Volkswagen Virtus Sedan: దేశీ మార్కెట్‌లో వోక్స్‌వ్యాగ‌న్ విర్టస్ విడుదల.. ఫీచర్స్‌.. ధర ఎంతంటే..!

| Edited By: Team Veegam

Jun 13, 2022 | 2:04 PM

Volkswagen Virtus Sedan: భారత్ లో కొత్త కొత్త కార్లు విడుదలవుతున్నాయి. కస్టమర్లను మరింతగా ఆకర్షించుకునేందుకు అత్యాధునిక ఫీచర్స్ ను జోడిస్తూ మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి..

Volkswagen Virtus Sedan: దేశీ మార్కెట్‌లో వోక్స్‌వ్యాగ‌న్ విర్టస్ విడుదల.. ఫీచర్స్‌.. ధర ఎంతంటే..!
Follow us on

Volkswagen Virtus Sedan: భారత్ లో కొత్త కొత్త కార్లు విడుదలవుతున్నాయి. కస్టమర్లను మరింతగా ఆకర్షించుకునేందుకు అత్యాధునిక ఫీచర్స్ ను జోడిస్తూ మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఇర భార‌త్‌లో వోక్స్‌వ్యాగ‌న్ త‌న సరికొత్త విర్ట‌స్ సెడాన్‌ను విడుదల చేసింది. కంఫ‌ర్ట్‌లైన్‌, హైలైన్‌, టాప్‌లైన్ వంటి నాలుగు ట్రిం ఆప్ష‌న్స్‌లో ల‌భించే విర్ట‌స్ ధర రూ 11.22 ల‌క్ష‌ల నుంచి రూ 17.92 ల‌క్ష‌ల మ‌ధ్య ఉండనుంది. విర్ట‌స్ కోసం వోక్స్‌వ్యాగ‌న్ ఎంక్యూబీ-ఏఓ-ఐఎన్ ప్లాట్‌ఫాంను ఉప‌యోగించి సరికొత్త వాహనాన్ని డెవ‌ల‌ప్ చేసింది కంపెనీ.

వోక్స్‌వ్యాగ‌న్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్‌తో పాటు ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌తో క‌స్ట‌మ‌ర్ల‌ను మరింతగా ఆక‌ట్టుకుంటుంది. ఎస్‌యూవీ టైగున్ త‌ర‌హాను పోలిఉండేలా విర్ట‌స్ ఇంటీరియ‌ర్ లేఅవుట్‌ను డిజైన్ చేసింది కంపెనీ. 10 ఇంచ్ ఇన్ఫోటెయిన్‌మెంట్ డిస్‌ప్లే, వైర్‌లెస్ అండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే వంటి పీచ‌ర్లు దీని సోంతం.

ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు

ఇవి కూడా చదవండి

కాగా, ఇందులో అనేక రకాల ఫీచర్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లైస్ స్మార్ట్‌పోన్ చార్జ‌ర్‌, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి. ఇక ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎల‌క్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్‌, రియ‌ర్ వ్యూ కెమెరా, మ‌ల్టీ కొలిజ‌న్ బ్రేక్స్‌, టైర్ డిఫ్లేష‌న్ వార్నింగ్ వంటి 40కిపైగా సేఫ్టీ ఫీచ‌ర్స్ ఈ వాహనంలో ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ చదవండి: