మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఉన్న డిమాండ్ ను అందిపుచ్చుకునేందుకు అన్ని కంపెనీలు పోటీ పడుతున్నాయి. అందుకే పెద్ద సంఖ్యలో కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. ఏసర్ వంటి టెక్ జెయింట్స్ కూడా ఈవీ ఫోర్ట్ ఫోలియోలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. దీంతో ఇప్పటికే ఉన్న ఈవీ రంగంలో ఉన్న కంపెనీలు తమ ఉత్పత్తులను మరింత విస్తృతంగా మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇదే క్రమంలో వేగ్ ఆటోమొబైల్స్ ఓ హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేసింది. వేగ్ ఎస్60 పేరిట ఈవీ ఇండియా ఎక్స్ పో 2023లో దీనిని ఆవిష్కరించింది. దీని ధర రూ. 1.25లక్షల నుంచి ప్రారంభమవుతుంది. వినియోగదారులు ఈ ఎస్60 ఎలక్ట్రిక్ స్కూటర్ ను మన దేశంలోని అథరైజ్డ్ డీలర్ షిప్స్ నుంచి కొనుగోలు చేయొచ్చు. రానున్న మరికొన్ని నెలల్లో ఈ ఎస్ 60 స్కూటర్ కు అప్ గ్రేడెట్ వెర్షన్ ను కూడా అందించే అవకాశం ఉంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. మ్యాట్ బ్లాక్, లైట్ గ్రే, వైట్, లైట్ గ్రీన్ రంగుల్లో లభ్యమవుతుంది. దీని ప్రారంభ ధర పన్నులు లేకుండా రూ. 1.25లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
ఈ స్కూటర్ ఏఐఎస్156, ఫేజ్ 2 ధ్రువీకరణతో కూడిన 3కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. వేగ్ ఎస్60 ఒక హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది సింగిల్ చార్జ్ పై 120 కిలోమీటర్లకు పైగా రేంజ్ ను ఇస్తుంది. ఇది 2.5కిలోవాట్ల సామర్థ్యంతో కూడిన మోటార్ ఉంటుంది. గరిష్టంగా గంటకు 75కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ బ్యాటరీ ఫుల్ చార్జ్ అవడానికి నాలుగు నుంచి ఐదు గంటలు పడుతుంది.
ఈ స్కూటర్లో డిజిటల్ డిస్ ప్లే ఉంటుంది. కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ తో వస్తుంది. మూడు రైడింగ్ మోడ్లు అందుబాటులో ఉంటాయి. సిటీ పరిధిలో అయిన టౌన్లలో అయినా మంచి పనితీరుని అందిస్తుంది. ఈ స్కూటర్ హైడ్రాలిక్ సస్పెన్షన్ తో వస్తుంది. సీట్లు వెడల్పుగా ఉంటాయి. రైడర్ కు సౌకర్యంతో పాటు సులువైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. దీని లుక్ కూడా చాలా స్టైలిష్ గా ఉంటుంది. స్పూత్ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. దీని పనితీరు మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. తక్కువ ధరలో టాప్ రేంజ్ కావాలనుకునే వారికి ఇదే బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..