9 లక్షలకు లక్ష రూపాయల పెరిగిన ధరతో అందుబాటులో ఉంటుంది. ధరల పెంపునకు గల కారణాన్ని కంపెనీ వివరిస్తూ, సంవత్సరాలుగా, విదేశీ మారకద్రవ్యంలో అస్థిరత, ప్రపంచ సరఫరాలో అంతరాయం, మహమ్మారి మరియు ద్రవ్యోల్బణం కారణంగా విధించిన పరిమితులు మొదలైన కారణాలతో ధరలు పెరిగాయని వోల్వో భారత మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి మల్హోత్రా తెలిపారు.

స్కోడా ఆటో తన అన్ని వాహనాల ధరలను జనవరి 1, 2022 నుండి మూడు శాతం వరకు పెంచనున్నట్లు ఇటీవల ప్రకటించింది. దేశీయ మార్కెట్లో, స్కోడా ఆటో కుష్క్, కొడియాక్, ఆక్టావియాతో సహా అనేక మోడళ్లను విక్రయిస్తోంది. తయారీ వ్యయం, నిర్వహణ ఖర్చులు పెరగడంతో ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ బ్రాండ్ డైరెక్టర్ జాక్వెస్ హోలిస్ ఒక ప్రకటనలో తెలిపారు. స్టీల్, అల్యూమినియం వంటి ముడిసరుకు ధరలు పెరగడంతో వాహనాల ధరలను పెంచాల్సి వస్తోందని తెలిపారు. అంతకుముందు, మారుతీ సుజుకీ ఇండియా, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్, మెర్సిడెస్ బెంజ్ ఆడి మరియు హోండా కార్స్ వంటి ఆటో కంపెనీలు వచ్చే నెల నుండి వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ధరలను పెంచడానికి ధరల పెరుగుదల ప్రధాన కారణమని కంపెనీలన్నీ పేర్కొన్నాయి.

ఇవి కూడా చదవండి:

Gold Price: వినియోగదారులకు కొత్త ఏడాదిలో బంగారం ధరలు షాకివ్వనున్నాయా..? కారణం ఏమిటి..?

Indian Railways: రైల్వే స్క్రాప్ విక్రయాలతో రూ. 402.5 కోట్లు ఆదాయం.. గతేడాదితో పోలిస్తే..